ఇదూమియా మీదికి, అమ్మోనీయుల మీదికి దాడి

5 1. యూదులు దేవాలయమును ప్రతిష్ఠించి, బలిపీఠమును పునర్నిర్మాణము చేసిరని విని, చుట్టు పట్లనున్న అన్యజాతివారు ఆగ్రహము చెందిరి.

2. కనుక వారు తమచెంత వసించు యూదులను నాశ నము చేయనెంచి వారిని హత్యచేయసాగిరి.

3. ఇదూమీయులు తమ దేశమందలి ఆక్రబాట్టేనే అను తావునుండి యూదులపై దాడి చేయుచుండిరి.  కనుక యూదా ఇదూమీయుల  మీదికి  యుద్ధమునకు పోయెను. వారిని ఓడించి కొల్లగొట్టెను.

4. అతడు క్రూరులైన బెయానీయులతో కూడ పోరాడెను. వారు పొదలలో దాగుకొనియుండి యిస్రాయేలు ప్రయా ణీకులను నిరంతరము దోచెడివారు.

5. యూదా వారిని వారి దుర్గములలోనే ఉంచి వాని తలుపులు మూయించెను. వారిని సర్వనాశనము చేయుదునని ఒట్టుపెట్టుకొనెను. ఆ కోటలను, వానిలోని ప్రజలతో పాటు నిలువున తగుల బ్టెించెను.

6. తరువాత అతడు అమ్మోనీయుల మీదికి పోయెను. వారు తిమొత్తి అనువాని నాయకత్వము క్రింద బలమైన మహాసైన్య మును ప్రోగుజేసికొనియుండిరి.

 7. అతడు వారితో అనేకమారులు పోరాడి వారిని నాశనము చేసెను. 8. యాసేరును, దాని ప్రాంతములోని పల్లెలను స్వాధీ నము చేసికొని యూదయాకు తిరిగివచ్చెను.

గలిలీయ, గిలాదు మండలములు

9. గిలాదులోని అన్యజాతివారందరును ఏకమై తమ మండలమున నివసించు యూదులను ఓడించి సంహరింపబూనిరి. యూదులు దిట్టమైన లాసెదాతేమా దుర్గమున దాగుకొని, 10. యూదాకు, అతని సోద రులకు ఈ క్రింది రీతిగా వర్తమానము పంపిరి.

”మా చుట్టుపట్లనున్న అన్యజాతుల వారు తిమొతి నాయకత్వము క్రింద ఒక్క బృందముగా ఏకమైరి.

11. మేమీ దాతేమా దుర్గమున దాగుకొింమి. శత్రు వులు ఈ కోటను ముట్టడించి మమ్ము నాశనము చేయనున్నారు.

12. మా వారు చాల మంది ఇది వరకే ప్రాణములు కోల్పోయిరి. మీరు మమ్ము రక్షించు టకు వెంటనే రావలయును.

13. తోబు మండలమున నివసించు యూదులను ఇంతకు ముందే చంపివేసిరి. వారి భార్యలను, పిల్లలను చెరగొనిరి. వారి ఆస్తి పాస్తు లను అపహరించిరి. అచట వేయి మంది సైనికులు చనిపోయిరి.”

14. యిస్రాయేలీయులు ఆ జాబును ఇంకను చదువుచుండగనే గలిలీయనుండికూడ దూతలు వార్తలతో వచ్చిరి. వారు విచారముతో బట్టలు చించు కొనియుండిరి.

15. ప్టోలమాయిసు, తూరు, సీదోను, గలిలీయ సైన్యములన్ని ఏకమై మమ్ము నాశనము చేయుచున్నవని ఆ దూతలు చెప్పిరి.

16. యూదులు ఈ వార్తలువిని తమ జనులనెల్ల ప్రోగుచేసిరి. శత్రు వుల దాడికి గురియైన సోదర ప్రజనెట్లు ఆదుకోవ లయునో నిర్ణయించుటకుగాను ఈ సమావేశము  ఏర్పాటు చేసిరి.

17. యూదా తన సోదరుడైన సీమో నుతో ”నీవు కొందరు సైనికులతో గలిలీయకు వెళ్ళి అచి యూదులను కాపాడుము. నేను మన సోదరుడు యోనాతాను గిలాదునకు వెళ్ళెదము” అని చెప్పెను.

18.  అతడు  తన  సైన్యమున   మిగిలినవారిని               యూదయాను కాపాడుటకు నియమించెను.అజరియాను, జకరియా కుమారుడగు యోసేపును ఆ దండుకు నాయకులను గావించెను.

19. వారితో ”నేను మిమ్మి చట నాయకులుగా నియమించి పోవుచున్నాను. కాని మేము తిరిగివచ్చువరకు మీరు అన్యజాతుల మీదికి యుద్ధమునకు పోవలదు”అని చెప్పెను.

20. సీమోనుతో గలిలీయకు వెళ్ళుటకు మూడువేలమంది సైనికులను, యూదాతో గిలాదునకుగాను వెళ్ళుటకు ఎనిమిది వేల మందిని నియమించెను.

గలిలీయ, గిలాదు మండలముల మీదికి దాడి

21. సీమోను గలిలీయ మండలము ప్రవేశించి అన్యజాతివారితో పెక్కు యుద్ధములు చేసి వారిని చిందరవందర చేసెను.

22. అతడు శత్రువులను ప్టోలమాయిసు నగరమువరకును తరిమిక్టొి మూడు వేలమందిని వధించెను. కొల్లసొమ్ము దోచుకొనెను.

23. గలిలీయయందును, అర్బట్ట యందును వసించు యూదులను వారి భార్యలు, పిల్లలు, ఆస్తి పాస్తులతో పాటు యూదయాకు తీసికొనివచ్చెను. అందుల కెల్ల రును సంతసించిరి.

24.ఆ కాలముననే యూదా మక్కబీయుడు, అతని సోదరుడు యోనాతాను యోర్దానునది దాి ఎడారిలో మూడునాళ్ళపాటు పయనము చేసిరి.

25. అచట వారు కొందరు నబాతీయులను కలిసికొని వారితో స్నేహము చేసిరి. వారు గిలాదునందలి యూదుల కేమి జరిగినదో వివరించి చెప్పిరి.

26. ”చాలమంది యూదులను బోస్రా, బోసోరు, అలేమా, ఖాస్పో, మాకెదు, కర్నాయీము అను సురక్షిత నగరములలో బంధించి ఉంచిరి అని తెలియజేసిరి.

27. మిగిలిన యూదులను గిలాదునందలి ఇతర నగరములలో బంధించిరి. శత్రువులు ఆ మరుసి దినమున ఈ నగర దుర్గము లన్నింని ముట్టడించి వానిలోని యూదులందరిని మట్టుపెట్టనున్నారు” అనియు తెలియజేసిరి.

28. కనుక యూదా, అతని సైన్యము వెంటనే పోయి ఎడారి త్రోవప్రక్కనగల బోస్రా నగరముమీద పడిరి. ఆ పట్టణమును పట్టుకొని అందలి పురుషు లందరిని చంపిరి. దానిని దోచుకొనికాల్చివేసిరి.

29. వారచినుండి సాగిపోయి రాత్రంతయు ప్రయా ణము చేసి దాతేమా దుర్గమును చేరుకొనిరి.

30. అచట వేకువవెలుగులో ఒక పెద్దసైన్యము ఆ             దుర్గమును ఆక్రమించుకొనబోవుటను చూచిరి. ఆ సైన్యము నిచ్చెనలతో, గోడలను కూల్చు మంచెలతో వచ్చికోటను స్వాధీనము చేసికొన బోవుచుండెను.

31. యూదా యుద్ధనాదమును, బూరల మ్రోతను, గడబిడ ధ్వనిని వినిపోరు అప్పుడే ప్రారంభమైనదని గ్రహించెను.

32. కనుక అతడు తన సైనికులతో ”నేడు మీరు మన సోదరులైన తోడి యూదులకొరకు యుద్ధము చేయవలయును” అని చెప్పెను.

33. అతడు తన సైనికులను మూడు బృందములుగా విభజించెను. వారు బాకాలనూదుచు పెద్ద స్వరముతో ప్రార్థనము చేయుచు వెనుక ప్రక్కనుండి పోయి శత్రువుల మీద పడిరి.

34. తిమొతి నాయకత్వము క్రిందనున్న శత్రు సేనలు యూదా మక్కబీయుడు వచ్చెనని గ్రహించి పారిపోయెను. యూదా వానినోడించి ఆ రోజే ఎని మిదివేల మందిని సంహరించెను.

35. తరువాత అతడు పోయి అలేమా నగర మును ముట్టడించెను.అచి పురుషులనందరిని చంపి, పట్టణమును కొల్లగ్టొి కాల్చివేసెను.

36. పిమ్మట ఖాస్ఫో, మాకెదు, బోసోరు నగరములను, మరియు గిలాదునందలి ఇతర పట్టణములనుగూడ ముట్ట డించి జయించెను.

37. ఈ యుద్ధము తరువాత తిమొతి మరియొక సైన్యము సమకూర్చుకొని వచ్చి రాఫోనునకు ఎదురుగా నదికి ఆవలి ప్రక్కన శిబిరము పన్నెను.

38. యూదా వేగులవారిని పంపగా వారు తిరిగివచ్చి ఆ మండల ములోని అన్యజాతి వారెల్లరను తిమొతితో కలిసి పెద్ద సైన్యముగా ఏర్పడిరని తెలిపిరి.

39. అరబ్బు కూలి బంటులు కూడ ఆ సైన్యమున చేరిరనియు, వారెల్లరు నది కావలి ప్రక్కన దండు విడిసి యూదాతో పోరా డుటకు సంసిద్ధులుగా ఉన్నారనియు వినిపించిరి. కనుక యూదా వారితో పోరాడబోయెను. 40. అతడు నదిని సమీపించుచుండగా తిమొతి తన సైన్యాధి పతులతో ”యూదా నదినిదాి వచ్చెనేని మనము అతనిని ఎదిరింపలేము. అతడు మనలనోడించి తీరును.

41. కాని అతడు మనకు జడిసి ఏికి ఆవలి ప్రక్కనే శిబిరము పన్నెనేని, మనము నదినిదాి అతనిని జయింపవచ్చును” అని చెప్పెను.

42. యూదా నదియొడ్డుకు రాగానే ”మనవారి నెవరిని ఇచట విడిదిచేయనీయవలదు. ఎల్లరును వెంటనే యుద్ధము ప్రారంభింపవలయును” అని తన సైన్యా ధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.

43. అందరి కంటె ముందుగా అతడే యేరుదాి శత్రువుల మీదికి పోయెను. యూదా సైనికులెల్లరును అతనిని అను సరించిరి. వారిని చూచి అన్యజాతి వారెల్లరు బారుల నుండి వైదొలగి తమ ఆయుధములను విసరిపారవేసి కర్నాయీము దేవళమునకు పారిపోయిరి.

44. యూదా అతని అనుచరులు మొదట నగరమును ఆక్రమించుకొనిరి. తరువాత దేవళమును, దానిలో దాగుకొనియున్న వారితోపాటు తగులబ్టెిరి. ఆ రీతిగా కర్నాయీము లొంగిపోయిన పిదప అన్యజాతి వారు యూదాను ఎదిరింపజాలరైరి.

45. తదనంతరము యూదా గిలాదులోని యూదు లనెల్ల తనతో యూదయాకు తీసికొనిపోవుటకు సన్నా హములు చేసెను. వారు తమ భార్యలతో, పిల్లలతో, ఆస్తిపాస్తులతో బ్రహ్మాండమైన బృందముగా ప్రోగైరి.

46. ఆ ప్రజలు ఏఫ్రోను అను సురక్షితమైన పెద్ద నగరము వరకు ప్రయాణము చేసిరి. నగరమునకు కుడివైపునుండిగాని ఎడమవైపునుండిగాని పోవుటకు వీలులేదు. మార్గము పట్టణము మధ్యగుండ పోవు చుండెను.

47. ఆ పట్టణ పౌరులు వారిని తమ నగరముగుండ వెళ్ళనీయరైరి. రాళ్లుపేర్చి పురద్వార ములను మూసివేసిరి. 48. యూదా ”మమ్ము మీ నగరముగుండ మాదేశమునకు వెళ్ళిపోనిండు. మేము మీక్టిె కీడుచేయము. అవతలికి వెళ్ళిపోవుటయే మా ఉద్దేశము” అని వారికి స్నేహసందేశము పంపెను. అయినను వారు నగర ద్వారములు తెరువలేదు.

49. కనుక యూదా తన జనులలో యుద్ధముచేయువారు తప్ప మిగిలిన వారెల్లరు అచటనే విడిదిచేయవలెనని ఆజ్ఞ యిచ్చెను.

50. యుద్ధవీరులు పోరుకు ఆయ త్తపడిపగలు రేయికూడ ముట్టడి కొనసాగించిరి. కడకు ఏఫ్రోను లొంగిపోయెను.

51. యూదా ఆ నగరము నందలి పురుషులనెల్ల మట్టుప్టిెంచెను. యూదులు ఆ నగరమును దోచుకొని దానిని నేలమట్టము చేసిరి. నగరముగుండ, చచ్చినవారి శవముల మీదుగా నడచిపోయిరి.

52. వారు యోర్దానునదిని దాి బేత్షాను ఎదుటగల పెద్ద మైదానము చేరిరి.

53. దారి పొడుగున యూదా వెనుకబడినవారిని నడి పించుచు వచ్చెను. యూదయా మండలము ప్రవే శించినదాక ప్రజలను ప్రోత్సహించుచు వచ్చెను.

54. ఎల్లరును సంతసముతో స్తుతిగీతములు పాడుచు సియోను కొండకు వెళ్లిరి. తమ పక్షము వారిలో ఒక్కరు కూడ చావక తిరిగి వచ్చినందుకుగాను దేవునికి దహన బలులు అర్పించిరి.

యామ్నియా వద్ద ఓటమి

55-56. యూదా, యోనాతాను గిలాదునందును వారి సోదరుడైన సీమోను గలిలీయలోని ప్టోలమాయిసు యందును ఉండగనే యూదయాలోని సైన్యములకు అధిపతిగానున్న ఆసరియా మరియు జెకరియా కుమారుడు యోసేపు ఆ వీరుల వీరకృత్యములను, విజయములను గూర్చి వినిరి.

57. వారు ‘మనమును అన్యజాతులతో పోరాడి పేరుతెచ్చుకొందము’ అని అనుకొనిరి.

58. కనుక వారు తమ సైన్యాధిపతులకు ఆజ్ఞలు జారీచేసి యామ్నియా మీదికి దండెత్తిరి.

59. గోర్గియాసు అతని సైనికులు పురమునుండి వెలుపలికి వచ్చి వారిని ఎదిరించిరి.

60. వారు అసరియాను, యోసేపును ఓడించి యూదయా సరిహద్దులవరకు తరిమిక్టొిరి. ఆ దినము యిస్రాయేలీయులు రెండు వేలమంది మడిసిరి.

61. యూదయా నాయకులు యూదా మరియు అతని సోదరుల ఆజ్ఞలను పెడ చెవిని బ్టెి తాము వీరుల మనిపించు కోగోరి యుద్ధ మునకు పోయిరి కనుక ఘోర పరాజయము కలిగెను.

62. వారు యిస్రాయేలీయులకు దాస్య విముక్తి కలి గించుటకుగాను ప్రభువు ఎన్నుకొనిన కుటుంబము నకు చెందినవారు కారు.

ఇదూమియా, ఫిలిస్తీయా మండలములలో విజయము

63-64. యిస్రాయేలీయులు, అన్యజాతుల వారు గూడ యూదాను అతని సోదరులను మిగుల గౌరవించిరి. ప్రజలు వారి ప్రఖ్యాతినిగూర్చి విని పెద్ద గుంపులుగా ప్రోగై వారిని స్తుతించిరి.

65. తరువాత యూదా అతని సోదరులు దక్షిణముననున్న ఎదో మీయుల మీదకి దాడి చేసిరి. అతడు హెబ్రోనును దాని పరిసర నగరములను ముట్టడించెను. ఆ నగర దుర్గములను నాశనముచేసి దాని చుట్టుపట్లగల బురుజులను కాల్చివేసెను.

66. అచినుండి పాల స్తీనా దేశమునకు వెళ్ళి మరీసాగుండ ప్రయాణము చేసెను.

67. అపుడు కొందరు యాజకులు తాము గూడ పేరుతెచ్చుకోవలయునన్న కోరికతో తెలివి తక్కువ తనముతో యుద్ధమునకు పోయిహతులైరి. 68. పిమ్మట యూదా ఫిలిస్తీయాలోని ఆజోతును ముట్టడించి, ఫిలిస్టీయుల పీఠములను పడగ్టొి వారి దేవతా విగ్రహములను కాల్చివేసెను. వారి పట్టణ ములు కొల్లగ్టొి యూదయాకు తిరిగివచ్చెను.