ఉపోద్ఘాతము:

పేరు: హీబ్రూ భాషలో ఈ గ్రంథము పేరు ‘వయ్యిఖ్రా’ (ఇజుఖఖ|గష్ట్రజు) అనే పదము ఆధారముగా యెంచుకొనబడినది. ఈ మాటకు ”పిలిచెను” లేదా ”ఆహ్వానించుచున్నాడు” అని అర్ధము. ఈ గ్రంథమునకు గ్రీకుభాషలో ‘లెవికోన్‌ / లెవికస్‌’ అని నామకరణము చేసిరి. ఈ గ్రీకు పదభావమే గ్రంథము పేరుగా నిలిచినది. లేవీయులను, లేవీతెగలోని యాజకులను ఆధారముగా చేసుకున్నందుచే ఆ పేరుతో పిలవడము జరిగినది. అయితే గ్రంథములో ఒక్క లేవీయుల గూర్చి మాత్రమే వుండదు. ఇతర అంశములు కూడా వున్నాయి.

రచయిత(లు):   మోషే వ్రాసెనని సాంప్రదాయక అభిప్రాయము. ఈ పంచకాండములను (ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ) క్రీ.పూ 6వ శతాబ్దములో బబులోనియా ప్రవాసానంతరము సంకలనము చేయబడెనని పలువురు ఆధునిక పండితుల అభిప్రాయము.

చారిత్రక నేపథ్యము: యావే దేవుని సాన్నిధ్యము యిస్రాయేలు ప్రజల మధ్య సమావేశపు గుడారములో నెలకొనియుండుటను నిర్గమకాండములో చూచెదము (నిర్గమ 40:34,35). తమ మధ్య నివాసమైయున్న పవిత్రదేవుని ప్రజలుగా, యిస్రాయేలు ప్రజలు మరి ముఖ్యముగ ఆ పవిత్రదేవుని సాన్నిధ్యమున ప్రజల పక్షమున సేవచేయు యాజకులు, లేవీయులు తాము ఏ విధముగా పవిత్రముగ నుండవలయునో తెలుపుట ఈ గ్రంథములోని ముఖ్యాంశము (10:3, 11:44, 19:2, 20:7, 26, 21:8). దేవుడు అబ్రహాము పితామహునికి ఇచ్చిన వాగ్ధానము ప్రకారము యిస్రాయేలు ప్రజలు ఒక పరిశుద్ధ జనముగా తీర్చిదిద్దబడిన వైనమును ఈ గ్రంథము వివరించును.

క్రీస్తుకు అన్వయము: 16:29-31; 17:11; 19:18; 20:7-8; నూతన నిబంధన – పరిశుద్ధత, రక్తపరిహారము (చూడుము హెబ్రీ 9:12; 10:1); క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధత (1 పేతు 1:15). దేవుని ప్రేమతో పాటు పొరుగువారి ప్రేమ (లేవీ.19:18; మత్త. 22:39; మార్కు 12:28-34).

 

Previous                                                                                                                                                                                              Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము