ప్రవక్త జుట్టు కత్తిరించుకొనుట

5 1. ప్రభువు ఇట్లనెను. ”నరపుత్రుడా! కక్షురకత్తివిం పదునైన కత్తి తీసికొని నీ తలను గడ్డమును గొరుగు కొనుము. ఆ జుట్టును తక్కెడలో తూచి మూడు భాగము లుగా విభజింపుము.

2. ఒక మూడవవంతును ఈ ముట్టడి ముగిసినపిదప నగరమున కాల్చివేయుము. ఇంకొక మూడవవంతును నగరము చుట్టు తిరుగుచు కత్తితో నరికివేయుము. మిగిలిన వంతును గాలిలోకి వదలివేయుము. నేను ఖడ్గముతో దాని వెంటబడుదును.

3. అయితే వాిలో కొన్ని కేశములను మాత్రము నీ చెంగున ముడిచి ఉంచుకొనుము.

4. వానిలో కొన్నిని తీసికొని నిప్పులో కాల్చివేయుము. వానినుండి అగ్ని వెలువడి యిస్రాయేలువారినందరిని కాల్చివేయును”.

5. యావే ప్రభువు ఇట్లనెను: ”ఈ యెరూషలేము నగరమును నేను అన్యజనులమధ్య నెలకొల్పితిని. దానిచుట్టు ఇతర దేశములను ఉంచితిని.

6. కాని ఈ నగరము దుష్టబుద్ధితో ఇతర జాతులకంటె అధిక ముగా, తన చుట్టుపట్లనున్న దేశములకంటె ఎక్కువగా నా ఆజ్ఞలను మీరెను. అది నా చట్టములను, న్యాయ నిర్ణయములను త్రోసిపుచ్చెను.

7.కనుక యెరూషలేమూ! నీవు యావే ప్రభుడనైన నా పలుకులు ఆలింపుము. నా ఆజ్ఞలను పాింపనందున నీవు నీ చుట్టుపట్లనున్న జాతులకంటెను దుష్టురాలవైతివి. నీవు ఇతరజాతులు పాించు నియమమునైనను పాింపవైతివి.

8. కనుక యావే ప్రభుడనైన నా పలుకులు వినుము. నేను నీకు శత్రువునగుదును. ఇతరజాతులు చూచుచుండగా నేను నిన్ను దండింతును.

9. నేను అసహ్యించుకొను పను లను నీవు చేయుచున్నాను. కనుక నిన్ను కఠినముగా దండింతును. నేను ముందెన్నడును ఇట్లు చేయలేదు. ఇక మీదటను చేయబోను.

10. ఈ శిక్ష ఫలితముగా యెరూషలేమునందలి తల్లిదండ్రులు, తమ పిల్లలను తిందురు. పిల్లలు తమ తల్లిదండ్రులను తిందురు. నేను నిన్ను శిక్షించి నీలో మిగిలినవారిని నాలుగు దిక్కులకు చెల్లాచెదరు చేయుదును.

11. కనుక సజీవుడనైన దేవుడను, యావే ప్రభుడ నగు నా పలుకులనాలింపుము. హేయ దేవతలన్నింని పూజించి చేసిన హేయమైన కార్యములతోను నీవు నా మందిరమును అమంగళము చేసితివి. కావున నేను నిన్ను నిర్దయతో నరికివేయుదును.

12. నీ జనులలో ఒక మూడవవంతు ఆకలితోను, రోగముల తోను నగరమున చత్తురు. ఇంకొక మూడవవంతు పట్టణము వెలుపల కత్తివాతపడుదురు. మిగిలిన మూడవవంతును నేను నలువైపులకు చెదుర గొట్టు దును. కత్తిదూసి వారి వెంటపడుదును.

13. నా ఆగ్రహము చల్లారువరకును నీవు నా దండనమును అనుభవింతువు. అప్పుడు నాకు ఉపశాంతి కలుగును. ఇదంతయు జరిగినప్పుడు నీ  అవిశ్వాసమువలన ఆగ్రహముచెంది నేను ఇట్లు పలికితినని నీవు తెలిసికొందువు.

14. నీ చుట్టు పట్లనున్న అన్యజాతి ప్రజలు నిన్ను గేలిచేయుదురు. నిన్ను చీదరించుకొని దూరముగా తొలగిపోదురు.

15. నేను నీపై కోపము తెచ్చుకొని నిన్ను శిక్షించు నపుడు నీ చుట్టుపట్లనున్న జాతులు వెరగొందును. అవి నిన్ను చీదరించుకొని గేలిచేయును.

16. నేను నీకు ఆహారము దొరకకుండునట్లు చేయుదును.  నీపై ఆకలి బాణములురువ్వి నిన్ను సర్వనాశనము చేయు దును.

17. నేను ఆకలిని, వన్యమృగములను పంపి నీ కుమారులను మట్టు ప్టిెంతును. వ్యాధులను, పర పీడనమును, యుద్ధమును  పంపి నిన్ను నాశనము చేయింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు”.