నైవేద్యములను భుజించువారు పవిత్రులై ఉండవలయును

1. యాజకులు

22 1. ప్రభువు మోషేతో ఇట్లనెను. అహరోను తోను, అతని కుమారులతోను ఇట్లు చెప్పుమనెను: 2. ”మీరు పవిత్రమైన నా నామమును అమంగళము చేయకూడదు. యిస్రాయేలీయులు నాకు అర్పించు నైవేద్యములను పవిత్రముగా ఎంచవలయును. నేను ప్రభుడను.

3. నీ వంశజులలో అశుచిమంతుడైనవాడు ఎవడైనను యిస్రాయేలీయులు నాకర్పించు పవిత్ర నైవేద్యములు భుజించెనేని, అతనిని నా సన్నిధినుండి శాశ్వతముగా బహిష్కరింపవలయును.

నేను ప్రభుడను.

4-5. అహరోను వంశజులలో కుష్ఠవ్యాధిగల వాడుగాని, పుండునుండి రసికారువాడుగాని, తాను శుచిమంతుడగువరకు నా నైవేద్యములను భుజింప రాదు. శవమును తాకిన వస్తువులు అంటుకొనినవాడు, రేతఃస్ఖలనము కలిగినవాడు, శుచిత్వములేని పురు గును, నరుని ముట్టుకొనినవాడు అశుచిమంతు డగును. 6. అి్ట యాజకుడు సాయంకాలమువరకు అశుచిమంతుడుగనేయుండును. కనుక అతడు సాయంత్రమున స్నానముచేయువరకు నైవేద్యములను భుజింపరాదు.

7. ప్రొద్దుగ్రుంకిన పిదప అతడు శుద్ధుడగును. అప్పుడు మాత్రమే పవిత్రనైవేద్యములను ఆరగింప వచ్చును. 8.యాజకుడు సహజముగా చనిపోయిన, లేక వన్యమృగములు చంపిన పశువును భుజింప రాదు. ఈ నియమము మీరినవాడు అశుద్ధుడగును.

9. యాజకులెల్లరును నా ఆజ్ఞలు పాింపవలయును. లేదేని వారు పాపము మూటకట్టుకొని ప్రాణములు కోల్పోవుదురు. ప్రభుడనైన నేను వారిని పవిత్రులను చేసితిని.

2. యాజకులు కాని గృహస్థులు

10. యాజకులు కాని గృహస్థులు ఎవరును నైవేద్యములను ఆరగింపరాదు. యాజకుని ఇంికి వచ్చిన అతిథిగాని అతని సేవకుడుగాని వానిని ముట్టు కోరాదు.

11. కాని యాజకుడు డబ్బుతో కొనితెచ్చు కొన్న బానిస అయిన లేక అతని ఇంట ప్టుిన బానిస అయినను వానిని భుజింపవచ్చును.

12. యాజకుని కుమార్తె ఎవరైన అన్యుడిని పెండ్లియాడెనేని ఆమె నైవేద్యములను ఆరగింపరాదు.

13. కాని ఆమె వితంతువైనను లేక విడాకులు పొందినదైనను సంతాన భాగ్యములేక బాల్యమున ఉన్నప్పివలె ప్టుినింట వసించుచూ తండ్రి కొనివచ్చిన నైవేద్యములను భుజింపవచ్చును. అన్యులెవరును నైవేద్యములను ముట్టుకోరాదు.

14. ఎవరైన ప్రమాదవశమున వానిని తినిన యెడల ఆ భోజనము వెలను, మరి అదనముగా దాని ఐదవవంతు సొమ్మును కూడ కలిపి యాజకునకు ముట్టజెప్పవలయును.

15. యిస్రాయేలీయులు ప్రభువునకు అర్పించు పవిత్ర నైవేద్యములను వారు అపవిత్రపరుపరాదు.

16. అటుల చేసినవారు దోషపరిహార బలిని అర్పింపవలయును. ప్రభుడనైన నేను వాిని పవిత్రము చేసితిని”.

3. బలిపశువుల యోగ్యత

17-19. ప్రభువు మోషేకు అహరోనుతోను, అతని కుమారులతోను, యిస్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుమనెను: ”యిస్రాయేలీయులైనను, వారి చెంత వసించు పరదేశులైనను, మ్రొక్కుబడిగానైన లేక స్వేచ్ఛగాయైన దహనబలులను అర్పింతురేని ఆ బలిపశువులు అవలక్షణములులేని గోవులలో, గొఱ్ఱెలలో, మేకలలో మగదానిని అర్పింపవలయును. 20. లేదేని ప్రభువు వానిని అంగీకరింపడు.

21. ఎవరైన మ్రొక్కుకొనిగాని, స్వేచ్ఛగాగాని ప్రభువునకు ఎడ్లను, గొఱ్ఱెలను, మేకలను సమాధాన బలిగా అర్పింతురేని ఆ బలిపశువులు అవలక్షణ ములులేనివై యుండవలయును. లేనిచో ప్రభువు వానిని అంగీకరింపడు.

22. ప్రభువునకు అర్పించు జంతువులు కుింవి, అవివి, అంగచ్ఛేదనము చేయబడినవి, గజ్జికురుపులు కలవియైయుండరాదు. అి్టవానిని ప్రభువు పీఠముపై బలిఈయరాదు.

23. మీరు స్వేచ్ఛాబలులు అర్పించునపుడు సరిగా పెరుగని పశువులనుగాని, వికృతరూపము కలవానినిగాని అర్పించిన అర్పింపవచ్చును. కాని మ్రొక్కుబడి బలులు అర్పించునపుడు మాత్రము అటుల చేయరాదు.

24. వృషణములు నలిగిన, గాయపడిన, కోసిన పశువులను ప్రభువునకు అర్పింపరాదు. మీ దేశమున ఈ పద్ధతి చెల్లదు.

25. ప్రభువునకు బలిగా అర్పించుటకై పరదేశులు అి్టవానిని కొనివచ్చినను మీరు అంగీకరింపరాదు. అవయవలోపము ఉన్నందున అవి అంగీకారయోగ్య ములుకావు.”

26. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: 27. ”దూడయేగాని, గొఱ్ఱెపిల్లయేగాని, మేకపిల్లయేగాని ప్టుిన తరువాత వానిని ఏడు రోజులపాటు తల్లితో ఉండనీయవలయును. ఎనిమిదవనాినుండి వానిని ప్రభువునకు బలిగా అర్పింపవచ్చును.

28. కాని తల్లిని, వాని పిల్లలతో కలిపి మీరు ఒకేనాడు ప్రభువునకు బలి ఈయరాదు.

29. మీరు ప్రభువునకు కృతజ్ఞతాబలిని అర్పించుబలి అంగీకారయోగ్యమైనదై యుండవలయును.

30. బలిపశువు మాంసమును మరునాికి మిగులనీయకుండ ఆనాడే భుజింప వలయును. నేను ప్రభుడను.

4. తుది సందేశము

31. మీరు నా ఆజ్ఞలను పాింపుడు. నేను ప్రభుడను.

32. మీరు నా పవిత్రనామమును అమంగళము చేయకుడు. యిస్రాయేలీయులెల్లరును నన్ను పవిత్రునిగా గణింపవలయును. మిమ్ము పవిత్రు లను చేయు ప్రభుడను నేనే.

33. నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి మీకు దేవుడనైతిని. నేను ప్రభుడను.”

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము