మొర్దెకయి ప్రార్ధన

8(13:8-7) 1. అప్పుడు మొర్దెకయి ప్రభువు మహాకార్యములను తలంచుకొని ఈ క్రింది రీతిగా ప్రార్ధన చేసెను:

2.           ”ప్రభూ!

               నీవు అన్నింమీద అధికారము కలవాడవు.

               ఈ ప్రపంచమెల్ల నీకు లోబడియుండును.

               నీవు యిస్రాయేలును రక్షింపబూనినచో

               నీకు అడ్డురాగలవాడెవడు?

3.           నీవు భూమ్యాకాశములను సృజించితివి.

               నేలమీద విచిత్ర వస్తువులన్నింని చేసితివి.

4.           అన్నింకిని నీవే ప్రభుడవు.

               నిన్నెదిరింపగలవాడెవడు?

5.           ప్రభూ! నీవెరుగనిదేమున్నది?

               నీకన్నియు తెలియును.

               పొగరుబోతుతనముతోగాని,

               కీర్తికాంక్షతోగాని గర్వాత్ముడైన హామానునకు

               నేను నమస్కారములు నిరాకరింపలేదు.

6.           యిస్రాయేలు ప్రజలను రక్షించుటకై

               నేనతని చెప్పులవారును

               ముద్దిడుటకైన వెనుకాడను.

7.            నరుని దేవునికంటె అధికుని చేయనొల్లక

               నేన్టి కార్యమునకు తలపడవలసివచ్చెను.

               నీకు తప్ప వేరొకనికి నేను నమస్కరింపను.

               ఇట్లు చేయుట గర్వమువలన కాదుగదా! 

8.           కనుక అబ్రహాము దేవుడవు, రాజువునైన ప్రభూ!

               ఇప్పుడు నీ యీ ప్రజలను కాపాడుము.

               శత్రువులు మమ్ము నాశనము చేయబూనిరి.

               అనాదినుండి నీవు ఎన్నుకొనిన

               ప్రజలను సంహరింపబూనిరి.

9.           నాడు ఐగుప్తున నీవు విముక్తులను జేసి,

               నీ వారిగా స్వీకరించిన ఈ ప్రజలను,

               నేడు అనాదరము చేయుదువా?

10.         ప్రభూ! నా మొర విని,

               నీవు ఈ జనమును కరుణింపుము.

               మా దుఃఖమును సంతోషముగా మార్చుము.

               అప్పుడు మేము బ్రతికి బయటపడి

               నిన్ను కీర్తింతుము.

               నిన్ను స్తుతించువారిని చావనిచ్చి

               వారి నోళ్ళు మూయింతువా?”

11. వారి చావు వారి కనులెదుట కన్పింపగా యిస్రాయేలీయులు అందరు మహారోదన చేసిరి.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము