ప్రభువును నమ్ముటను గూర్చి
33 1. ఇతరులు తమను దోచుకొనకున్నను
తాము ఇతరులను దోచుకొనువారు,
ఇతరులు తమకు ద్రోహము చేయకున్నను
తాము ఇతరులకు ద్రోహము చేయువారు
నాశనమగుదురు.
మీ దోపిడియు మీ ద్రోహములును
ఇక ముగియును.
ఇప్పుడు మిమ్ము ఇతరులు దోచుకొందురు.
మీకు ఇతరులు ద్రోహము చేయుదురు.
2. ప్రభూ! నీవు మమ్ము కరుణింతువు.
మేము నిన్ను నమ్మితిమి.
ప్రతిరోజు నీవు మాకు అండగానుండుము.
ఆపదలలో మమ్ము ఆదుకొనుము.
3. నీవు జాతులను బెదిరింపగా
వారు పారిపోవుదురు.
నీవు పోరాడుటకు లేవగా
జనులు చెల్లాచెదరు అగుదురు.
4. అన్యులు మిడుతలదండువలె ఎగిరి,
ఆ జనులు విడచిపోయిన కొల్లసొమ్మును
చీడపురుగులు క్టొివేయునట్లు దోచుకుందురు.
5. ప్రభువు ఉన్నతుడయ్యెను.
అతడు ఆకసమునుండి పరిపాలనము చేయును.
సియోనును నీతిన్యాయములతో నింపును.
6. ప్రజలకు స్థిరత్వము నొసగును.
జనులకు వివేకవిజ్ఞానములు దయచేసి
వారిని కాపాడును. వారి నిధి దైవభీతియే.
7. శూరులు సహాయమును అర్ధించుచున్నారు.
శాంతికాముకులైన రాయబారులు
శోకించుచున్నారు.
8. ప్రజలు రహదారులను విడనాడిరి.
వానిగుండ ఎవరు ప్రయాణము చేయుటలేదు.
జనులు నిబంధనములను మీరుచున్నారు.
ఒప్పందములను భగ్నము చేయుచున్నారు.
వారెవరిని గౌరవముతో చూచుటలేదు.
9. ప్రజలు పొలములను సాగుచేయక వదలివేసిరి. లెబానోను అడవులు వాడిపోయినవి.
షారోను లోయ ఎండి ఎడారి అయినది.
బాషాను, కర్మెలు మండలములలో
చెట్ల ఆకులురాలినవి.
ప్రభువు తన శత్రువులను హెచ్చరించుట
10. ప్రభువు జాతులతో ఇట్లనుచున్నాడు:
”నేనిప్పుడు పనికి పూనుకొందును.
మీ ఎదుట నా శక్తిని
పరిపూర్ణముగా ప్రదర్శింతును.
11. మీరు పన్నుపన్నాగములు వ్టిపొట్టు, వ్టిచెత్త.
మీ ఊపిరియే అగ్నివలె మిమ్ము దహించును.
12. నేను మిమ్ము కాల్చి సున్నము చేయుదును.
నరికినముండ్ల పొదలవలె మిమ్ము కాల్చుదును.
13. దూరముననున్నవారు నేనేమి చేసితినో
తెలిసికొందురుగాక!
దగ్గరలోనున్నవారు నా శక్తిని గుర్తింతురుగాక!”
14. సియోనునందలి పాపులు వెరగొందుదురు.
దుష్టులు భయముతో కంపింతురు.
”మనలో నిత్యము ఈ జ్వలించు అగ్నితో
నివసించుచు తట్టుకోగల వారెవరు?
ఈ నిత్యాగ్నితో నివసించుచు
భరింపగలవారెవరు?” అని వారు పలుకుదురు.
15. నీతితో జీవించువాడు, సత్యము చెప్పువాడు,
పేదలను పీడించి సొమ్ము చేసికొననివాడు,
లంచములకు చేయిచాచనివాడు,
హత్య చేయువారితో పొత్తుకలవనివాడు,
దుష్కార్యముల పొంతకు పోనివాడు,
16. ఉన్నతస్థలమున సురక్షితముగా వసించును.
కొండమీది దుర్గమునందువలె
భద్రముగా జీవించును.
అతనికి అన్నపానీయములకు లోటు ఉండదు.
బంగారు భవిష్యత్తు
17. మీరు విశాలమైన దేశమును,
వైభవముగా ఏలు రాజును చూతురు.
18. మీరు పూర్వము మీకు భీతిప్టుించిన
సంగతులను జ్ఞప్తికితెచ్చుకొందురు.
”జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడున్నాడు?
తూకము వేయువాడు ఎక్కడున్నాడు?
బురుజులను లెక్కించువాడు ఎక్కడున్నాడు?
19. గర్వాత్ములును, మీకర్థముకాని
అనాగరికమైన నత్తిభాషను మ్లాడు
అన్యజాతి ప్రజలను మీరు మరల చూడబోరు.
20. ఉత్సవనగరమైన సియోనును చూడుడు,
యెరూషలేమును తిలకింపుడు.
అది సురక్షితమైన నగరము.
అది మేకులు కదలక, త్రాళ్ళు తెగక,
పదిలముగా నిల్చియుండు గుడారము వింది.
21. అచట ప్రభువు
తన వైభవము మనకు చూపించును.
మనము విశాలమైన నదులు,
వాగులుపారు తావున వసింతుము.
కాని వానిలో శత్రువుల నావలు పయనింపవు.
22. ఆ నావలలోని త్రాళ్ళు వదులుగా ఉన్నవి,
వానిలోని కొయ్యస్తంభములను
స్థిరముగా నిలబెట్టలేకున్నారు,
తెరచాపలు ఎత్తలేకున్నారు.
23. మనము శత్రువుల కొల్లసొమ్మును
దోచుకోవచ్చును.
కుింవారును ఆ సొత్తు చేజిక్కించుకోవచ్చును. ప్రభువే మనకు న్యాయాధిపతి,
ధర్మశాస్త్రప్రదాత, రాజు, రక్షకుడు.
24. యెరూషలేమున వసించు ఏ ఒక్కడును
”నాకు వ్యాధి సోకినది” అని చెప్పడు.
ప్రభువు వారి పాపములను పరిహరించును.