మహోన్నతుడును,

కరుణామయుడునైన ప్రభువు

113 1.     మీరు ప్రభువును స్తుతింపుడు.

                              ప్రభువు సేవకులారా!

                              ప్రభువును స్తుతింపుడు.

                              ఆయన నామమును సన్నుతింపుడు.

2.           ప్రభువు నామము

               ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక!

3.           సూర్యోదయమునుండి సూర్యాస్తమయమువరకు

               ప్రభువునామము వినుతింపబడునుగాక!

4.           ప్రభువు జాతులన్నింని మించినవాడు

               ఆయన తేజస్సు ఆకాశమునకు పైన

               వెలుగొందుచుండును.

5.           మన దేవుడైన ప్రభువువింవాడు ఎవడు?

               ఆయన మహోన్నతస్థానమున వసించును.

6.           అయినను క్రిందికి వంగి ఆకాశమును

               భూమిని పరికించి చూచును.

7.            ఆయన పేదలను దుమ్ములోనుండి పైకిలేపును. దీనులను బూడిదనుండి లేవనెత్తును.

8.           వారిని రాజుల సరసన,    

               తన ప్రజలను ఏలు పాలకుల సరసన

               కూర్చుండబెట్టును.

9.           ఆయన గొడ్రాలు తన ఇంట

               మన్నన పొందునట్లు చేయును.

               ఆమెకు బిడ్డలను ఒసగి సంతుష్టి కలిగించును.

               మీరు ప్రభువును స్తుతింపుడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము