అమ్మోనీయులతో రెండవ యుద్ధము

దావీదు పాపము

11 1. వసంతకాలము రాజులు యుద్ధమునకు వెడలుటకు అనువైనకాలము. దావీదు కోరికపై యోవాబు, రాజు అంగరక్షకులతోను, యిస్రాయేలు సైన్యములతోను బయల్వెడలి అమ్మోనీయుల మండల ముపై దాడిసల్పి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేముననే ఉండెను.       

2. ఒకనాి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని ప్రాసాదము మీదికిపోయి ఇటునటు పచారు చేయుచు ప్రక్క ఇంట స్నానమాడు స్త్రీ నొకతెను చూచెను. ఆమె మిక్కిలి అందగత్తె.

3. అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదంతము అడుగగా వారు ఆమె యెలీయాము కూతురు, హిత్తీయుడైన ఊరియా భార్య బత్షెబ అని చెప్పిరి.

4. రాజు సేవకులనంపి బత్షెబను పిలిపింపగా ఆమె అతని యొద్దకు వచ్చెను. బత్షెబ ముట్టుతయై అప్పుడే శుద్ధి చేసికొనుచుండెను. దావీదు ఆమెతో శయనించెను. అటుపిమ్మట బత్షెబ ఇంికి వెడలిపోయెను.

5. ఆమెకు నెలతప్పగా, నేను గర్భవతినైతినని ఇంటనుండి దావీదునకు కబురు పంపెను.

6. దావీదు హిత్తీయుడైన ఊరియాను నా ఎదుికి పంపుమని యోవాబునకు దూతద్వారా వార్త పంపెను. అతడట్లే చేసెను.

7. ఊరియా తన ఎదుికి రాగానే దావీదు యోవాబును గూర్చి, యిస్రాయేలు సైన్యములనుగూర్చి, కుశలమడిగి, పోరెట్లు నడచు చున్నదని ప్రశ్నించెను.

8. అతనితో మాటలాడి చాలించిన పిమ్మట, ఇక ఇంికిపోయి సేద దీర్చు కొమ్మని చెప్పెను. ఊరియా దావీదును వీడి వెడలి పోవగనే రాజు అతని ఇంికి భోజనపదార్థములను పంపించెను.

9. కాని ఊరియా ఇంికిపోక, తన ఏలినవారి సేవకులతో పాటు రాజప్రాసాదద్వారమున నిదురించెను.

10. దావీదు ఊరియా ఇంికివెళ్ళలేదని వినెను. అతనిని పిలువనంపి ”నీవు దూరప్రయాణము చేసి వచ్చితివికదా? ఇంికి వెళ్ళవా?” అని ప్రశ్నించెను.

11. ఊరియా ”మందసమును, యిస్రాయేలు యూదా సైన్యములును గుడారములలో వసించుచుండ గను, నా అధిపతియైన యోవాబును నా ప్రభువగు నీ సేవకులును బయట దండులో నుండగను, నేను తిని, త్రాగి ఆలిని కూడుటకు ఇంికి పోదునా? నీతోడు, నీ జీవము తోడు, నేను ఆలాగు చేయువాడను కాను” అని దావీదుతో అనెను.

12. దావీదు అతనితో ”నేడిచటనే యుండుము. రేపు వెళ్ళవచ్చును” అని చెప్పెను. కనుక ఊరియా నాడును యెరూషలేముననే గడపెను.

13. అంతట దావీదు ఊరియాను తనతో భోజనముచేయుటకు పిలిపించెను. అతడు బాగా తిని, త్రాగిన తరువాత దావీదు అతనిని మత్తునిగా చేసెను. ఆ రేయికూడ ఊరియా తన ఏలినవారి సేవకులమధ్య పడకమీద పండుకొనెనేగాని ఇంికి పోలేదు.

14. మరునాడు ఉదయము దావీదు ‘ఊరియా కొట్టబడి హతమగునట్లు అతనిని పోరుముమ్మరముగా జరుగుచోట ముందివరుసలో నిల్పి నీవు అతనియొద్ద నుండి వెళ్ళిపొమ్ము’ అని 15. యోవాబునకు ఒక లేఖ వ్రాసి ఊరియా చేత పంపించెను.

16. యోవాబు పట్టణమును ముట్టడించి, వీరులు హోరాహోరిగా పోరు సల్పుదురని తెలిసిన నెలవుననే ఊరియా నుంచెను.

17. అమ్మోనీయులు నగరము వెడలివచ్చి యోవాబును ఎదుర్కొనిపోరాడిరి. దావీదు సైనికులలో కొందరుకూలిరి. వారితోపాటు హిత్తీయుడైన ఊరియా కూడ మడిసెను.

18. యోవాబు దావీదునకు యుద్ధవార్తలు విని పించుటకు దూతనంపెను.

19-20. అతడు దూతతో ”నీవు యుద్ధవార్తలు వినిపించిన పిమ్మట రాజు కోపము తెచ్చుకొని ‘మీరు పోరు జరుగుచుండగా పట్టణము దాపునకు ఏలపోయితిరి? శత్రువులు కోట గోడల మీదినుండి బాణములు గుప్పింతురని తెలియదా?

21. యెరూబ్బెషెతు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపిరి? తేబేసున ఒక ఆడుది ప్రాకారము మీదినుండి తిరుగిరాతిని జారవిడుచు టచే గదా అతడు మ్రగ్గిపోయినది? మరి మీరు ప్రాకారము చెంతకేల పోయితిరి?’ అని ప్రశ్నించినచో, ‘నీ సేవకుడు ఊరియాకూడ గతించెనని చెప్పుము’ ” అని వివరించెను.

22. దూత దావీదునొద్దకు వచ్చి యోవాబు చెప్పుమన్న సంగతులన్నియు పూసగ్రుచ్చినట్లు విన్న వించెను. దావీదు యోవాబుపై కోపము తెచ్చు కొని దూతతో ”మీరు కోటగోడల దగ్గరకేల వెళ్ళితిరి? శత్రు వులు గోడలమీది నుండి బాణములు విసరుదురని యెరుగరా? యెరూబ్బెషెతు కుమారుడు అబీమెలెకు నెవరు చంపిరి? తేబేసున ఒక ఆడుది ప్రాకారము మీదినుండి తిరుగిరాతిని జారవిడుచుటచే గదా అతడు మ్రగ్గిపోయినది? మరి మీరు ప్రాకారము చెంతకేలపోయితిరి?” అనెను.

23. దూత ”శత్రువులు మామీదపడి నగరమువెలుపలి వరకును న్టెివేసిరి. మేము వారినెదిర్చి మరల నగరద్వారము వరకును నెట్టుకొనిపోతిమి.

24. అపుడు కోట ప్రాకారము మీదినుండి విలుకాండ్రు మీ సేవకులపై బాణములు విసరిరి. మనవారు కొందరుకూలిరి. హిత్తీయుడైన ఊరియా కూడ గతించెను” అని చెప్పెను.

25. దావీదు సేవకుని చూచి ”యోవాబుతో నా మాటగా ఇటుల పలుకుము. ‘జరిగిన దానికి వగవకుము. కత్తి ఇచట ఒకనిని అచట నొకనిని బలిగొనుచుండునుగదా! యుద్ధము తీవ్రముచేసి పట్టణమును సాధింపుము. ధైర్యము వహింపుము’ ” అని నుడివెను.

26. బత్షెబ భర్త చనిపోయెనని విని అతనికొరకు శోకించెను.

27. శోకదినములు గడచిన తర్వాత దావీదు సేవకులను పంపి, బత్షెబను నగరమునకు రప్పించుకొని పెండ్లిచేసికొనెను. అటుతరువాత ఆమె బిడ్డను కనెను. కాని దావీదు చేసిన పని యావేకు కోపము రప్పించెను.

Previous                                                                                                                                                                                                   Next