ఉపోద్ఘాతము:
పేరు: పేతురు రాసిన మొదటి లేఖ వివరణ చూడండి.
కాలము: క్రీ.శ. 67.
రచయిత: పేతురు. క్రీస్తు దాసుడు, అపోస్తలుడు (1:1; 3:1). కాని ఒక యూద క్రైస్తవుడు పేతురుగారి వేదసాక్షి మరణము తర్వాత, వారి పేరు మీద ఈ లేఖను వ్రాసాడని పండితుల అభిప్రాయము.
చారిత్రక నేపథ్యము: పేతురు రాసిన మొదటి లేఖలో క్రైస్తవ సంఘంలోని సమస్యలను, బాహ్యంగా కనిపించే లోటుపాట్లను ప్రత్యేకించి చర్చించి, పరిష్కారాలను సూచించాడు. అయితే రెండవ లేఖలో విశ్వాసుల వ్యక్తిగత లోపాలను, సమస్యలను గూర్చి చర్చించాడు. పేతురు కూడా తన రోజులు దగ్గర పడ్డాయని గ్రహించాడు (1:13; యోహాను 21:18-19). క్రైస్తవసంఘం ఒకవైపు రోమా పాలకుల హింసలను ఎదుర్కొంటుండగా, మరోవైపు అసత్య ప్రవక్తలు దానిని కలవరపరచారు. ఈ నేపథ్యంలో పేతురు రెండవ లేఖను రాశాడు.
ముఖ్యాంశములు: క్రైస్తవ విశ్వాసులు రాబోయే దుర్బోధకులు, తప్పుడు సిద్ధాంతాలు, అవిశ్వాస ప్రోత్సాహకాల పట్ల జాగ్రత్తగా ఉంటూ క్రీస్తు సత్యాలను నమ్మాలని సూచించాడు. ఆధ్యాత్మిక జీవితమే దేవునికి దగ్గర చేస్తుందని బోధించాడు. భవిష్యత్కాలానికి సంబంధించిన సలహాల నందించాడు (1:12-15; 3:1-2). ప్రభువు రాకడ నిశ్చయం కనుక దానికై ఎదురు చూడాలి (3:4). క్రైస్తవులు సహనంతో నిష్కళంకంగా, నిందారహితంగా జీవిస్తూ దేవునికి దగ్గరవ్వాలనేదే ఇందులోని సందేశం.
క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తు ఆత్మీయ పరిపక్వతకు కావలసిన జ్ఞానం, శక్తి (1:2, 3, 8; 3:18) .