మోవాబు

2 1. ప్రభువిట్లనుచున్నాడు:

               మోవాబు చేసిన మూడు అతిక్రమముల

               కారణమున, దాని నాలుగవ అతిక్రమము

               కారణమున నేను వారిని దండించి తీరుదును.

               వారు ఎదోము రాజు ఎముకలను బుగ్గి

               అగునట్లుగా కాల్చి అపవిత్రము చేసిరి. 

2.           కావున నేను మోవాబు మీదికి నిప్పును పంపుదును.

               కెరీయోతు నగరులను కాల్చివేయుదును.

               సైనికులు రణధ్వని చేయుచుండగా,

               బాకాలనాదము వినిపించుచుండగా

               మోవాబీయులు యుద్ధనాదమున కూలుదురు.

3.           నేను మోవాబు రాజును

               ఆ దేశ నాయకులను ఎల్లరిని వధింతును.”

యూదా

4.           ప్రభువిట్లనుచున్నాడు:

               యూదా చేసిన మూడు అతిక్రమముల

               కారణమున,  దాని నాలుగవ అతిక్రమము

               కారణమున నేను వారిని దండించి తీరుదును.

               వారు ప్రభువు ధర్మశాస్త్రమును తృణీకరించిరి. ఆయన ఉపదేశములు పాింపరైరి.

               తమ పితరులనుసరించిన అపమార్గము ప్టిరి.

5.           కావున నేను యూదా మీదికి నిప్పును పంపుదును.

               యెరూషలేము నగరులను కాల్చివేయుదును”.

యిస్రాయేలునకు శిక్ష

6. ప్రభువు ఇట్లనుచున్నాడు :

               యిస్రాయేలీయులు చేసిన మూడు

               అతిక్రమముల కారణమున, 

               దాని నాలుగవ అతిక్రమము కారణమున

               నేను వారిని శిక్షించి తీరుదును.

               వారు బాకీలు తీర్చలేని సజ్జనులను

               ద్రవ్యమునకు అమ్మివేయుచున్నారు.

               చెప్పులజోడు కొరకై

               పేదలను అమ్మివేయు చున్నారు.

7.            దుర్బలుల తలలమీద కాళ్ళుప్టిె

               నేలకు త్రొక్కుచున్నారు.

               దరిద్రులను త్రోవనుండి ప్రక్కకు నెట్టుచున్నారు.

               తండ్రీ కుమారులు ఒకే యువతిని కూడి

               నా దివ్యనామమును

               అపవిత్రము చేయుచున్నారు.

8.           తాము పేదలనుండి కుదువసొమ్ముగా

               పుచ్చుకొనిన వస్త్రములను పరచుకొని

               బలిపీఠములన్నింయొద్ద పవ్వళించుచున్నారు.

               తమకు అప్పుపడియున్న వారినుండి గైకొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరమునందే పానము చేయుచున్నారు.

9.           అయినను జనులారా!

               నేను మీ మేలుకొరకు

               దేవదారువలె దీర్ఘకాయులును, 

               సింధూరము వలె బలాఢ్యులును

               మీ ముందర నిలువకుండ

               నేను నాశనము చేసితిని!

               పైన వారి ఫలములను

               క్రింద వారి మూలములను నాశనము చేసితిని.

10.         నేను మిమ్ము ఐగుప్తునుండి తోడ్కొనివచ్చి

               అమోరీయుల నేలను మీకు భుక్తము చేయుటకు నలువది యేండ్లపాటు ఎడారిలో నడిపించితిని.

11.           మీ తనయులలో కొందరిని ప్రవక్తలనుగా,

               మీ యువకులలో కొందరిని

               నాజరీయులనుగా నియమించితిని.

               యిస్రాయేలీయులారా! ఇది నిజము కాదా?

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

12.          అయినను మీరు నాజరీయులచే

               ద్రాక్షారసము త్రాగించిరి.

               ప్రవక్తలను ప్రవచనము చెప్పనీయరైరి.

13.          కావున నేను మిమ్ము ధాన్యముతోనిండిన

               బండి నేలను తొక్కివేసినట్లు

               నేను మిమ్మును అణగదొక్కుదును.

14.          అపుడు శీఘ్రముగా

               పరుగెత్తువారు కూడ తప్పించుకోజాలరు.

               బలాఢ్యులు సత్తువను కోల్పోదురు.

               శూరులు స్వీయ ప్రాణములనే కాపాడుకోజాలరు.

15.          విలుకాండ్రు నిలువజాలరు.

               శీఘ్రగాములు పారిపోజాలరు.

               రౌతులు ప్రాణములతో తప్పించుకోజాలరు.

16.          ఆ దినమున ధైర్యవంతులైన మహావీరులు కూడ

               ఆయుధములు జారవిడచి పారిపోదురు.

               ఇది ప్రభువు వాక్కు.

Previous                                                                                                                                                                                                    Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము