6 1. మిత్రుడుగా మెలగవలసిన చోట
శత్రువుగా మెలగవలదు.
చెడ్డపేరువలన నీవు
అపకీర్తి తెచ్చుకొందువు.
కల్లలాడు దుర్మార్గులకు అి్టది చెల్లును.
2. ఆశాపాశములకు తావీయకుము.
అవి నిన్ను ఎద్దుకొమ్ములతోవలె పొడిచివేయును.
3. నీవు ఎండిపోయి, ఆకులను పండ్లను
కోల్పోయిన చెట్టు వింవాడవగుదువు.
4. ఆశాపాశము వలన నరుడు చెడును.
నీ శత్రువులు నిన్ను చూచి నవ్వుదురు.
స్నేహము
5. మృదుభాషణము వలన చాలమంది స్నేహితులు కలుగుదురు,
మర్యాదవర్తనము వలన మిత్రులు పెరుగుదురు.
6. నీకు పరిచితులు చాలమంది ఉండవచ్చుగాక!
సలహాదారుగా మాత్రము వేయిమందిలో
ఒక్కనిని ఎన్నుకొనుము.
7. పరీక్షించి చూచిన పిదపనేగాని
ఎవనినైన మిత్రునిగా అంగీకరింపరాదు.
త్వరపడి ఎవరిని నమ్మరాదు.
8. కొందరు తమకు అనుకూలముగా ఉన్నపుడు
నీకు మిత్రులగుదురు.
కాని ఆపదలు వచ్చినపుడు నిన్ను ప్టించుకొనరు.
9. మరికొందరు ఏదో వివాదమును
పురస్కరించుకొని నీ నుండి విడిపోయెదరు.
ఆ వివాదమును ఎల్లరికిని తెలియజేసి
నిన్ను చీకాకు పెట్టెదరు.
10-11. ఇంకను కొందరు నీ ఇంట భుజింతురు.
నీ కలిమిలో నీకు అంి పెట్టుకొని ఉండి,
నీ సేవకులకు ఆజ్ఞలిడుదురు.
కాని నీకు ఆపదలు వచ్చినపుడు నీ చెంతకురారు.
12. నీకు దీనథ ప్రాప్తించినపుడు
వారు నీకు విరోధులగుదురు.
నీ కింకికూడ కన్పింపకుండ మరుగైపోవుదురు.
13. నీ శత్రువులకు దూరముగా నుండుము.
నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించుచుండుము.
14. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన
కోట వింవాడు.
అి్ట వాడు దొరికినచో నిధి దొరికినట్లే.
15. అతడికి వెలకట్టలేము,
అతని విలువ అన్నిని మించినది.
16. అతడు కార్యసిద్ధినొసగు
రసాయనమువింవాడు.
దైవభీతి కలవారికే అి్ట స్నేహితుడు దొరకును.
17. దైవభీతి కలవానికి మంచిమిత్రులు దొరకుదురు.
అతని మిత్రులుకూడా దైవభీతి కలవారే అగుదురు
విజ్ఞానమునకు సేవ చేయవలెను
18. కుమారా! బాల్యమునుండియు
ఉపదేశమును నేర్చుకొనుము.
ముదిమిపైబడు వరకును
విజ్ఞానమును గడించుచుండుము.
19. రైతు పొలము దున్ని విత్తనములు నాినట్లే
నీవు విజ్ఞానార్జనకొరకు కృషి చేయుము.
అప్పుడు నీకు చక్కని పంట లభించును.
ఆ కృషిలో నీవు కొంత శ్రమపడవలెను.
కాని అనతికాలముననే
నీవు మంచిపంటను సేకరింతువు.
20. క్రమశిక్షణకు లొంగని వారికి
విజ్ఞానము కటువుగా నుండును.
మూర్ఖుడు దీర్ఘకాలము విజ్ఞానముతో మనలేడు.
21. విజ్ఞానము అతనికి పెద్దబండవలె
భారముగా అనిపించగా
శీఘ్రమే దానిని అవతలికి న్టేివేయును.
22. తన పేరుకు తగినట్లుగనే క్రమశిక్షణ కష్టమైనది.
అందరు దానికి లొంగరు.
23. కుమారా! నా హెచ్చరికలాలింపుము,
నా ఉపదేశమును నిరాకరింపకుము.
24. విజ్ఞానపు గొలుసులతో నీ పాదములను
బంధించుకొనుము.
దాని కాడిని నీ మెడమీద పెట్టుకొనుము.
25. విజ్ఞానమును నీ భుజములమీద
పెట్టుకొని మోయుము.
దాని పగ్గములపట్ల అనిష్టము చూపకుము.
26. విజ్ఞానమును ప్రీతితో చేపట్టుము.
హృదయపూర్వకముగా దాని మార్గములలో
నడువుము.
27. విజ్ఞానమును అన్వేషింపుము,
అది నీకు దర్శనమిచ్చును.
ఒకసారి దొరకిన తరువాత
దానిని మరల చేజారిపోనీయవద్దు.
28. కడన దానివలననే నీవు హృదయశాంతిని
పొందుదువు.
దానివలననే మహానందము పొందుదువు.
29. విజ్ఞానపుగొలుసులు నీకు రక్షణదాయకములు.
దాని కాడి నీకు గౌరవసూచకమైన
వస్త్రమువింది.
30. దాని కాడి నీకు బంగారుఆభరణము వింది.
దాని పగ్గములు అరుణ పట్టబంధముల వింవి
31. గౌరవప్రదమైన రాజవస్త్రమువలె,
వైభవోపేతమైన కిరీటమువలె,
నీవు విజ్ఞానమును ధరింతువు.
32. నాయనా! నీకు కోరిక కలదేని నేర్చుకొనవచ్చును. నీకు పట్టుదల కలదేని తెలివిని పొందవచ్చును.
33. నీకు వినుటకిష్టము కలదేని గ్రహింపవచ్చును.
సావధానముగా విందువేని
నీవు విజ్ఞానమును పొందుదువు.
34. నీవు పెద్దల యొద్దకు పొమ్ము.
జ్ఞానినెవనినైన గుర్తుప్టి అతనికి శిష్యుడవుకమ్ము.
35. ధార్మిక బోధలను శ్రద్ధగా వినుము.
విజ్ఞానసూక్తులను వేనిని అలక్ష్యము చేయకుము.
36. జ్ఞాని ఎవడైన దొరికెనేని వేకువనే
అతని యొద్దకు పొమ్ము.
నీ రాకపోకలతో అతని గడప
అరిగిపోవునట్లు చేయుము.
37. ప్రభువు ఆజ్ఞలను ధ్యానింపుము.
ఆయన శాసనములనెల్లవేళల
అధ్యయనము చేయుము.
ఆయన నీ మనస్సునకు ప్రబోధము కలిగించి,
నీవు కోరుకొనిన విజ్ఞానమును దయచేయును.