యెరూషలేము ఉద్ధరణము

8 1. సైన్యములకధిపతియైన ప్రభువువాణి ప్రత్యక్షమై జెకర్యాతో ఇట్లనెను: 2. ”మిగుల ఆసక్తితో నేను సియోను విషయములో రోషము కలిగియున్నాను. బహురౌద్రము గలవాడినై దాని విషయములో నేను గాఢానురక్తి కలిగియున్నాను.

3. నేను సియోనుకు మరలివచ్చి దాని నడుమ వసింతును. అది విశ్వస నీయమైన నగరముగా చలామణియగును. సైన్యముల కధిపతియగు ప్రభువు పర్వతమును   పవిత్రనగరమని పిల్తురు.

4. పండుముదుసలులు వృద్ధులేమి, వృద్ధు రాండ్రేమి ఇంకను మరల ఊతకఱ్ఱ పట్టుకొని యెరూషలేము నగరవీధులలో కూర్చుందురు.

5. ఆ నగరపురవీధులు మరల ఆటలాడుకొను బాలబాలిక లతో నిండియుండును. ఇదియే సైన్యములకధిపతి యగు ప్రభువు వాక్కు.

6. ఈ ప్రజలలో అపుడు శేషించియున్నవారికి ఇది అబ్బురముగానున్నను, నాకును ఆశ్చర్యమని తోచునా?

7. సైన్యములకధిపతియగు ప్రభువు వాణి ఇట్లనెను: నా ప్రజలను బందీలనుగా కొనిపోయిన దేశములనుండి నేను వారిని విడిపించుకొని వత్తును.

8. వారిని తూర్పుపడమరలనుండి తీసికొని వచ్చి యెరూషలేమున పాదుకొల్పుదును. వారు నా ప్రజల గుదురు, నేను వారికి దేవుడనగుదును. న్యాయ యుక్త ముగను,  విశ్వాసయోగ్యముగను  నేను  వారిని పాలింతును”.

9. సైన్యములకధిపతియగు ప్రభువు ఇట్లను చున్నాడు: ”నా మందిర నిర్మాణమునకు పునాదు లెత్తినపుడు ప్రవక్తలనోట పలుకబడిన పలుకులనే ఈ కాలమునను వినువారలారా! మీరు ధైర్యము తెచ్చు కొనుడు.

10. ఆ కాలమునకు ముందు పేదరికము వలన ఎవడును నరులను, పశువులను కూలికిని, బాడుగకును కుదుర్చుకోజాలడయ్యెను. ఎవనికిని శత్రుభయము తప్పలేదు. ఏలయన, నేను ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకొనునట్లు చేసితిని.

11. కాని ఇప్పుడు ఈ ప్రజలలో శేషించియున్న వారిపట్ల నేను మునుపు విరోధినైనట్లు ఇపుడు విరోధిగా ఉండను. 12. వారు శాంతితో పైరులు వేసికొందురు. వారి ద్రాక్షలు ఫలించును. నేల పంటలుపండును. వానలు మెండుగాకురియును. నా జనులలో మిగిలియున్న వారికి నేను వీినన్నింని హక్కుభుక్తముగా ఇత్తును”. ఇదియే సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు.

13. యూదా, యిస్రాయేలు ప్రజలారా! పూర్వము అన్య జాతి ప్రజలు మీ పేరును ఎట్లు శాపములలో వాడు కొింరో, అటులనే మీ పేరును దీవెనలలో వాడుకొను నట్లు నేను మిమ్ము రక్షింతును. కావున మీరు ధైర్యము నొందుడు, భయపడకుడు.”

14. సైన్యములకధిపతియగు ప్రభువు ఇట్లను చున్నాడు: ”మీ పూర్వులు నాకు కోపము రప్పించి నపుడు దయచూపక నేను వారిని శిక్షింపనెంచితిని. నా సంకల్పమును మార్చుకోనైతిని.

15. కాని యిప్పుడు నేను యూదా, యిస్రాయేలు ప్రజలకు మేలు చేయ నెంచుచున్నాను. కనుక మీరు భయపడవలదు.

16. మీరు చేయవలసిన కార్యములివి. ఒకరితోనొకరు సత్యము పలుకుడు. మీ న్యాయ స్థానములలో శాంతికి ఆలవాలమైన న్యాయము జరిగింపుడు.

17. ఒకరి కొకరు కీడు తలపెట్టకుడు. కూటసాక్ష్యము పలుక కుడు. ఇి్ట పనులు నాకు గిట్టవు”. ఇది ప్రభువు వాక్కు.

18. సైన్యములకధిపతియగు ప్రభువు వాణి దిగివచ్చి జెకర్యాతో ఇట్లనెను: 19. ”నాలుగవనెలలో ఉపవాసము, ఐదవనెలలో ఉపవాసము, ఏడవనెలలో ఉపవాసము, పదియవనెలలో ఉపవాసదినములు ఇకమీదట యూదా ప్రజలకు సంతోషకరములును, ఆనందప్రదములునైన ఉత్సవదినములు అగును. మీరు మాత్రము శాంతిని, సత్యమును ప్రేమింపుడు.”

20. సైన్యములకధిపతియగు ప్రభువు ఇట్లు అనుచున్నాడు: ”మహానగరములనుండి ప్రజలు యెరూషలేమునకు ఏతెంచు కాలము వచ్చుచున్నది.

21. ఒక నగరప్రజలు మరియొక నగరజనుల యొద్దకు వచ్చి ‘మేము సైన్యములకధిపతియగు ప్రభువును ఆరాధింప బోవుచున్నాము. ఆయన దీవెనలు అడుగుకో బోవుచున్నాము. మీరును మాతో ఆలస్యము చేయక రండు” అని చెప్పగా వారు ‘మేము వత్తుము’ అని అందురు.

22. మహాజాతులును, బలసంపున్ను లైన ప్రజలును సైన్యములకధిపతియగు ప్రభువును వెదకుట కును, ప్రభువును సమాధానపరుచుటకును యెరూషలేము నకు వచ్చెదరు.

23. సైన్యములకధిపతియగు ప్రభువు చెప్పునది ఏమనగా, ఆ దినములలో అన్యజాతి ప్రజలు పదిమంది ఒక్కయూదుని చెంగుపట్టుకొని ‘దేవుడు మీకు తోడుగానున్నాడని వింమి. కనుక మేమును మీతోకూడా వచ్చెదము” అని పలుకుదురు.

Previous                                             

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము