యెహోషాఫాత్తు పరిపాలన

17 1. ఆసా తరువాత అతని కుమారుడైన యెహోషాఫాత్తు రాజై యిస్రాయేలీయులు దండెత్త కుండునట్లు తన రాజ్యమును బలపరచుకొనెను.

2. అతడు యూదాలోని ప్రాకారములు గల సురక్షిత పట్టణములందును, చుట్టుపట్ల ప్రాంతములందును, ఎఫ్రాయీము మండలమునను ఆసా ఆక్రమించు కొనిన నగరములందును సైన్యములను ఉంచెను.

ధర్మశాస్త్రమును పాించుట

3. యెహోషాఫాత్తు తన తండ్రి తొలినాి జీవితమును అనుకరించెను. అతడు బాలు దేవతలను పూజింపలేదు కనుక ప్రభువు అతనిని దీవించెను.

4. ఆ రాజు యిస్రాయేలు రాజువలె ప్రవర్తింపక తన తండ్రి కొలిచిన దేవునికొలిచి ఆ ప్రభువు ఆజ్ఞలను పాించెను. 5. ప్రభువు అతని రాజ్యాధికారమును సుస్థిరము చేసెను. యూదీయులెల్లరును అతనికి కానుకలు కొనివచ్చిరి. కనుక అతని సిరిసంపదలు వృద్ధిచెందెను. కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించెను.

6. అతడు నిష్ఠతో ప్రభువును సేవించెను. యూదా రాజ్యములోని ఉన్నత స్థలములను, ఆషేరా దేవతా స్తంభములను నాశనము చేయించెను.

7-8. ఆ రాజు పరిపాలనాకాలము మూడవ యేట కొందరు పెద్దలనుపంపి యూదా నగరము లందు ధర్మబోధ చేయించెను. వారు బన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా. ఆ పెద్దలతో వెళ్ళిన లేవీయులు షెమయా, నెతన్యా, జెబద్యా, అసాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, తోబీయా, ోబదోనీయా. మరియు పెద్దలతో వెళ్లిన యాజకులు ఎలీషామా,యెహోరాము.

9. వారు ప్రభువు ధర్మశాస్త్రగ్రంథమును చేతపుచ్చుకొని యూదానగరములెల్ల సంచరించుచూ ప్రజలకు బోధ చేసిరి.

10. ప్రభువు యూదా చుట్టుపట్లగల రాజులనెల్ల భయపెట్టుటచే వారు యెహోషాఫాత్తుతో యుద్ధము చేయ సాహసింప లేదు.

11. కొందరు ఫిలిస్తీయులు ఆ రాజునకు వెండిని, కానుకలను కొనివచ్చిరి. అరబ్బీయులు ఏడువేల ఏడువందల పొట్టేళ్ళను, ఏడువేల ఏడువందల మేకపోతులను కొనివచ్చిరి.

12. యెహోషాఫాత్తు దినదిన ప్రవర్థమానుడై యూదా రాజ్యమున కోటలను, గిడ్డంగుల పట్టణములను నిర్మించెను.

సైన్యము

13. యెహోషాఫాత్తు యూదా నగరములలో బలమైన సైన్యములను ఉంచెను. యెరూషలేమున మహావీరుల శిబిరముండెను.

14. తెగలవారిగా ఆ వీరుల వివరములివి: యూదాతెగలకు చెందిన వీరులకు అద్నా మొది నాయకుడు. అతని క్రింద మూడు లక్షల మంది యోధులుండిరి.

15. రెండవ నాయకుడు యెహోహనా క్రింద రెండు లక్షల ఎనుబదివేల మంది వీరులు కలరు.

16. మూడవ నాయకుడు సిక్రి కుమారుడైన అమస్యా క్రింద రెండు లక్షల మంది బలశాలులుండిరి. ఈ అమస్యా తనను తాను ప్రభువు సేవకు అంకితము చేసికొనెను.

17. బెన్యామీను తెగకుచెందిన వీరులకు మహాశూరుడైన ఎల్యాదా మొదినాయకుడు. అతనిక్రింద రెండు లక్షలమంది వీరులు కలరు. వారెల్లరును డాళ్ళు, విల్లు ధరించినవారు.

18. రెండవ నాయకుడైన యెహోసాబాదు క్రింద ఆరితేరిన వీరులు లక్ష ఎనుబది వేల మంది కలరు.

19. ఈ వీరులెల్లరును యెరూషలే మున వసించుచు రాజును సేవించిరి. వారు గాక యూదా రాజ్యమునందలి ఇతర సురక్షిత పట్టణము లలో నివసించు సైనికులును కలరు.