ఉపోద్ఘాతము:
పేరు: ”నిర్గమము” అనగా ‘నిష్క్రమించడము’ లేదా ‘బయటకు వెళ్ళిపోవడము’ (జూఒంఈఏఐ). గ్రంథనామము ఈ అతి ప్రధానమైన అంశము (ఐగుప్తు నుండి విడుదల) ఆధారితముగా నిర్ణయించబడినది.
కాలము: క్రీ.పూ. 17వ-13వ శతాబ్దముల కాలవ్యవధి.
రచయిత(లు): మోషే వ్రాసెనని సాంప్రదాయక అభిప్రాయము. ఈ పంచకాండములను (ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ) క్రీ.పూ 6వ శతాబ్దములో బబులోనియా ప్రవాసానంతరము సంకలనము చేయబడెనని పలువురు ఆధునిక పండితుల అభిప్రాయము.
గ్రంథము విభజన: ఈ గ్రంథమును మూడు ప్రధానభాగములుగా విభజించవచ్చును. 1. మోషే నేతృత్వమున యావే దేవుడు యిస్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించడము (1:1-13:16), 2. ఐగుప్తునుండి సీనాయి పర్వతము వరకు ఎడారి ప్రయాణము (13:17-18:27), 3. సీనాయి పర్వతము వద్ద సంఘటనలు (19:1-40:38).
ముఖ్యాంశములు: బానిసత్వము, విముక్తి, ఎడారిలో దేవుని ఆలనపాలన, అవిధేయత, అవిశ్వాసము, పది ఆజ్ఞలు, గుడారము, నిబంధనప్రజగా యిస్రాయేలు జాతి ఆవిర్భావము.
క్రీస్తుకు అన్వయము: ఈ గ్రంథములోని విముక్తి అంశము క్రీస్తుకు అతిసమీప అన్వయము. ఐగుప్తులో సంభవించిన అరిష్టములు (7:8-11:10); మోషే నాయకత్వము, పాస్కపండుగ (12:1-20); ఫరోవేధింపులు (14:8-13); రెల్లుసముద్రము దాటడము (14:21); మేఘ, అగ్నిస్తంభము (13:21); మోషే విజయగీతిక (15:1-19); మిశ్రిత తెగలు (12:38); మారా (15:22-25); మన్నా (16:4-31); మస్సా, మెరీబా (17:1-7). పది ఆజ్ఞలు (20:4-17); గుడారము (అధ్యా.25,26); మందసము (25:10-21); దీపస్తంభము (25:31-39); యాజకులు; నిబంధనములు (అధ్యా.29,34) మున్నగు అనేక అంశములు క్రీస్తుకు అన్వయింపదగినవే.