గుడారపు తెరలు, పైకప్పులు

1. ఊదా, ధూమ్ర, ఎరుపురంగుల ఉన్నితో, పేనిన సన్ననిదారముతో నేయబడి కెరూబీము దూతల బొమ్మల అల్లికగలిగిన పదితెరలను నీవు మందిరము కొరకు సిద్ధము చేయవలయును.

2. ప్రతి తెరయు ఇరువదిఎనిమిదిమూరల పొడవు, నాలుగు మూరలు వెడల్పు ఉండవలయును. తెరలన్నికి ఇదియే కొలత.

3. తెరలలో ఐదింని కలిపి కుట్టవలయును. ఆ తీరునే మిగిలిన ఐదింని గూడ కలిపికుట్టవలయును.

4. ప్రతి ఐదింలో చివరితెర అంచులకు ఊదారంగు దారముతో ఉచ్చులు వేయింపుము.

5. మొది ఐదు తెరలలో మొదిదానికి ఏబది ఉచ్చులు, అదే విధముగా రెండవ ఐదుతెరలలో చివరిదానికి ఏబది ఉచ్చులు ఉండవలయును.

6. ఏబది బంగారు గుండీ లను చేయించి ఆ ఉచ్చు ముడులన్నిని కలిపి వేయుము. అప్పుడు అదంతయు ఏకమందిరమగును.

7. అటు తరువాత మేకవెంట్రుకలతో పదు నొకండు కంబళి తెరలు తయారుచేసి గుడారముగా మందిరముపై కప్పువేయింపుము.

8. ఈ తెరలు ముప్పది మూరలపొడవు, నాలుగుమూరల వెడల్పు ఉండవలయును. అన్నికిని అదియే కొలత. 9. వానిలో ఐదింని ఒకతెరగా, ఆరింని మరియొక తెరగా క్టుింపుము. ఆరవతెరను నడిమికిమడిచి దానిలో సగభాగమును గుడారము చూరున అమ ర్చుము.

10. ఐదుతెరలలో మొదిదానికి ఏబది ఉచ్చులు, ఆరుతెరలలో కడపిదానికి ఏబది ఉచ్చులు వేయింపుము.

11. ఏబది ఇత్తడి గుండీలను చేయించి ఆ తెరల రెండుకొనలనున్న ఉచ్చులను కలిపి ఒకే గుడారమగునట్లు ఆ గుండీలను ఉచ్చులకు తగిలించి దానిని కూర్చవలెను.

12. ఒకతెరలో సగభాగము గుడారపు చూరున వ్రేలాడినట్లే మిగిలిన సగభాగము గుడారము చివర వ్రేలాడును.

13. గుడారముగా కప్పిన తెరలు నిలువువైపున మూరెడు పొడవున క్రిందికి మందిరము ఇరువైపుల వ్రేలాడుచుండవలయును.

14. అటుతరువాత పొట్టేళ్ళ చర్మమునకు ఎఱ్ఱని అద్దకమువేసి దానిని గుడారమునకు మీదికప్పుగా వేయుము. దానిమీద మరల మేలురకమైన గ్టితోలు కప్పు వేయింపుము.

గుడారపు చట్రము

15. మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు చట్రములు చేయింపవలయును.

16. ప్రతిచట్రము పదిమూరల పొడవు, మూరన్నర వెడల్పు ఉండవల యును.

17. ప్రతి చట్రమునకు క్రింద సమదూర ములో రెండు కొసలు ఉండును. ఈ కొసల సహాయ ముతో చట్రములన్ని కలిపివేయవచ్చును. చట్రము లన్నింని ఈ  రీతినే రెండు రెండు కొసలతో చేయింప వలయును.

18. గుడారమునకు దక్షిణపువైపు ఇరువది చట్రములు చేయింపుము.

19. నలువది వెండి దిమ్మెలుగూడ చేయించి చట్రములక్రింద జొప్పింపుము. ఒక్కొక్క చట్రపు రెండు కొసలు రెండేసి దిమ్మలలోనికి గ్రుచ్చుకొనిపోవును.

20. ఆ రీతిగనే గుడారపు ఉత్తర భాగమునకు ఇరువది చట్రములు చేయింపుము.

21. నలువది వెండిదిమ్మెలుకూడ చేయించి ఒక్కొక్క చట్రము క్రింద రెండుదిమ్మల చొప్పున అమర్పుము. 22. పడమట, గుడారపు వెనుకి భాగమునకు ఆరు చట్రములు చేయింపుము.

23. ఆ వెనుకి భాగపు రెండుమూలలకు రెండుచట్రములు ఉండవలయును.

24. ఈ మూలచట్రములు క్రిందిభాగమున ఒక దానితో ఒకి అతుకుకొని ఉండవలయును. మీది భాగమునగూడ మొది కడియమువరకు అవి ఒక దానితోనొకి అతుకుకొని ఉండవలయును. వెనుకి మూలచట్రములు రెండింని తయారు చేయవలసిన నియమము ఇది.

25. కనుక వీనితో కలిపి మొత్తము ఎనిమిది చట్రములు, వానిక్రింద పదునారు వెండి దిమ్మలు ఉండును.

26. తుమ్మకొయ్యతో అడ్డ కఱ్ఱలను కూడ చేయింపుము.

27. ఉత్తరపువైపున వున్న చట్రములను ఒక్కిగా కలిపి వేయుటకు ఐదింని, దక్షిణపువైపున ఉన్న చట్రములను ఒక్కిగా కలిపివేయుటకు ఐదింని, పడమివైపున ఉన్న చట్రములను ఒక్కిగా కలిపి వేయుటకు ఐదింని చేయింపుము.

28. మధ్యనున్న అడ్డకఱ్ఱ, చట్రముల సగమెత్తున నడిమికి, ఒక కొన నుండి మరియొక కొనవరకు చట్రములలో దూరి యుండవలయును.

29. చట్రములకు బంగారము పొదిగించి వానికి బంగారుకడియములు వేయింపుము. అడ్డకఱ్ఱలకుగూడ బంగారము పొదిగించి వానిని  ఈ కడియములలో దూర్పింపుము.

30. నీకు పర్వతము మీద చూపిన నమూనాప్రకారముగనే గుడారమును నిర్మింపుము.

గుడారమునందలి అడ్డుతెర

31. పేనినదారముతో ఊదా, ధూమ్ర, ఎరుపు రంగులఉన్నితో కళాత్మకముగా నేయబడి, కెరూబీము దూతలబొమ్మల అల్లికగల అడ్డుతెరను తయారు చేయింపుము.

32. తెరను నాలుగు తుమ్మస్తంభము లకు వ్రేలాడదీయుము. ఆ స్తంభములను బంగారముతో పొదిగి, వానికి బంగారు కొక్కెములు అమర్చుము. ఆ స్తంభములను వెండిదిమ్మలలో అమర్చియుంచుము.

33. ఆ అడ్డుతెరను కొక్కెములకు వ్రేలాడదీసి, శాసనములుంచిన మందసమును ఆ అడ్డుతెరవెనుక భాగములో ఉంచుము. ఈ అడ్డుతెర గర్భగృహము నుండి పరిశుద్ధస్థలమును వేరుపరుచును.

34. గర్భ గృహముననున్న శాసనములు గల మందసముమీద కరుణాపీఠము నుంచుము.

35. బల్లను అడ్డుతెర వెలుపలఉంచుము. దీపస్తంభమును గుడారమునకు దక్షిణభాగమున బల్లకెదురుగా నిలుపుము.

36. గుడారపు ద్వారమునకు పేనినదారముతో, ఊదా, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో కళాత్మకముగా నేయబడి అల్లిక పనిగల తెరక్టుింపుము.

37. ఈ తెరకు ఐదు తుమ్మస్తంభములు చేయింపుము. ఆ స్తంభములకు బంగారము పొదిగించి, బంగారు కొక్కెములు అమర్చి వానిని ఐదు ఇత్తడిదిమ్మలలో బిగింపుము.

Previous                                                                                                                                                                                              Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము