13 1.       ఈ సంగతులెల్ల నేను కన్నులార చూచియు

                              చెవులార వినియు తెలిసికొింని.

2.           మీరెరిగిన అంశములు నేను ఎరుగుదును.

               నేను మీ కంటె తక్కువవాడనేమి కాదు.

3.           కాని నేను మీతోగాక దేవునితో మ్లాడగోరెదను.

               నేను వాదింపగోరినది ప్రభువుతోనే.

4.           మీరు అబద్ధాలతో మీ వాదనలను

               సమర్థించుకొనుచున్నారు.

               వ్యాధులను కుదర్పలేని

               వైద్యుల వింవారు మీరు.

5.           మీరిక నోరు మూసికొనినచో బాగుగానుండును.

               మౌనమే మీకు విజ్ఞతయగునుగాక!

6.           మీరిక నా వాదమును వినుడు.

               నా పెదవుల మనవుల నాలకింపుడు.

7.            మీరు మీ మిథ్యావచనములతో

               దేవుని తరపున వాదింపనక్కరలేదు.

8.           పక్షపాత బుద్ధికలవారు ఆయన పక్షమున

               న్యాయవాదులుగా వ్యవహరింపగలరా?

9.           ఆయన మీ లోగుట్టును తెలిసికోలేడా?

               నరులనువలె దేవుని వంచింపగలమా?

10.         మీరు రహస్యముగా పక్షపాతము చూపించినచో

               ప్రభువు మిమ్ము తీవ్రముగా మందలించును.

11.           ఆయన వైభవమును చూచి          

               మీరు భయభ్రాంతులై భీతితో కంపించిపోవుదురు

12.          మీ విజ్ఞానసూక్తులు బూడిదవలె విలువ లేనివి.

               మీ వాదములు మ్టివలె బలము చాలనివి.

13.          మీరిక మౌనము వహించి నన్ను మాడనిండు.

               నాకు జరగబోవునది జరుగును గాక!

14.          నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకొనవలెను

               ఈ పట్టున ప్రాణములు

               ఒడ్డుటకు నేను వెనుకాడనుగాని

               ప్రాణములకు తెగించి మ్లాడుదును.

15.          నేను ఆశలనెల్ల విడనాడితిని.

               దేవుడు నన్ను చంపిన చంపుగాక!

               ఆయన ముందు నేను నిర్దోషినని

               మాత్రము నిరూపించుకొందును.

16.          దైవభక్తిలేని వాడెవడును దేవుని ఎదుికి రాజాలడు

               కనుక నా ఈ సాహసము

               నన్ను రక్షించిన రక్షింపవచ్చును.

17.          మీరు నా మాటలు ఆలకింపుడు.

               నా పలుకులు సావధానముగా వినుడు.

18.          నేను నిరపరాధినన్న నమ్మకము నాకు ఉన్నది

               కనుక నా అభియోగమును విన్నవించుకొందును.

19.          దేవుడు నా మీద నేరము మోపుటకు

               వచ్చిన  రానిండు.

               మౌనముగా ప్రాణములు

               త్యజించుటకు నేను సంసిద్ధుడనే.

20.        ప్రభూ! నీవు నాకు రెండు వరములు

               దయచేయుము.

               నేను నీనుండి దాచిపెట్టునది ఏమియులేదు.

21.          మొదట నీవు నన్ను బాధించుట మానుకొనుము.

               నీ భయమును నాయొద్దనుండి తొలగింపుము.

22.         ఆ పిమ్మట నీవు నన్ను ప్రశ్నింపుము.

               నేను నీకు బదులు చెప్పెదను.

               లేదా నేనే నిన్ను ప్రశ్నింతును,

               నీవు నాకు బదులు చెప్పుము.

23.         నేనేమి తప్పులు చేసితిని?

               ఏమి పాపములు కట్టుకొింని?

               ఏ అపరాధములు సల్పితిని?

               ఏ ఆజ్ఞలు మీరితిని?

24.         నీవు ఇపుడు మొగము చాటుచేసికోనేల?

               నన్ను నీ శత్రువునిగా భావింపనేల?

25.         గాలికెగిరిపోవు ఈయాకునా నీవు భయపెట్టునది?

               ఎండిపోయిన ఈ తాలునా నీవు వెాండునది?

26.        నేను బాలుడిగా ఉన్నప్పుడు చేసిన పాపములకు

               నీవు నామీద ఘోరమైన నేరములు మోపుచున్నావు

27.         నీవు నా పాదములను బండకొయ్యలో బిగించితివి

               నేను పోవు మార్గములను,

               నా అడుగుజాడలను గుర్తుప్టితివి.

28. నేను చివికిపోయిన కొయ్యవలెను,

               చిమ్మటలు క్టొిన వస్త్రములవలెను 

               తుత్తునియలు అయితిని.

               నా ప్రవర్తననంతయు

               నీవు గిరిగీసి కనిపెట్టుచున్నావు

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము