లోకముపై మన విజయము

5 1. యేసు, మెస్సయా అని విశ్వసించు ప్రతివ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతివ్యక్తియు   ఆయన పుత్రుని కూడ ప్రేమించును.

2. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియును.

3. దేవుని ప్రేమయన, ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. 4. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందు దుము.

5. యేసు, దేవునిపుత్రుడు అని నమ్మువాడు తప్ప, లోకమును ఎవడు ఓడింపగలుగును?

యేసుక్రీస్తును గూర్చిన నిదర్శనము

6. ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తే. ఆయన జలముతోను, రక్తముతోను వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే కాక, జలముతోను, రక్తముతోను వచ్చెను.

7. ఆత్మ సత్యము. కనుక, సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.

8. సాక్ష్యాధారములు మూడు. అవి ఆత్మ, జలము, రక్తము. ఆ మూడును ఏకీభవించుచున్నవి.

9. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ము దుము. మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటె బలవత్తరము. ఇది దేవుడు తనకుమారుని గూర్చి ఒసగిన సాక్ష్యము.

10. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతివ్యక్తియు తన హృదయమున ఈ   సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి, తన కుమారునిగూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించినవాడై, దేవుని అసత్యవాదిగ చేయు చున్నాడు.

11. దేవుడు మనకు నిత్యజీవము నొసగి యున్నాడు. అది ఆయన కుమారునిద్వారా మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము.

12. కుమారుని పొందిన ప్రతి వ్యక్తియందు ఈ జీవము ఉన్నది. దేవుని కుమారుని పొందని వ్యక్తియందు జీవము లేదు.

నిత్య జీవము

13. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు, నిత్యజీవము కలవారని తెలిసికొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను.

14. ఆయన చిత్తాను సార ముగ, ఆయనను మనము ఏదేని కోరినచో, ఆయన తప్పక వినునని మనము ఆయనయందు ధైర్యము గలవారమైయున్నాము.

15. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలి యును. కనుక మనము కోరినది ఆయన ఒసగునని మనకు తెలియును.

16. తన సహోదరుడు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనను చూచినయెడల అతడు దేవుని ప్రార్థింపవలెను. ఆ మరణకారకము కాని పాపము చేసినవానికి దేవుడు జీవము నొసగును. మరణ కారకమైన పాపముకూడ కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలయునని నేను చెప్పుట లేదు.

17. సమస్త అక్రమము పాపమేకాని అందు మరణకారకము కాని పాపము ఉన్నది.

18. దేవుని బిడ్డ ఎవడును పాపములను కొనసాగింపడని మనకు తెలియును. దేవుని కుమారుడు వానిని రక్షించును. దుష్టుడు వానికి హానిచేయలేడు.

19. మనము దేవునకు సంబంధించిన వార మనియు, లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియును.

20. దేవుని కుమారుడు దర్శనము ఇచ్చెననియు, యథార్థమగు దేవుని మనము గ్రహించు వివేకము మనకు ఒసగెననియు మనకు తెలియును. మనము దేవునియందు, ఆయన కుమారుడగు యేసు క్రీస్తు నందు ఉన్నాము. ఈయనయే యథార్థమగు దేవుడు. నిత్యజీవము.

21. చిన్న బిడ్డలారా! విగ్రహములకు దూరముగ ఉండుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము