నమ్మగూడని మిత్రులు

37 1.      ”నేనును నీ స్నేహితుడనే”

                              అని ఎవడైన అనవచ్చును.

                              కాని కొందరు పేరునకు

                              మాత్రమే స్నేహితులు.

2.           ఆప్తమిత్రుడు శత్రువుగా మారిపోయినపుడు

               ఘోరసంతాపము కలుగును.

3.           నరులలో ఈ దుర్గుణము కన్పించును.

               కాని ఈ అనర్థమేల ప్టుినది?

               ఇది లోకమంతని యేల మోసపుచ్చుచున్నది?    

4.           కొందరు మనము పచ్చగానున్నప్పుడు

               మిత్రులవలె కన్పింతురు.

               కాని ఆపదలు వచ్చినపుడు

               మనకు ఎదురు తిరుగుదురు.

5.           కాని కొందరు కష్టములలో మనలను

               ఆదుకొందురు.

               శత్రువు మనమీదికి వచ్చినపుడు

               వానితో పోరాడుదురు.

6.           నీ తరపున పోరాడిన నేస్తుని

               మరచిపోవలదు.

               నీకు సంపదలు అబ్బినపుడు

               అతనిని విస్మరింపకుము

హితోపదేశకులు

7.            ఎవడైన ఉపదేశము చేయగలడు,

               కొందరు స్వలాభము కొరకే సలహా ఇత్తురు.

8.           సలహా ఇచ్చినవానిని జాగ్రత్తగా

               పరిశీలించి చూడుము.

               అతనికోరిక ఏమిో తెలిసికొనుము,

               అతడు స్వార్థమును ఆశించుచుండవచ్చును.

               కడన నీకు అపకారము తలపెట్టవచ్చును.

9.           అతడు ”అన్నీ నీకు అనుకూలముగానే ఉన్నది”

               అని చెప్పుచు నీవెట్లు పతనమగుదువాయని

               పొంచి చూచుచుండవచ్చును.

10.         నిన్ను నమ్మనివానిని నీకు

               సలహా ఇమ్మని అడుగకుము.

               నీ మీద అసూయ కలవానికి

               నీ ఆలోచనలు ఎరిగింపకుము.

11.           స్త్రీని ఆమె సవతిని గూర్చియు,

               పిరికివానిని యుద్ధమును గూర్చియు,

               వర్తకుని వ్యాపారమును గూర్చియు,

               పిసినిగొట్టును కృతజ్ఞతను గూర్చియు,

               క్రూరుని దయనుగూర్చియు,

               సోమరిపోతును పనిని గూర్చియు,

               రోజువారికూలీని పనిని సంపూర్తిగా

               ముగించుటను గూర్చియు,

               సోమరియైన సేవకుని కష్టకార్యమునుగూర్చియు

               సలహా అడుగకుము.

               వారి ఉపదేశమును ఎంత మాత్రము

               అంగీకరింపవలదు.

12.          కాని భక్తి పరుడైన వానిని,

               దైవాజ్ఞలను పాించువానిని,

               నీతో సమానమైన అభిరుచులు గలవానిని,

               నీ పతనమును చూచి విచారించువానిని

               సలహా అడుగుము.

13.          కడన నీ హృదయము చేయు

               ఉపదేశమునుగూడ నమ్ముము.

               దానికి మించిన మంచిసలహా లేదని ఎరుగుము.

14.          బురుజుమీద కూర్చుండిన

               ఏడుగురు పహారావారికంటే, 

               మన హృదయము మనకు ఎక్కువ తెలుపును.

15.          అన్నికంటే మిన్నగా నిన్ను సత్యమార్గమున

               నడుపుమని మహోన్నతుని ప్రార్థింపుము.

సద్విజ్ఞానము, దుర్విజ్ఞానము

16.          పరిశీలించి చూచినగాని

               ఏ పనికిని పూనుకోరాదు.

               ఆలోచించినగాని ఏ కార్యమును ప్రారంభింపరాదు

17-18. మంచి, చెడు, జీవము, మరణమను

               నాలుగు అంశములకు

               మన ఆలోచనమే జన్మస్థానము.

               కాని వీనినన్నిని నాలుకయే పరిపాలించును.

19.          ఒకనికి ఇతరులకు ఉపదేశము చేయు

               సామర్థ్యము ఉండవచ్చును.

               కాని తనకు తాను మేలు చేసికోలేకపోవచ్చును.

20.        అతడు మాటకారియై ఉండవచ్చును.

               కాని ప్రజలు ఆదరింపనందున కూడు దొరకక

               ఆకలితో చచ్చును.

21.          అతడు ఉచితజ్ఞుడు కాదు.

               ప్రభువతనికి వివేకమును ప్రసాదింపలేదు.

22.        ఒకడు తాను విజ్ఞానినని భావింపవచ్చును.

               తన విజ్ఞతను గూర్చి తనకు రూఢిగా తెలియునని

               చెప్పుకోవచ్చును.

23.        కాని నిజముగా విజ్ఞుడైనవాడు

               తన ప్రజలకు బోధచేయును.

               ఆ ప్రజలు అతని బోధ సత్యమైనదని

               అంగీకరింతురు.

24.         అి్ట వానిని ఎల్లరును కీర్తింతురు.

               అతడు ధన్యాత్ముడని వాకొందురు.

25.        నరుడు కొన్ని ఏండ్లు మాత్రమే జీవించును.

               కాని యిస్రాయేలు ప్రజల జీవితకాలము

               లెక్కలకు అందదు.

26.        జ్ఞానిని అతనిప్రజలెల్లరు నమ్ముదురు.

               అతని పేరు శాశ్వతముగా నిలుచును.

మితాహారము

27.         కుమారా! ఈ జీవితయాత్రలో నిన్ను నీవు

               పరీక్షించి చూచుకొనుచుండుము.

               నీకు గిట్టని భోజనపదార్థములను

               ఆరగింపకుము.

28.        ప్రతి భోజనము ప్రతివానికి సరిపడదు.

               అందరికిని ఒకేరకమైన ఆహారము రుచింపదు. 

29.        విశిష్టాన్నముల మీద మక్కువ వదులుకొనుము.

               ఎి్ట భోజనమునైనను మితముమీరి తినకుము.

30.        మితిమీరి తిన్నచో రోగమువచ్చును.

               భోజనప్రియత్వము వలన పిత్తము ముదురును.

31.          భోజనప్రియత్వము వలన చాలమంది చచ్చిరి.

               ఈ విషయమున జాగ్రత్త వహించి

               నీ ఆయుస్సును పెంచుకొనుము.