ఇతరాంశములు

మీకా దేవళము – దాను దేవళము

మీకా దేవళము

17 1. ఎఫ్రాయీము పర్వతసీమలో మీకా అను వాడొకడుండెను.

2-3. అతడు తన తల్లితో ”అమ్మా! నీవు పదునొకండువందల వెండికాసులు పోగొట్టు కొింవిగదా! నేను వినుచుండగనే నీవా సొమ్మును అపహరించిన దొంగను నిశితముగా శపించితివి. ఆ సొమ్మును ప్రభువునకు అర్పించితివి. దానితో చెక్కడపు బొమ్మను తయారు చేయింపవలయును అంివి. ఆ సొమ్ము నాయొద్దనున్నది. కాసులను తీసికొన్నది నేనే సుమా! ఇక నీ డబ్బు నీకిచ్చివేసెదను” అని చెప్పెను. ఆమె ”యావే నా బిడ్డను దీవించును గాక!” అనెను. మీకా పదునొకండువందల వెండి నాణెములు తల్లికి ముట్టజెప్పెను.

4. అంతట ఆమె తన సొమ్మునుండి రెండు వందల నాణెములు తీసికొని కంసాలికి ఈయగా అతడు చెక్కడపుబొమ్మను తయారుచేసెను. ఆ విగ్రహ మును మీకా ఇంటనుంచిరి.

5. మీకా ఒక దేవళ మును నిర్మించి ఏఫోదు తెరాఫీము1 చేయించి గృహ దేవతా విగ్రహమును ప్రతిష్ఠించెను. అతడు తన కుమారునే యాజకునిగా నియమించెను.

6. ఆ రోజులలో యిస్రాయేలీయులకు రాజులేడు. ఎవరి ఇష్టమువచ్చినట్లు వారు ప్రవర్తించెడివారు.

7-8. అట్లుండగా యూదా బేత్లెహేమునకు చెందిన యువకుడొకడు అక్కడ పరదేశిగా బ్రతుకు చుండెను. అతడు యూదా కుటుంబమునకు చెందిన లేవీయుడు. బేత్లెహేము నగరమును విడనాడి మరి ఎక్కడైన పొట్టపోసికొందును అనుకొని పయనమై ఎఫ్రాయీము కొండసీమయందున్న మీకా ఇంికి వచ్చెను.

9. మీకా అతనిని జూచి ”నీ వెక్కడినుండి వచ్చితివి” అని ప్రశ్నించెను. ఆ యువకుడు ”నేను యూదా బేత్లెహేము నివాసిని, లేవీయుడను. ఎక్కడైనను బ్రతుకుతెరువు దొరుకునేమో అని వచ్చితిని” అని చెప్పెను.

10. మీకా అతనితో ”నీవు మా ఇంటనుండ వచ్చును. నాకు యాజకుడవై నాపట్ల తండ్రివలె మెల గుము. నేను నీకు అన్నము, బట్టలు ఇచ్చి ఏడాదికి పదివెండినాణెములిత్తును” అనెను.

11. లేవీయుడు ఒప్పుకొనెను. మీకా కుమారునివలె అతడు ఆ ఇంట మనజొచ్చెను.

12. మీకా లేవీయుని యాజకునిగా నియమించెను. లేవీయుడు మీకాకు అర్చకుడై అతని ఇంటనే వసించుచుండెను.

13. మీకా ”నా భాగ్యము వలన ఈ లేవీయుడు నాకు యాజకుడు అయ్యెను. ఇక యావే నన్ను తప్పక దీవించును” అనుకొనెను.

Previous                                                                                                                                                                                                    Next

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము