ఎఫ్రాయీము తెగ

16 1. చీట్లు వేయగా యోసేపు తెగవారికి వచ్చిన వంతుగా యోర్దాను నుండి యెరికో జలముల వరకు తూర్పు వైపుగల నేల లభించెను. వారి సరిహద్దు యెరికో నుండి పీఠభూముల మీదుగా బేతేలు పీఠ భూముల వరకు వ్యాపించెను. 

2. అచినుండి బేతేలు లూసు మీదుగా అారోతు చెంతగల ఆర్కి వరకు వ్యాపించెను.

3. అచినుండి క్రిందివైపుగా, పడమి వైపుగాపోయి యాఫ్లెతీయుల దిగువనున్న బేత్‌హోరోను వరకును, గేసేరు వరకును వ్యాపించి సముద్రమును చేరెను.

4. యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయీము లకు లభించిన వారసత్వభూమి యిదియే.

5. ఎఫ్రాయీము తెగవారికి వంశముల ప్రకారము లభించిన వారసత్వభూమి తూర్పు సరిహద్దు అారోతు -అద్దారు వరకు, ఎగువన బేత్‌హోరోను వరకును వ్యాపించి సముద్రమును చేరెను.

6. ఉత్తరమున మిక్మేతాతు వరకును వ్యాపించెను. అక్కడినుండి తూర్పు నకు తిరిగి తానాత్‌-షిలో వరకును, యానోవా వరకును వ్యాపించెను.

7. అచినుండి దిగువకు మరలి అారోతు, నారాల వరకు పోయి యెరికో మీదుగా వచ్చి యోర్దాను చేరెను.

8-9. ఆ సరిహద్దు తాపువా మీదుగా పడమికి తిరిగి కానా వాగుమీదుగా సముద్ర మును చేరెను. ఎఫ్రాయీము తెగ వారికి వారివారి కుటుంబములను అనుసరించి వచ్చిన వారసత్వభూమి యిదియే. మనష్షే తెగవారికి లభించిన వారసత్వ భూమి యందును ఎఫ్రాయీమీయులకు ఈయబడిన పట్టణములు, పల్లెలు కలవు.

10. ఎఫ్రాయీము జనులు గేసేరున వసించు కనానీయులను వెడలగొట్ట లేకపోయిరి. కనుక వారు నేికిని ఎఫ్రాయీమీయులతో వసించుచున్నారు. అయినను వీరు వారిచేత వ్టెి చాకిరి చేయించుకొనిరి.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము