మోషే అద్భుతశక్తులను పొందుట

1. అప్పుడు మోషే వారు నన్ను నమ్మరు, నా మాటలు వినరు. యావే నీకు ప్రత్యక్షము కాలేదని నాతో అందురు అని బదులివ్వగా 2. యావే ”నీ చేతిలో ఉన్నదేమి?” అని మోషేను అడిగెను. అతడు ”కఱ్ఱ” అని బదులు పలికెను.

3. యావే ”దానిని నేలమీద పడవేయుము” అనెను. మోషే కఱ్ఱను నేలమీద పడవేయగా అది పాముగా మారెను. మోషే వెనుకంజవేసెను.

4. యావే ”నీ చేయిచాచి దాని తోకపట్టుకొనుము” అనెను. మోషే చేయిచాచి దానిని పట్టుకొనెను. అతని చేతిలో పాము కఱ్ఱగామారెను.

5. యావే మోషేతో ”ఇక ఇట్లే చేయుము. అప్పుడు వారు తమ పితరులదేవుడు, అబ్రహాముదేవుడు, ఈసాకుదేవుడు, యాకోబుదేవుడు అయిన యావే నిజముగా నీకు ప్రత్యక్షమయ్యెనని నమ్ముదురు” అనెను.

6. మరల యావే మోషేతో మ్లాడుచు ”నీ చేతిని నీ రొమ్మున ఉంచుకొనుము” అని చెప్పెను. మోషే తనచేతిని రొమ్మున ఉంచుకొనెను. అతడు దానిని వెలుపలికి తీసినపుడు కుష్ఠమయమై మంచు వలె తెల్లగా అయ్యెను” 7. యావే ”తిరిగి నీ చేతిని రొమ్మున పెట్టుకొనుము” అనెను. మోషే తిరిగి తన చేతిని రొమ్మున పెట్టుకొనెను. దానిని వెలుపలికి తీసినపుడు అది మిగిలిన అతని శరీరమువలె యథాప్రకారముగా అయ్యెను.

8. అప్పుడు యావే ”వారు మొది సూచననుబ్టి నిన్నునమ్మక, నీ మాట వినకపోయినను ఈ రెండవసూచనయైన వారికి నమ్మకముప్టుించును.

9. వారు ఈ రెండుసూచనలు నమ్మనిచో, నీ మాటలు వారి చెవికిఎక్కనిచో నైలునది నుండి నీరుతెచ్చి పొడినేల మీద పోయుము. ఆ నీరు నేలమీద నెత్తురుగా మారును” అని అతనితో అనెను.

మోషేవాణియైన అహరోను

10. అంతట మోషే యావేతో ”ప్రభూ! నీవు ఈ దాసునితో మ్లాడుటకు ముందుగాని, తరువాత గాని ఏనాడును నేను నా జీవితములో మాట నేర్పరిని కాను. బండనాలుకవలన తడవుకొనుచు మ్లాడు వాడను” అనెను.

11. దానికి యావే ”మానవునకు నోరిచ్చినది ఎవరు? అతనిని మూగవానిగాగాని, చెవివానిగాగాని, చూపుగలవానిగాగాని, చూపులేని వానిగాగాని చేసినది ఎవరు? యావేనైన నేనుకానా?

12. నీవిక వెళ్ళుము. మ్లాడుటకు నేను నీకు సాయము చేయుదును. నీవు ఏమిచెప్పవలయునో బోధింతును” అనెను.

13. అయితే మోషే ”ప్రభూ! నీకు ఇష్టమైన వానిని మరొకనిని పంపుము” అనెను.

14. ఈ మాటలకు యావే మోషేమీద మండిపడెను. ”నీ సోదరుడును, లేవి తెగవాడునగు అహరోను ఉన్నాడు కదా! అతడు మంచిమాటకారి అని నేనెరుగుదును. ఇదిగో! అతడిప్పుడే నిన్నుకలసికొనుటకు వచ్చు చున్నాడు. నిన్ను చూచినపుడు అతని హృదయము ఆనందముతో నిండును.

15. నీవు అతనితో మాట లాడుము. ఏ సందేశము పలుకవలెనో అతనికి చెప్పుము. మ్లాడుటకు మీయిరువురికి నేను తోడ్పడు దును. మీరిరువురు ఏమిచేయవలయునో తెలియ జేసెదను.

16. అతడే నీకు బదులుగా ప్రజలతో మ్లాడును. అతడే నీ వాణియగును. నీవేమో అతనిని ఉత్తేజపరచు దేవునివింవాడవు అగుదువు.

17. ఈ కఱ్ఱను చేతపట్టుకొనుము. దీనితో నీవు సూచకక్రియలు చేయుదువు” అనెను.

మోషే మిద్యాను వీడి ఐగుప్తు చేరుట

18. పిమ్మట మోషే తనమామ యిత్రో కడకు తిరిగివచ్చి అతనితో ”ఐగుప్తుదేశములోనున్న నా చుట్టపక్కాలు బ్రతికియున్నారో లేరో తెలిసికొనవల యును. వారికడకు తిరిగివెళ్ళుటకు నాకుసెలవిమ్ము” అనెను. యిత్రో మోషేతో ”నాయనా! ప్రశాంతముగా వెళ్ళిరమ్ము” అని పలికెను.

19. మిద్యాను దేశములో యావే మోషేతో ”ఇక వెళ్ళుము. ఐగుప్తుదేశమునకు తిరిగిపొమ్ము. నిన్ను చంపగోరిన వారెల్లరును చనిపోయిరి” అనెను.

20. కావున మోషే తన యిల్లాలిని,  కుమారులను తోడ్కొని వారిని ఒక గాడిదమీద ఎక్కించుకొని, ఐగుప్తుదేశమునకు తిరిగి బయలుదేరెను. అతడు దైవదండమును చేతపట్టుకొనెను.

21. యావే మోషేతో ”ఇప్పుడు నీవు ఐగుప్తుదేశమునకు తిరిగి వెళ్ళుచున్నావు గదా! నేను నీకు ప్రసాదించిన అద్భుత శక్తులన్నిని ఫరోరాజు సమ్ముఖమున చూపుము. నేనే అతని గుండె బండబారునట్లు చేయుదును. కావున అతడు యిస్రాయేలీయులను వెళ్ళనీయడు.

22. అప్పుడు నీవు ఫరోతో యావే ఇట్లు చెప్పుచున్నాడు: ‘యిస్రాయేలు నా కుమారుడు. నాకు మొట్టమొదట ప్టుినవాడు.

23. నన్ను ఆరాధించుటకు నా కుమారుని వెళ్ళనిమ్మని నిన్ను ఆజ్ఞాపించితిని. కాని అతడు వెళ్ళుటకు నీవు అంగీకరింపకున్నావు. కావున నేను నీ కుమారుని, నీకు మొట్టమొద ప్టుినవానిని చంపెదను’ అని చెప్పుము” అనెను.

మోషే కుమారునకు సున్నతి జరుగుట

24. ప్రయాణముచేయుచు మోషే రాత్రికి విడిది చేసినపుడు యావే అతనిని కలిసికొని చంపివేయ జూచెను.

25. వెంటనే సిప్పోరా ఒక పదునైన చెకుముకి రాతిని తీసికొని కుమారుని చర్మాగ్రము కోసి దానిని మోషే పాదములకు తాకించి ”నిజముగా నీవు నాకు నెత్తురుపొత్తుగల పెనిమివైతివి” అని అనెను.

26. యావే మోషేను చంపక విడిచెను. ఈ సున్నతివలననే ఆమె ”నెత్తురుపొత్తుగల పెనిమి” అని అనెను.

మోషే అహరోనును కలిసికొనుట

27. యావే అహరోనుతో ”నీవు మోషేను కలిసి కొనుటకు ఎడారికి పొమ్ము” అనెను. కావున అహరోను వెళ్ళి దేవునికొండ దగ్గర మోషేను కలిసికొని  అతనిని  ముద్దాడెను.

28. యావే తనను పంపునపుడు తెలుప మనిన మాటలు, చేయుమనిన సూచకక్రియలు మోషే అహరోనునకు తెలియజెప్పెను.

29. అప్పుడు మోషే అహరోనులు వెళ్ళి యిస్రాయేలీయులలో ఉన్న పెద్దల నందరిని ప్రోగుజేసిరి.

30. యావే మోషేతో పలికిన పలుకులు అన్నింని అహరోను వారికి చెప్పెను. వారు చూచు చుండగనే సూచకక్రియలు చేసెను.

31. ఆ ప్రజ లందరకు విశ్వాసము కలిగెను. యావే యిస్రాయేలీ యులను చూడవచ్చెననియు, వారు పడుపాటులను కన్నులార చూచెననియు తెలిసికొని వారు తలలు వంచి దేవుని ఆరాధించిరి.

Previous                                                                                                                                                                                                   Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము