ఆపదలో సహాయము కొరకు ప్రార్థన

10 1. ప్రభూ! నీవు మాకు దూరముగా ఉండనేల?

                              ఆపత్కాలమున

                              మా కంటబడకుండ దాగియుండనేల?

2.           దుష్టులు అహంకారముతో

               దరిద్రులను హింసించుచున్నారు.

               వారు తాము పన్నిన పన్నాగములలో

               తామే చిక్కుకొందురుగాక!

3.           దుష్టుడు తన దురాశలను గూర్చి

               గొప్పలు చెప్పుకొనును.

               దురాశపరుడు ప్రభువును

               శపించి నిరాకరించును.

4.           దుర్మార్గుడు గర్వభావముతో

               ”ప్రభువు నన్ను శిక్షింపడు,

               అతడేమియు ప్టించుకొనడు,

               దేవుడు లేడు” అని తలంచును.

5.           దుర్మార్గుడు ప్టినదెల్ల నెరవేరును.

               అతడు దేవుని తీర్పును అర్థము చేసికొనడు.

               తన విరోధులను అవహేళనము చేయును.

6.           నేను కదిలించబడను, ఆపదచూడను

               అని అతడు తన హృదయములో అనుకొనును.

7.            అతని పలుకులు శాపములు, వంచనలు,

               బెదరింపులతో నిండియుండును.

               ద్వేషపూరితములైన దుష్టవాక్కులు

               అతడి నోినుండి తేలికగా వెలువడును.

8.           అతడు పల్లెలయందలి

               మాటుస్థలములలో దాగియుండి,

               నిర్దోషుల మీదికి దుమికి

               వారిని రహస్యముగా హత్యచేయును.

               నిస్సహాయులైన వారికై పొంచి చూచుచుండును.

9.           సింహమువలె పొదలో దాగుకొనియుండి

               అభాగ్యునికొరకు పొంచి చూచుచుండును.

               వానిని తన వలలో చిక్కించుకొని

               లాగుకొనిపోవును.

10.         అతడు అభాగ్యుని మీదికి దుమికి

               వానిని వశము చేసికొనును.

               దుర్బలుడు అతని బలమునకు లొంగిపోవును.

11.           ”దేవునికి జ్ఞప్తియుండదు,

               అతడు ముఖము అటుత్రిప్పుకొని

               ఎప్పికిని నన్ను చూడడు” అని

               ఆ దుర్మార్గుడు తలంచును.

12.          ప్రభూ! నీవు లెమ్ము!  నీ బలము ప్రదర్శింపుము.

               పీడితులను విస్మరింపకుము.

13.          దుష్టుడు దేవుని నిర్లక్ష్యము చేసి,

               ‘అతడు నన్ను శిక్షింపడులే’ అని

               తలంచుట యుక్తమా?

14.          కాని నీవు అన్నియు గమనింతువు.

               నరుల బాధలను, విచారములను తెలిసికొందువు.

               అభాగ్యులును, అనాథలును నీ మరుగుజొత్తురు.

               వారికి సహాయముచేసి తప్పక ఆదుకొందువు.

15.          ప్రభూ! నీవు దుష్టులభుజమును విరగగొట్టుము.

               దుష్టులు అదృశ్యమగువరకు

               వారిని ఏరివేయుము.

16.          ప్రభువు కలకాలము రాజుగా ఉండును.

               అన్యజాతివారు ఆయన దేశమున నశింతురు.

17.          ప్రభూ! నీవు పేదల కోరికలు తెలిసికొందువు.

               వారికి బలమును ఒసగుదువు.

               వారి వేడుకోలును ఆలింతువు.

18.          అనాథలకు, పీడితులకు న్యాయము చేకూర్తువు.  నీవు భూమిమీద

               వారి భయాందోళనలను తొలగింతువు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము