పాస్క, పొంగని రొట్టెల పండుగలు

16 1. అబీబు నెలలో పాస్కపండుగను కొనియాడి మీ ప్రభువైన దేవుని స్తుతింపుడు. ఆ నెలలో ఒకరాత్రి ప్రభువు మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను.

2. ప్రభువు తన నామమునకు నివాసస్థానముగా ఎన్ను కొనిన తావులోనే పాస్కను కొనియాడవలయును. అచట మీ మందలనుండి కొనివచ్చిన బలిపశువును వధింపుడు.

3. ఈ పండుగ చేసికొనునపుడు మీరు పొంగినరొట్టెలు భుజింపరాదు. ఏడుదినములపాటు పొంగనిరొట్టెలనే ఆరగింపుడు. మీరు ఐగుప్తునుండి త్వరత్వరగా వెడలివచ్చినపుడు పొంగనిరొట్టెలనే భుజించిరికదా! ఆ రొట్టెలు బాధను జ్ఞప్తికి తెచ్చును. వానిని భుజించుటవలన మీరు ఐగుప్తునుండి వెడలి వచ్చిన దినమును జీవితాంతమువరకు జ్ఞప్తియందుంచు కొందురు.

4. మీరు నివసించు ప్రదేశమున ఏడు దినములవరకు పులిసిన పదార్ధము కనిపింపకూడదు. పండుగ మొది దినమున చంపిన బలిపశువు మాంసమును ఆ దినముననే భుజింపవలయును. మరునాికి మిగల్చరాదు.

5. ప్రభువు మీకిచ్చిన ఇతర నగరములలో పాస్కబలిని అర్పింపరాదు.

6. నీ దేవుడైన యావే తన నామమునకు నివాసస్థలముగా ఎన్నుకొనిన తావులోనే బలినర్పింపుడు. సూర్యాస్త మయమున అనగా మీరు ఐగుప్తునుండి బయలు దేరివచ్చిన సమయమున, ఆ బలిని అర్పింపుడు.

7. ప్రభువు ఎన్నుకొనిన ఆరాధనస్థలముననే బలిపశువు మాంసమును వండి భుజింపుడు. ఆ మరుసిరోజు ప్రొద్దుననే మీ ఇండ్లకు వెడలిపోవచ్చును.

8. మీరు ఆరురోజులపాటు పొంగనిరొట్టెలు తినుడు. ఏడవ రోజున యెల్లరును సమావేశమై ప్రభువును ఆరా ధింపుడు. ఆ రోజున మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

వారముల పండుగ

9. కోతకారునుండి మొదలుప్టిె ఏడువారముల కాలమును లెక్కింపుడు.

10. ఆ కాలము ముగియ గనే ప్రభువును స్తుతించుచు వారములపండుగ చేసికొనుడు. యావే మీకిచ్చిన వానినుండి మీరు ఆయనకు స్వేచ్ఛగా కానుకలు అర్పింపుడు.

11. మీ పిల్లలతో, సేవకులతో, మీ నగరములందు వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథబాలలతో, వితంతువులతో ప్రభువు సమక్షమున ఆనందించి సంతసింపుడు. నీ దేవుడైన యావే తన నామమునకు నివాసస్థలముగా ఎంచుకొనిన తావుననే ఈ ఉత్సవము జరుపుకొనుడు.

12. ఈ ఆజ్ఞలనెల్ల జాగ్రత్తగా పాింపుడు. మీరు ఐగుప్తున బానిసలుగా నుింరని మరచిపోవలదు.

గుడారముల పండుగ

13. మీ కళ్ళములలోని ధాన్యము మీ త్టొిలోని ద్రాక్షసారాయము ఇల్లు చేరినపిదప ఏడురోజులపాటు గుడారములపండుగ చేసికొనుడు.

14. మీ పిల్లలతో, సేవకులతో మీ నగరములలో వసించు లేవీయులతో, పరదేశులతో, అనాథబాలబాలికలతో, వితంతువులతో ప్రభువు సమక్షమున ఆనందించి సంతసింపుడు.

15. ప్రభువు ఎంచుకొనిన ఆరాధనస్థలముననే ఏడురోజుల పాటు ఆయన పేరిట పండుగ చేసికొనుడు. ప్రభువు మీ పంటను, మీ కృషిని దీవించును. గనుక మీరెల్లరు సంతసింపుడు.

16. మీ మగవారందరు ఏడాదికి మూడుమార్లు అనగా పులియనిరొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, గుడారములపండుగలోను మీ దేవుడైన యావే ఎంచుకొనిన స్థలమున మీ మగవారందరు ఆయన సన్నిధిలో కనపడవలయును. ఎవరును వ్టిచేతులతో వచ్చి ప్రభువును దర్శింపరాదు.

17. మీ ప్రభువు మిమ్ము దీవించిన దానికి అనుగుణముగా మీరును ఆయనకు కానుకలు కొనిరండు.

న్యాయాధిపతులు, అధికారులు

18. ప్రభువు మీకు ఈయనున్న నగరము లన్నింటను మీ తెగలకు న్యాయాధిపతులను, అధికారు లను నియమింపుడు. వారు నిష్పాక్షికముగా తగవులు తీర్పవలయును.

19. వారు న్యాయము చెరుపరాదు. జనులముఖము చూచి తీర్పుచెప్పరాదు. లంచములు పుచ్చుకొనరాదు. లంచము బుద్ధిమంతుల కళ్ళనుకూడ పొరలు క్రమ్మునట్లు చేయును. వారిచే తప్పుడు నిర్ణయములు చేయించును.

20. మీరు ఖండితముగా న్యాయమును పాింపవలయును. అప్పుడు మీరు ప్రభువు ఈయనున్న నేలను స్వాధీనము చేసికొని అచట నివసించుదురు.

విగ్రహారాధన

21. మీ దేవుడైన యావేకు మీరు కట్టు బలిపీఠముచెంత అషేరాదేవతకు స్తంభమును నాట రాదు.

22. విగ్రహారాధనకు గాను శిలాస్తంభమును నెలకొల్పరాదు. అి్ట స్తంభమును ప్రభువు ఏవగించు కొనును.

Previous                                                                                                                                                                                                     Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము