ప్రవాసము వెడలి వచ్చిన నిర్వాసితులు

8 1. అర్తహషస్త కాలమున బబులోనియా ప్రవాస మునుండి ఎజ్రాతోపాటు యెరూషలే మునకు తిరిగి వచ్చిన వంశనాయకుల పేర్లివి:

2-14.     

               ఫీనెహాసు వంశీకుడు గెర్షోము;

               ఈతామారు వంశీకుడు దానియేలు;

               దావీదు వంశీకుడు హత్తూషు, షెకన్యా;

               ఫరోషు వంశీకుడు జెకర్యా,

               అతని కుటుంబపురుషులు నూటఏబదిమంది;

               పహత్మోవబు వంశీకుడు

               సెరహ్యా కుమారుడు ఎల్యోయేనయి,

               అతని కుటుంబపురుషులు రెండువందలమంది;

               సట్టు వంశీకుడు

               యహాసీయేలు కుమారుడు షెకన్యా,

               అతని కుటుంబపురుషులు మూడువందలమంది;

               ఆదీను వంశీకుడు

               యోనాతాను కుమారుడు ఎబెదు,

               అతని కుటుంబ పురుషులు ఏబది మంది;

               ఏలాము వంశీకుడు

               అతల్యా కుమారుడు యెషయా,

               అతని కుటుంబపురుషులు డెబ్బది మంది;

               షెఫ్యా వంశీకుడు

               మికాయేలు కుమారుడు సెబద్యా,              

               అతని కుటుంబపురుషులు ఎనుబది మంది;

               యోవాబు వంశీకుడు

               యెహీయేలు కుమారుడు ఓబద్యా,

               అతని కుటుంబపురుషులు

               రెండువందల పదునెనిమిది మంది;

               బాని వంశీకుడు

               షెలోమీతు కుమారుడు యెసిపియా,

               అతని కుటుంబ పురుషులు

               నూట అరువది మంది;

               బేబై వంశీకుడు బేబై కుమారుడు జెకర్యా, 

               అతని కుటుంబపురుషులు

               ఇరువదిఎనిమిది మంది;

               అస్గాదు వంశీకుడు

               హక్కాను కుమారుడు యోహానాను,

               అతని కుటుంబపురుషులు

               నూట పదిమంది మంది;

               అదోనీకాము వంశీకులు

               ఎలీఫేలెటు, యెయూయేలు, షెమయా,

               వారి కుటుంబపురుషులు అరువది మంది;

               బిగ్వయి వంశీకులు ఉతాయి, సక్కూరు,

               వారి కుటుంబపురుషులు డెబ్బది మంది.

లేవీయులు ప్రోగగుట

15. నేను అహవావైపు పారు ఏిఒడ్డున ప్రజ లను ప్రోగుచేసితిని. అచట మేము మూడునాళ్ళు మకాముచేసితిమి. నేను ప్రజలను పరిశీలించిచూడగా వారిలో యాజకులు ఉన్నారుగాని లేవీయులులేరైరి.

16. వెంటనే వివేకవంతులైన నాయకులను కొందరిని పిలిపించితిని. వారు ఎలియెజెరు, అరియేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము.

17. వీరందరిని కాసిఫ్యయందలి యిస్రాయేలీయులకు అధికారియగు ఇద్దో వద్దకు పంపితిని. అతనిని అతని అనుచరులను దేవాలయ మున ఊడిగము చేయుటకు పనివారిని (నెతినీ యులు) పంపుడని అడిగించితిని.

18. దైవకృపవలన వారు లేవీ కుమారుడైన మాహ్లీ వంశీకుడు, సమర్ధుడు అయిన లేవీయుడు శరబ్యాను మావద్దకు పంపిరి. అతని బంధువులు, కుమారులు కలిసి మరి పదు నెనిమిది మంది వచ్చిరి.

19.వారు మెరారీ వంశీ కులు హషాబ్యాను యెషాయాను కూడ పంపిరి. వారి బంధువులు మరి ఇరువది మందివచ్చిరి.

20. ఇంకను రెండువందల ఇరువది మంది దేవాలయ సేవకులు గూడ ప్రోగైరి. వారి పూర్వులను దావీదురాజు అతని ఉద్యోగులు లేవీయులకు సహాయకులుగా నియమించి యుండిరి.ఈ ప్రజలందరిని వారివారి పేర్లతో నమోదు చేయించితిమి.

నిర్వాసితుల ఉపవాసము, ప్రార్ధన

21. అహవా యేి  ఒడ్డున  మా జనులెల్లరు ఉపవాసము చేయవలెనని దేవుని యెదుట వినయము చూపవలెనని ఆజ్ఞాపించి తిని. మేమును మాబిడ్డలును, మా వస్తుసామాగ్రితో సురక్షితముగా ప్రయాణము చేయుటకు దేవునకు మనవి చేయుడని కోరితిని.

22. దారిలో దొంగలబెడదనుండి మమ్ము కాపాడుటకు సైనికులను, రౌతులను వెంట పంపుడని రాజును వేడుకొనుటకు నాకు మొగము చెల్లదాయెను. ఎందు కనగా మా దేవుడు తనను నమ్మినవారిని దీవించునని, తన్ను నమ్మనివారిని కోపముతో శిక్షించునని అంతకు ముందే నేను రాజుతో చెప్పియుింని.

23. కనుక మేము ఉపవాసము చేసి మా మీద కరుణచూపుమని దేవుని వేడుకొింమి. ఆయన మా మొరాలించెను.

దేవాలయమున కానుకలు

24. యాజకులలో ముఖ్యులైన వారి నుండి షెరేబ్యాను, హషబ్యాను, మరి పదిమందిని ఎన్ను కొింని.

25. రాజు, అతని సలహాదారులును, ప్రధా నాధికారులును, యిస్రాయేలు ప్రజలును దేవళము కొరకు ఇచ్చిన వెండి బంగారములను పాత్రములను వారెదుట తూకము వేయించితిని.

26-27. నేను వారి వశము చేసిన వస్తు సామాగ్రి ఇది:

               ఆరు వందల ఏబది మణుగుల వెండి,

               నూరు మణుగుల వెండి పాత్రలు,

               నూరు మణుగుల బంగారపు పాత్రలు, 

               వెయ్యి తులముల ఇరువది బంగారు పాత్రలు, 

               బంగారమువలె మెరయు రెండు రాగిగిన్నెలు.

28. నేను ఆ యాజకులతో ”మీరు మీ పితరులదేవుడైన యావేకు నివేదితులు కదా! అట్లే జనులు స్వేచ్ఛగా యావేకు అర్పించిన ఈ వెండి బంగారు పాత్రలును ప్రతిష్ఠితములైనవి సుమా!

29. మీరు యెరూషలేము చేరుకొను వరకు వీనిని భద్ర ముగా నుంచుడు. అట యెరూషలేమున యావే మందిరస్థలమున వీనిని తూకమువేయించి యాజ కులకు, లేవీయులకు, యెరూషలేమునందలి యూదుల నాయకులకు అప్పగించువరకు భద్రపరు పుడు” అని చెప్పితిని.

30. అంతట యాజకులు లేవీయులు యెరూషలేము దేవాలయమునకు కొని పోవుటకు ఆ వెండి, బంగారములను, పాత్రములను తూకము వేసిపుచ్చుకొనిరి.

యెరూషలేమునకు ప్రయాణము

31. మొదినెల పండ్రెండవ దినమున మేమెల్ల రము అహవా నదిని వీడి యెరూషలేమునకు బయలు దేరితిమి. ప్రభువు మమ్ము చల్లనిచూపు చూచెను. ప్రయాణమున శత్రుబాధనుండియు, దొంగలబాధ నుండియు మమ్ము కాపాడెను.

32. మేము యెరూషలేము చేరి అక్కడ మూడునాళ్ళు విశ్రమించితిమి.

33. నాలు గవనాడు దేవాలయమునకు వెళ్ళి వెండి బంగార ములను, పాత్రలను తూకమువేసి యాజకుడును, ఊరియా కుమారుడునైన మెరేమోతుకు ముట్టజెప్పితిమి. అతనితోపాటు ఫీనెహాసు కుమారుడగు ఎలియాజరు ను, ఇద్దరు లేవీయులు, యేషూవ కుమారుడైన యోసాబాదు, బిన్నూయి కుమారుడైన నోవద్యాయు ఉండిరి.

34. ప్రతి వస్తువును లెక్కబ్టెి తూకము వేసిరి. ఆ తూకము లెక్కలను గూడ నమోదుచేసిరి.   

35. ప్రవాసమునుండి వచ్చినవారందరును యిస్రాయేలు దేవునికి దహనబలి సమర్పించుటకై బలిపశువులను కొనివచ్చిరి. యిస్రాయేలీయులందరి తరపున పండ్రెండుకోడెలను, తొంబది ఆరు పొట్టే ళ్ళను, డెబ్బదిఏడు గొఱ్ఱెపిల్లలను అర్పించిరి. పాప పరిహారమునకై పండ్రెండు మేకపోతులను గూడ అర్పించిరి.

36. రాజు ఇచ్చిన శాసనమును పశ్చిమ యూఫ్రీసు అధికారులకును, సేనాధిపతులకును చూపగా వారు యిస్రాయేలు ప్రజలకును, దేవాలయ మునకును సాయము చేయుటకు అంగీకరించిరి.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము