దావీదు దేవాలయ నిర్మాణము గూర్చి చెప్పుట

28 1. దావీదు యిస్రాయేలు అధికారులనందరిని యెరూషలేమున సమావేశపరచెను. తెగనాయకు లును, రాజోద్యోగులును, ఆయా వంశనాయకులును, సైనికసహస్ర, శతాధిపతులును, రాజునకును, అతని కుమారులకును చెందిన ఆస్తిపాస్తులను, పశుగణము లను సంరక్షించువారును, రాజప్రాసాదపాలకులును, వీరులును, ప్రముఖులును మొదలైన వారందరును హాజరైరి.

2. దావీదు వారిముందట నిలుచుండి ఇట్లు పలికెను: ”సోదరులారా! నా ప్రజలారా! వినుడు. నేను మన ప్రభువునకు పాదపీఠమైన మందసమునకు శాశ్వతమైన మందిరమును నిర్మింపగోరి సన్నాహ ములు చేసితిని. 3. కాని ప్రభువు నాతో ‘నీవు యుద్ధములుచేసి రక్తమొలికించితివి కనుక నీ చేతు లతో నా నామమునకు మందిరము క్టింపరాదు’ అని చెప్పెను.

4. ప్రభువు మా కుటుంబమునుండి నన్నును, నా సంతతిని యిస్రాయేలునకు శాశ్వత పాలకులుగా ఎన్నుకొనెను. 5. ఆయన యూదా తెగలవారిని, వారిలో మా కుటుంబమువారిని నాయకు లుగా ఎన్నుకొనెను. మా కుటుంబమునుండి నన్ను  ఎన్నుకొని యిస్రాయేలీయులెల్లరికి రాజుగా చేసెను. అది ఆయన అనుగ్రహము. ఆయన నాకు చాలమంది తనయులను దయచేసెను. వారిలో సొలోమోనును ఎన్నుకొని యిస్రాయేలీయులపై తన రాజ్య సింహాస నమున కూర్చుని పరిపాలించుటకు అతనిని నియ మించెను.

6. ప్రభువు నాతో ‘నీ కుమారుడు సొలోమోను నాకు మందిరము క్టించును. అతనిని నా కుమారునిగా ఎన్నుకొింని. నేనతనికి తండ్రి నగుదును.

7. అతడు ఇప్పివలెనే ఇకమీదట గూడ నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాించెనేని నేనతని రాజ్యము శాశ్వతముగా నిలుచునట్లు చేయుదును” అని చెప్పెను.

8. ”కనుక ఇప్పుడు నేను మన దేవుడైన ప్రభువు ఎదుట, ఆయన సమాజమున చేరిన ఈ యిస్రాయేలీ యుల ఎదుటను మిమ్ము ఆజ్ఞాపించు చున్నాను. మీరు ప్రభువు ఆజ్ఞాపించిన విధులనెల్ల పాింపుడు. అప్పుడు మీరు ఈ సారవంతమైన నేలను స్వాధీనము చేసికొని, దానిని తరతరములవరకు మీ సంతతికి భుక్తము చేయుదురు.

9. కుమారా! సొలోమోనూ! నీ మట్టుకు నీవు నీ తండ్రియొక్క దేవుడైన ప్రభువును అంగీకరింపుము. పూర్ణహృదయముతోను, పూర్ణమనస్సుతోను ఆయనను సేవింపుము. ఆయనకు నరుల హృదయములును వారి ఆలోచనలును బాగుగా తెలియును. నీవు ప్రభు వును ఆశ్రయింతువేని ఆయన నిన్ను అంగీకరించును. కాని నీవు ప్రభువునుండి వైదొలగెదవేని ఆయన నిన్ను శాశ్వతముగా విడనాడును.

10. తనకు పవిత్రమైన మందిరమును క్టించుటకు ప్రభువు నిన్నెన్నుకొనెను. కనుక నీవు దీక్షతో ఆ కార్యమునకు పూనుకొనుము.”

11. అంతట దావీదు దేవాలయ నిర్మాణ నమూ నాను సొలోమోనునకు చూపించెను. మరియు సంబంధిత వస్తుసంభారములు ఉంచుగదులు, మీది గదులు, లోపలిగదులు, కరుణాపీఠమునుంచు గది మొదలైనవాని నమూనాలనుగూడ అతనికి చూపించెను.

12. ఇంకను అతడు తన మనసులో భావించుకొనిన దేవాలయప్రాంగణములు వాని చుట్టు గల గదులు, కానుకలను సంబంధిత వస్తుసంభారములను పదిల పరచుటకు వలయుగదులు మొదలైన వాని నమూనా లను గూడ సొలోమోనునకు చూపించెను.

13. యాజకు లను, లేవీయులను బృందములుగా విభజించుట గూర్చియు, వారిచేత ఆరాధనకార్యక్రమములను కొనసాగింపవలసిన తీరునుగూర్చియు, ఆరాధనమున వాడబడు పాత్రలను పదిలపరచుట గూర్చియు వివరించెను.

14-16. ఆయాపాత్రలను, పలురకముల దీపములను, దీపస్తంభములను, వెండి ఉపకరణము లను, దేవుని ఎదుటనుంచు రొట్టెలను పెట్టు బంగారు బల్లను తయారుచేయుటకు ఎంత వెండిని, ఎంత బంగారమును వినియోగింపవలయునో కూడ తెలియ జేసెను.

17. గరిటెలను, గిన్నెలను, కూజాలను చేయించుటకెంత మేలిమిబంగారము వాడవలయునో, పాత్రలు చేయించుటకు ఎంత వెండి కావలయునో చెప్పెను.

18. ధూపపీఠమును చేయించుటకు, మందసముమీదికి రెక్కలు చాచిన కెరూబుదూతల ప్రతిమలకు రథమును చేయించుటకు ఎంత మేలిమి బంగారము కావలయునో వివరించెను.

19. దేవా లయ నిర్మాణమునుగూర్చి ప్రభువే స్వయముగా తనకు తయారుచేసి ఇచ్చిన నమూనాయందు పై వివరము లన్నియు కలవని సొలోమోనుతో చెప్పెను.

20. కడన దావీదు సొలోమోనుతో ”నీవు ధైర్య స్థైర్యములు అలవరచుకొనుము. దేనికిని భయపడక దేవాలయ నిర్మాణమునకు పూనుకొనుము. నేను సేవించిన ప్రభువు నీకు బాసటయైయుండును. దేవాలయ నిర్మాణము పూర్తియగువరకును, 21. అతడు నిన్ను విడనాడక నీకు తోడైయుండును. యాజకులు, లేవీయులు దేవాలయమున చేయ వలసిన పనులు ముందుగనే నిర్ణయింపబడినవి. ఆయా కళలలో ఆరితేరిన పనివారు నీకు తోడ్పడుటకు సిద్ధముగానున్నారు. ఎల్లప్రజలు, వారి నాయకులు నీ ఆజ్ఞలు మనసావాచా పాించుటకు వేచి యున్నారు” అని చెప్పెను.