బలిపీఠము

1. నీవు తుమ్మకొయ్యతో చదరముగానుండు బలిపీఠము నిర్మింపవలయును. అది ఐదుమూరల పొడవు, ఐదుమూరల వెడల్పు, మూడుమూరల ఎత్తు ఉండవలెను.

2. దాని నాలుగు మూలలయందు నాలుగు కొమ్ములను నిలుపుము. ఈ కొమ్ములు పీఠముతో ఏకాండముగా ఉండవలెను. పీఠము అంతికి ఇత్తడి రేకు పొదిగింపుము.

3. పీఠమునొద్ద వాడుటకై, కాల్చిన క్రొవ్వును ఎత్తుటకు పళ్ళెరములు, గరిటెలు, నీళ్ళు చిలుకరించు గిన్నెలు, ముళ్ళగరిటెలు, నిప్పునెత్తు పళ్ళెరములను ఇత్తడితో చేయింపుము.

4. మరియు పీఠమునకు ఇత్తడితో జల్లెడవిం తడిక చేయింపుము. ఈ తడికకు నాలుగువైపుల నాలుగు ఇత్తడి కడియ ములు చేయింపుము.

5. దానిని పీఠపు క్రింది అంచు నుండి సగము ఎత్తువరకు ఉండునట్లు అమర్పుము.

6. పీఠమును మోసికొని పోవుటకై తుమ్మకఱ్ఱతో మోత కఱ్ఱలు చేయించి, వానిని ఇత్తడితో పొదిగింపుము. 7. పీఠమునకు రెండువైపుల ఉన్న కడియములలో వానిని చేర్చి పీఠమును మోసికొనిపోవలయును.

8. పీఠమునకు మధ్య బోలు ఏర్పడునట్లుగా దానిని పలకలతో నిర్మింపుము. నీకు పర్వతముమీద చూపిన నమూనా ప్రకారమే దానిని నిర్మింపుము.

గుడారపు ఆవరణము

9. నీవు గుడారమునకు చుట్టు ఆవరణము నిర్మింపవలయును. దక్షిణదిశకు పేనినదారముతో నేసిన నారబట్టతో నూఱుమూరల పొడవుగల తెరను తయారుచేయింపుము.

10. ఇత్తడి దిమ్మలలో కూర్చిన ఇరువది ఇత్తడి కంబములకు దానిని తగిలింప వలయును. ఈ కంబములకు కొక్కెములు, వెండి బద్దలు ఉండవలయును.

11. ఆ రీతిగనే ఉత్తరదిశన నూఱుమూరల పొడవు గల తెరలు ఉండవలయును. ఇరువది ఇత్తడి దిమ్మలలో కూర్చిన యిరువది ఇత్తడి కంబములకు వానిని తగిలింపవలయును. ఈ కంబములకు కొక్కెములు వెండిబద్దలు ఉండును.

12. ఆవరణము వెడల్పు కొరకు పడమి వైపున ఏబది మూరల పొడవుగల తెరలు, పది కంబములు, పది దిమ్మలు ఉండవలయును.

13. తూర్పు వైపున అనగా ఉదయదిక్కున ఆవరణము ఏబది మూరలు వెడల్పు ఉండవలయును.

14. ఆవరణ ద్వారమునకు ఒక వైపున పదునైదు మూరల పొడవుగల తెరలుండ వలయును. వానిని మూడు దిమ్మెలలో నుంచి మూడు కంబములకు తగిలింపవలయును.

15. ఆ రీతిగనే రెండవ వైపున గూడ పదునైదు మూరల పొడవుగల తెరలు, మూడు దిమ్మలలోనికి జొన్పిన మూడు కంబ ములు ఉండవలయును.

16. ఆవరణ ప్రవేశమునకు ఇరువది మూరల పొడవుగల మరొక తెర ఉండ వలెను. అది ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో పేనిన మంచిదారముతో కళాత్మకముగా నేయబడి అల్లికపనులు కలదై ఉండవలయును. అది నాలుగు దిమ్మెలలో జొనిపిన నాలుగు కంబములపై ఉండవల యును.

17. ఆవరణము చుట్టు పాతియుంచిన కంబములన్నిని వెండిబద్దలతో కలిపివేయవలయును. ఈ కంబములకు మరల వెండికొక్కెములు ఇత్తడి దిమ్మలు ఉండవలయును.

18. ఆవరణము నూఱు మూరల పొడవు, ఏబదిమూరల వెడల్పు, ఐదు మూరల ఎత్తు ఉండవలయును. తెరలను పేనిన సన్నని నారదారముతో, దిమ్మలను ఇత్తడితో చేయ వలయును.

19. గుడారమున వాడు పరికరముల నన్నికిని, గుడారమునకు, ఆవరణమునకు వాడు మేకులన్నిని ఇత్తడితోనే చేయవలయును.

నూనె దీపము

20. దీపమును వెలిగించుటకై దంచితీసిన స్వచ్ఛమైన ఓలివుతైలము కొనిరమ్మని యిస్రాయేలీయు లకు చెప్పుము. గుడారమున నిత్యము దీపము వెలుగుచు ఉండవలయును.

21. అహరోను అతని కుమారులు సాన్నిధ్యవు గుడారమున మందసము ఎదుటనున్న తెర వెలుపల ఈ దీపము వెలిగింప వలయును. అచట నెలకొనియున్న దేవుని సన్నిధిని ఆ దివ్వె సాయంత్రమునుండి ఉదయమువరకు నిత్యము వెలుగుచుండవలయును. యిస్రాయేలీయు లును, వారిసంతతివారును ఈ నియమమును సదా పాింపవలయును.

Previous                                                                                                                                                                                                 Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము