ఉపోద్ఘాతము :

పేరు : యూదా  పూర్వ నిబంధనలోని యాకోబు 12 మంది కుమారులలో నొకడు (ఆది. 29:35). నూతన నిబంధనలో యేసు శిష్యులలో నొకడు (లూకా 6:12-16). ఇద్దరి పేర్లు ఒకటే. యాకోబు, యూదా యేసు సోదరులు (1:1; మత్త. 13:15; అ.కా. 1:14)

కాలము: క్రీ.శ. 65.

రచయిత: యూదా.

చారిత్రక నేపథ్యము: క్రైస్తవ సంఘంలో అబద్ధ బోధకులు, ఆత్మ జ్ఞానవాదులు ఎక్కువయ్యారు. వారు విశ్వాసులను దుర్బుద్ధితో ప్రభావితం చేశారు: పాపం అంటే కించిత్‌ క్షోభ కూడా లేకుండా పోయింది. ఇట్టిపరిస్థితిని అడ్డుకొని విశ్వాసులను తిరిగి క్రీస్తు విశ్వాసం వైపు మరల్చాలనే వుద్దేశ్యంతో యూదా ఈ లేఖను రాశాడు (వ. 3-4)

ముఖ్యాంశములు: దేవుడు మానవులను క్షమిస్తుంటారు కాబట్టి పాప జీవితం కొనసాగించ వచ్చుననే వారికి హెచ్చరిక చేయడం ఈ గ్రంథం ప్రధానాంశం. అనైతిక జీవితం అంగీకారం కానేకాదు. విశ్వాసాన్ని కాపాడుకోవడం నైతిక బాధ్యత.

క్రీస్తు చిత్రీకరణ: అందరు క్రీస్తు నందు విశ్వాసం, దేవుని ప్రేమ (వ. 21), నిత్యజీవం, మహిమలను పొందుతారు (వ. 24-25). క్రీస్తునందే ప్రతిఒక్కరు జీవించాలి (వ. 1).