యెహోషువ వాగ్దత్తభూమిని జయించుట సన్నాహములు

వాగ్దత్తభూమిని ప్రవేశించుటకు పిలుపు

1 1. దేవుడైన యావే తన సేవకుడైన మోషే మరణించిన పిమ్మట, మోషే పరిచారకుడును, నూను కుమారుడైన యెహోషువను ఇట్లు ఆజ్ఞాపించెను: 2. ”నా సేవకుడు మోషే గతించెను. కనుక లెమ్ము! నీవు ఈ జనులందరితో యోర్దాను నది దాి, నేను యిస్రా యేలీయులకిత్తునని ప్రమాణము చేసిన దేశమునకు పొమ్ము.

3. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు ప్టిెన భూమినెల్ల మీకిచ్చెదను.

4. మహారణ్యము, లెబానోను మొదలుకొని యూఫ్రీసు మహానదివరకు, పశ్చిమమున హిత్తీయులదేశము మీదుగా మహా సముద్రము వరకును విస్తరించిన భూమి అంతయు మీకే చెందును.

5. నీ జీవితకాలములో ఎవ్వరును నిన్ను ఎదిరింపజాలరు. మోషేకువలె నీకును నేను తోడైయుందును. నిన్నువిడువను. నిన్ను ఎడబాయను.

దేవుని సహాయమునకు ధర్మశాస్త్రము అనుసరణ

6. ధైర్యస్థైర్యములు కలిగివుండుము. నేను ఈ జనుల పితరులకు ఈ దేశమును ఇత్తునని ప్రమా ణము చేసితిని. అట్లే నీవు దానిని యిస్రాయేలీయులకు పంచియిత్తువు.

7. ధైర్యస్థైర్యములు మాత్రము కోల్పో కుము. నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రమును తు.చ.తప్పక అనుసరింతువేని నీవు కృతార్థుడవగు దువు.

8. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. అహోరాత్రములు మననము చేసికొనుము. దానిలో చెప్పిన న్యాయములన్నిని పాింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నేరవేరును. నీవు కృతా ర్థుడవగుదువు. 9. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము. నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీవు నడుచు మార్గమంతిలో నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళల నీకు తోడైయుండును”

యోర్దాను ఆవలి తీరమువారి తోడ్పాటు

10-11. అంతట యెహోషువ ఈ విధముగా జనులకు చెప్పవలసినదిగా నాయకులను ఆజ్ఞా పించెను. ”సరిపడు ఆహారపదార్థములు సమకూర్చు కొనుడు. ఎందుకనగా మూడుదినములలో యావే మీకిత్తునని వాగ్ధానము చేసిన దేశమును వశము చేసుకొనుటకు యోర్దాను నదిని దాట వలయును”.

12. యెహోషువ రూబేను, గాదు సంతతివారిని, మనష్షే సంతతివారిలో సగముమందిని పిలచి 13. ”మీ దేవుడైన ప్రభువు ఈ భూమిని మీకు ఒసగును. మీకు విశ్రాంతిని ప్రసాదించును” అని ప్రభువు దాసుడు మోషే మీతో చెప్పిన విషయము జ్ఞప్తికి తెచ్చుకొనుడు.

14. మీ ఆలుబిడ్డలు, పశువుల మందలు మోషే మీకిచ్చిన యోర్దాను ఈవలితీరమున నిలువవచ్చును. కాని మీరు మీ బలగముతో నదిదాి పోవలయును. మీలో వీరులైనవారు ఆయుధములతో ముందుగా నడచి మీసోదరులకు సహాయము చేయ వలయును. మీకువలె మీసోదరులకును ప్రభువు విశ్రాంతి దయచేయువరకు, వారు ప్రభువు ఇచ్చెదనన్న భూమిని వశము చేసికొనునంతవరకు వారితో కలసి పోరాడుడు.

15. అటుపై యావే సేవకుడగు మోషే తూర్పున యోర్దాను ఈవలి తీరమున మీకిచ్చినది, మీ స్వాధీనములో నున్నదియునగు దేశమునకు మీరు తిరిగిరావచ్చును” అని చెప్పెను.

16. అంతట వారు ”నీవు చెప్పినట్లెల్ల చేయుదుము. నీవు పొమ్మన్న చోికి పోవుదుము.

17. సర్వవిధముల మోషే మాట విని నట్లు నీ మాట విందుము. మన దేవుడైన యావే మోషేకువలెనె నీకును బాసటయైయుండునుగాక!

18. నీ ఆనతికి ఎదురుతిరిగి నీ మాట విననివారికి మరణ శిక్ష విధింపుము. ధైర్యస్థైర్యములతో ఉండుము” అని యెహోషువతో పలికిరి.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము