సియోనునకు ఊరట వాక్యాలు

4 1. కడవరి దినములలో

               ప్రభువు మందిరమున్న పర్వతము,

               శైలములన్నిలోను ఉన్నతమైనదగును.

               కొండలన్నిలోను ఎత్తయినదగును.

               సకలజాతి జనులును 

               దానిచెంతకు వత్తురు.

2.           ఆ ప్రజలు ఇట్లందురు:

               మనము ప్రభువు పర్వతమునకు వెళ్ళుదము

               యాకోబు దేవుని దేవళమునకు పోవుదము

               ఆయన తన మార్గములను మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడచుదము.

               ధర్మశాస్త్రము సియోనునుండి వచ్చును.

               ప్రభువువాక్కు

               యెరూషలేమునుండి బయల్వెడలును.

3.           ఆయన జాతుల తగవులు పరిష్కరించును.

               దూరముననున్న మహాజాతులకు తీర్పుచెప్పును.

               వారు తమకత్తులను నాగికఱ్ఱులుగా,

               తమ ఈటెలను సేద్యకొడవళ్ళుగా

               మార్చుకొందురు.

               ఒకజాతి మరియొక

               జాతిమీద కత్తిదూయదు.

               ప్రజలు యుద్ధమునకు శిక్షణపొందరు.

4.           ప్రతివాడు తన ద్రాక్షల నడుమను,

               అత్తి చెట్ల నడుమను సురక్షితముగా జీవించును.

               వానినెవడును భయపెట్టజాలడు.

               ఇది సైన్యములకధిపతియైన

               ప్రభువు వాగ్ధానము.      

5.           ప్రతిజాతియు తన దైవమునారాధించి

               అతనికి లొంగుచున్నది.

               కాని మేము కలకాలమువరకు

               మా ప్రభువైన దేవుని ఆరాధించి

               ఆయనకు లొంగియుందుము.

దేవుడు ప్రవాసులను సియోనున ప్రోగుజేయును

6.           ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ఆ దినము నేను, నా శిక్షకు గురియై,

               ప్రవాసమున బాధలనుభవించువారిని

               ప్రోగుజేయుదును.  

               వారు కుింవారై స్వీయదేశమునకు

               దూరముగానున్నను    

7.            ఆ కుింవారిలో శేషముగానున్నవారితో

               నూతన ప్రజను ప్రారంభింతును.

               వారు మహాజాతి అగుదురు.

               అప్పినుండి కలకాలమువరకును

               సియోను కొండ మీదినుండి

               నేను వారిని పాలింతును.

8.           యెరూషలేమూ!

               ప్రభువు నీ బురుజు మీదినుండి

               కాపరి గొఱ్ఱెలనువలె

               తన ప్రజలను పర్యవేక్షించును.

               నీవు నీ పూర్వ రాజ్యమునకు

               మరల రాజధానివగుదువు.

సియోను ముట్టడి, ప్రవాసము, విముక్తి

9.           నీవు గొంతెత్తి అరవనేల?

               ప్రసవించు స్త్రీవలె వేదనచెందనేల?

               నీకు రాజులేడు గనుకనా?

               నీసలహాదారులు గతించిరి గనుకనా?

10.         యెరూషలేము ప్రజలారా!

               మీరు ప్రసవించు స్త్రీవలె వేదనతో కొట్టుకొనుడు.

               మీరిపుడు నగరమువీడి బయటవసింపవలెను.

               మీరు బబులోనియాకు వెళ్ళిపోవలెను.

               కాని శత్రువుల బారినుండి

               ప్రభువు అచట మిమ్ము కాపాడును.

11.           పెక్కుజాతులు ఏకమై నీపైదాడి చేయగోరుచున్నవి

               వారు ‘యెరూషలేము నాశనము కావలెను

               మనము దాని వినాశనమును కన్నులార

               చూతము’ అని పలుకుచున్నారు.

12.          కాని ప్రభువు మనసులోని తలపులు

               వారికి తెలియవు.

               కళ్ళమున కంకులవలె త్రొక్కించుటకే

               ప్రభువు వారినచట ప్రోగుజేయును.

13.          ప్రభువు ఇట్లనుచున్నాడు:

               యెరూషలేము పౌరులారా!

               ఇనుపకొమ్ములు, కంచుగిట్టలుగల ఎద్దువలె

               నేను మిమ్ము బలాఢ్యులను చేయుదును

               లేచి కళ్ళమును త్రొక్కుము.

               మీరు చాలజాతులను అణగద్రొక్కుదురు.

               ఆ ప్రజలు దౌర్జన్యముతో కూడబ్టెిన సొత్తును

               సర్వలోకాలకధిపతినైన నాకు నివేదింతురు.

Previous                                                                                                                                                                                                  Next