మందసము తిరిగి వచ్చుట

6 1. ప్రభుమందసము ఏడుమాసముల వరకు ఫిలిస్తీయుల దేశముననుండెను.

2. అప్పుడు ఫిలిస్తీ యులు వారి యాజకులను, మాంత్రికులను పిలిపించి ”ప్రభువు మందసమునేమి చేయుదము? దాని తావు నకు దానిని పంపివేయవలెనన్న ఏఏ కానుకలతో పంప వలెను?” అని అడిగిరి.

3. వారు ”ప్రభుమందసమును పంపివేయకోరెదరేని ఊరికే పంపరాదు. మీ అపరాధ ములకు ప్రాయశ్చిత్తముగా కానుకలు అర్పించు కొనుడు. అప్పుడు మీ వ్యాధి కుదురును. ప్రభువు ఇంతవరకు మిమ్మును పీడించి పిప్పిచేయుట ఏల మానలేదో కూడ తెలిసికొందురు” అనిరి.

4. ప్రజలు ”అటులయిన ప్రాయశ్చిత్తముగా ఏమి కానుకలను అర్పింపవలయును?” అని మరల అడుగగా వారు ”ఫిలిస్తీయుల దొరలు ఐదుగురు కదా! ఈ ఐదుగురిని ఉద్దేశించి ఐదు బంగారపు ఎలుకలు, ఐదు బంగారపు బొబ్బలు చేసి పంపుడు. మిమ్మును మీ పాలకులను పీడించు వ్యాధి ఒక్కియే.

5. కావున మీకు లేచిన బొబ్బలకు, మీ నేలను పాడుచేసిన ఎలుకలకు గుర్తు లుగా బొమ్మలు చేసిపంపుడు. వీనివలన యిస్రాయేలు దేవునికి మహిమ కలిగింతురు. అతడు మీ సమర్పణ ములను చూచి మిమ్మును, మీ వేల్పులను, మీ దేశమును పీడించుట మానివేయునేమో!

6. ఐగుప్తు ప్రజలవలె, ఫరోవలె మీరు గుండె బండ జేసికోనేల? నాడు ప్రభువు వారికి ఉపద్రవములు కలిగింపగా వారు యిస్రాయేలు ప్రజలను పోనీయలేదా?

7. కనుక వెంటనే క్రొత్తబండిని సిద్ధము చేయింపుడు. కాడి మోయని పాడిఆవులను రెండింని బండికి పూన్పుడు. వాని లేగలను తల్లులనుండి వేరుచేసి కొట్టమునకు తోలుకొనిపొండు.

8. ప్రభు మందసమునెత్తి బండిపై బెట్టుడు. అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా మీరు అర్పించు బంగారుబొమ్మలను ఒక పెట్టెలో ప్టిె మందసము ప్రక్కనుంచి బండి సాగదోలుడు.

9. మందసము ఏవైపు వెళ్ళునో పరికింపుడు. అది నేరుగా తన తావునకు పోవు బాట ప్టిపోయి బేత్‌షేమేషు పట్టణము చేరుకొనెనేని మనకు ఈ విపత్తు తెచ్చిప్టిెన వాడు ప్రభువేయని తేటతెల్లమగును. కాదేని అతడుగాక, మరియేదో శక్తి తలవని తలంపుగా మనలను పీడించె నని తెలిసిపోవును” అనిరి.

10. వారు చెప్పినట్లే ప్రజలు రెండు పాడి ఆవు లను తోలుకొనివచ్చి బండికిక్టి వాని దూడలను కొట్టమున క్టివేసిరి. 11. ప్రభుమందసము బండి పైకెత్తి బంగారపు ఎలుకలు, బంగారు బొబ్బలు నుంచిన పెట్టెను మందసముచెంతనుంచిరి.

12. అంతట బండిని కదలింపగా గోవులు బేత్‌షెమేషు త్రోవబ్టి అంబాయని అరచుచు కుడికిగాని ఎడమకు గాని కదలక నేరుగా సాగిపోయెను. ఫిలిస్తీయుల దొరలును బేత్‌షెమేషు పొలిమేరల వరకు శకటము వెంట నడచివెళ్ళిరి.

మందసము బేత్షెమేషు చేరుట

13. అప్పుడు బేత్‌షెమేషు పౌరులు పొలములో గోధుమపంట కోయుచుండిరి. మందసము కంట బడగనే వారు అమితానందము నొందిరి.

14. బేత్‌షెమేషు పౌరుడైన యెహోషువ చేనిచెంతకు వచ్చి బండి ఆగిపోయెను. అచ్చటనొక పెద్దబండకలదు. పొలమునందలి వారు కొయ్యను నరికి గోవులను వధించి ప్రభువునకు దహనబలినర్పించిరి.

15. లేవీయులు ప్రభుమందసమును దానిచెంతనున్న బంగారుబొమ్మల పెట్టెను దింపి బండపై ప్టిెరి. ఆనాడు బేత్‌షెమేషు పౌరులు ప్రభువునకు బలులను, దహనబలులను సమర్పించిరి.

16. ఫిలిస్తీయుల అధికారులు ఐదుగురును జరిగినదెల్ల కన్నులారచూచి జాగుచేయక నాడే ఎక్రోనునకు వెడలిపోయిరి.

17. అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను అను ఐదు ఫిలిస్తీయ పట్టణములకు అపరాధ ప్రాయశ్చిత్తముగా ఫిలిస్తీయులు ఐదు బంగారుబొబ్బలను సమర్పించు కొనిరి.

18. ఐదుగురు ఫిలిస్తీయ అధికారుల అధీన మున ఉన్న రక్షితపట్టణములకు, అరక్షిత గ్రామము లకు ఒక్కొక్కి చొప్పున బంగారపు ఎలుకలను గూడ సమర్పించుకొనిరి. బేత్‌షెమేషు పౌరుడైన యెహోషువ చేనిచెంత ప్రభుమందసము నుంచిన ఆ పెద్దబండ నేికిని ఈ గాథకు సాక్ష్యముగా నిలిచియున్నది.

19. బేత్‌షెమేషు పౌరులలో కొంతమంది మందసము లోనికిచూడగా దేవుడు వారిలో డెబ్బదిమందిని చంపి వేసెను. ప్రభువు అంతమంది ప్రాణములు తీసెను గనుక పురజనులు గోడుగోడున విలపించిరి.

మందసము కిర్యత్యారీము చేరుట

20. అంతట బేత్‌షెమేషు పౌరులు ”పరమ పవిత్రుడైన ఈ యావేప్రభువు ముందటెవడు నిలువ గలడు? మన యొద్దనుండి ఇక ఈ ప్రభువునెవరి చెంతకు పంపెదము” అని మథనపడిరి.

21. కనుక వారు కిర్యత్యారీము నగరమునకు దూతలనంపి ”ఫిలిస్తీయులు మందసమును పంపిరి. దిగిరండు, దీనిని మీ నగరమునకు గొనిపొండు” అని వార్త పంపిరి.

Previous                                                                                                                                                                                                 Next