గొల్యాతు యిస్రాయేలు సైన్యమును సవాలు చేయుట

17 1. ఫిలిస్తీయులు సైన్యములను ప్రోగుచేసికొని యూదాకు చెందిన సోకో నగరము నొద్ద గుమిగూడిరి. సోకో, అసేకాల మధ్యనున్న ఏఫేసుదమ్మీము చెంత శిబిరము పన్నిరి.

2. సౌలు, యిస్రాయేలీయులు కూడ సైన్యములను చేకూర్చుకొని సింధూరపు లోయ దగ్గర గుడారములెత్తి ఫిలిస్తీయులను ఎదుర్కొనుటకు బారులు దీర్చిరి.

3. ఈ రీతిని ఫిలిస్తీయులొక కొండపైన యిస్రాయేలీయులు ఇంకొక కొండపైన సైన్యములను మోహరించిరి. ఇరువురకు నడుమ లోయఉండెను.

4. అంతట ఫిలిస్తీయుల పక్షమునుండి గొల్యాతు అను వీరుడు ముందుకు వచ్చెను. అతడు గాతు నివాసి. తొమ్మిదడుగుల పైని జానెడు ఎత్తున ఉండెను.

5. గొల్యాతు తలపై కంచు శిరస్త్రాణమును, రొమ్మున కంచు పొలుసుల కవచమును ధరించెను. ఆ కవచము ఐదువేల తులముల బరువు కలది.

6. కాళ్ళకు పదత్రాణములు తొడిగెను. భుజములపై కంచుతో చేసిన యీటెను ధరించెను.

7. అతని బల్లెపుకఱ్ఱ, సాలెవాడు చాపుచుట్టెడి మ్రానుపట్టెవలె నుండెను. ఆ బల్లెపు ఇనుపమొన ఆరువందల తులముల బరువు కలది. బంటు డాలు మోయుచు అతనిముందు నడచు చుండెను.

8. ఫిలిస్తీయుడు యిస్రాయేలీయుల ఎదుికి వచ్చి ”సౌలు బానిసలారా! మీరిచ్చికి వచ్చి పోరాటమునకు మొనలుదీర్పనేల? నేను ఫిలిస్తీయు డనుగానా? మీ పక్షమునుండి నన్నెదిరింపగల వానిని ఎన్నుకొని ఇచ్చికి పంపుడు.

9. అతడు నాతో పోరాడి నన్ను వధించెనేని మేము మీకు దాసులమగుదుము. నేనే వానిని గెలుతునేని మీరు మాకు బానిసలై సేవ చేయుడు.

10. నేడు మీ యిస్రాయేలు సైన్యములమీద సవాలు చేయుచున్నాను. నాతో పోరాడుటకు మీ ఇష్టము వచ్చిన వానిని పంపుడు” అనెను.

11. సౌలును, యిస్రాయేలీయులును ఫిలిస్తీయుని మాట లాలించి నిశ్చేష్టులైరి.

దావీదు శిబిరమునకు వచ్చుట

12. దావీదు యూదాలోని బేత్లెహేము నివాసియు, ఏఫ్రతీయుడైన యిషాయి కుమారుడు. యిషాయికి ఎనమండుగురు పుత్రులు. సౌలునాికి అతడు ప్రాయము చెల్లినవాడు.

13. యిషాయి పెద్దకొడుకులు ముగ్గురు సౌలు పక్షమున యుద్ధము చేయబోయిరి. వారిలో పెద్దవాడు ఎలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా.

14. దావీదు కడగొట్టువాడు, పెద్దవారు ముగ్గురు సౌలుతో పోరాడ బోయిరిగదా!

15. దావీదు మాత్రము బేత్లెహేము నుండి సౌలుశిబిరము చెంతకు, శిబిరము నుండి బేత్లెహేములోని తండ్రి మందలవద్దకు వచ్చుచు బోవుచునుండెను.

16. ఫిలిస్తీయుడైన గొల్యాతు నలువదినాళ్ళు ప్రతిదినము యిస్రాయేలీయులను కవ్వించెను.

17. ఒకనాడు యిషాయి దావీదుతో ”వేయించిన ఈ మానెడు ధాన్యమును, ఈ పది రొట్టెలను గైకొని వెంటనే శిబిరమునందలి నీ అన్నల యొద్దకు పొమ్ము.

18. ఈ పది జున్నుముక్కలను వారి సైన్యాధిపతికి కానుక ఇమ్ము. తోబుట్టువుల మంచిచెడ్డలు తెలిసికొని నాకొక ఆనవాలు కొనిరమ్ము.

19. వారు సౌలు యిస్రాయేలీయులతో గూడి సింధూరపులోయ దగ్గర ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచున్నారు” అని చెప్పెను.

20. దావీదు వేకువనే లేచి మందలను ఇరుగు పొరుగు వారికి అప్పగించి సామానులను తీసికొని తండ్రి ఆజ్ఞాపించిన రీతినే బయలుదేరిపోయెను. అతడు శిబిరము చేరునప్పికి సేనలు యుద్ధనాదము చేయుచు బారులు తీరుచుండెను.

21. యిస్రాయేలీ యులు, ఫిలిస్తీయులు ఎదురెదురుగనే దండులు తీర్చిరి.

22. దావీదు సామగ్రి భద్రపరచువారియొద్ద సామానులుంచి సిపాయి వరుసలను సమీపించి అన్నల యోగక్షేమములు అడిగెను.     

23. అతడు సోదరులతో మాటలాడుచుండగనే గాతునుండి వచ్చిన ఫిలిస్తీయశూరుడు గొల్యాతు సేనల నుండి ముందుకువచ్చి పూర్వపురీతినే సవాలు చేసెను. దావీదు అతని బింకములాలించెను.

24 యిస్రాయేలీ యులు గొల్యాతును చూడగనే జడిసి గబగబ అతని ఎదుినుండి ప్రక్కకు తొలగిపోయిరి.

25. వారు తమలోతాము ”ఈ ముందికివచ్చిన వానిని జూచి తిరా? వీడు యిస్రాయేలీయులను సవాలు చేయుటకే వచ్చినాడు. ఇతనిని చంపినవారికి రాజు సిరులు కొల్లలుగా ఇచ్చును. తన కుమార్తెనొసగి పెండ్లిచేసి, అతని తండ్రి ఇంివారిని యిస్రాయేలీయులలో స్వతంత్రులనుగా11 చేయును” అని అనుకొనుచుండిరి.

26. దావీదు తనయొద్ద నిలిచియుండిన వారిని జూచి ”ఈ ఫిలిస్తీయుని చంపి యిస్రాయేలీయుల తలవంపులు తీర్చిన వారికి ఏమి బహుమానము లభించును? సున్నతిసంస్కారములేని ఈ ఫిలిస్తీయుడు సజీవుడైన యావే సైన్యములను తూలనాడువాడా?” అనెను.

27. వారు, వీనిని చంపినవానికి లభించు బహుమానము ఇి్టదని తమలో తామాడుకొనిన మాట లనే ఉదాహరించి చెప్పిరి.

28. కాని దావీదు పెద్దన్న అయిన ఎలీయాబు, తమ్ముడు ప్రక్కవారితో సంభా షించుట చూచి మండిపడెను. అతడు సోదరునితో ”నీవు ఇచ్చటకేల వచ్చితివి? నీ పొగరు నేనెరుగుదును. నీవు వ్టి వదరుబోతువు. పోరు చూచి పొంగిపోవుటకే నీవిటకు వచ్చితివి” అనెను.

29. దావీదు ”నేనేమి చేసితిని? ఇచట మాటలాడుటకుగూడ వీలులేదా?” అని బదులుపలికెను.

30. అంతట అతడు మరి యొకని చెంతకుపోయి మరల అదే ప్రశ్న వేసెను. అచివారును అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.

31. కాని సైనికులు దావీదు మాటలాలించి సౌలునకు విన్నవించిరి. అతడు దావీదును పిలువనంపెను.

సవాలును ఎదుర్కొనుటకు దావీదు సంసిద్ధుడగుట

32. దావీదు సౌలుతో ”ఇతనినిగూర్చి ఎవ్వరును భయపడనక్కరలేదు. అనుమతియైనచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయునితో పోరాడగలడు” అని పలికెను.

33. కాని సౌలు ”ఈ ఫిలిస్తీయుని ఎటుల ఎదిరింప గలవు? నీవా బాలుడవు. అతడు బాల్యమునుండి యుద్ధమున కాకలుతీరినబంటు” అనెను.

34. దావీదు సౌలుతో ”నీ దాసుడు తన తండ్రి గొఱ్ఱెలమందలను కాయుచుండెడివాడు. అప్పుడప్పుడు సింగము గాని, ఎలుగుబింగాని మందమీద పడి గొఱ్ఱెనెత్తుకొని పోయెడిది.

35. నేను వన్యమృగమును తరిమి, చావమోది దాని నోినుండి గొఱ్ఱెను విడిపించు కొని వచ్చెడివాడను. అది నా మీద తిరుగబడెనేని మెడక్రింది జూలుపట్టుకొని చితుకబొడిచి చంపెడి వాడను.

36. నీ దాసుడు సింగములను, ఎలుగులను మట్టుపెట్టెను. సున్నతి సంస్కారములేని ఈ ఫిలిస్తీయు డును వానివలె చచ్చును. సజీవదేవుని సైన్యములను వీడు సవాలు చేయువాడా?

37. ఎలుగు, సింగముల వాడిగోళ్ళనుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండ కాపాడకపోడు” అని పలికెను. సౌలు ”అటులయిన పోయి పోరాడుము. యావే నీకు తోడుగానుండుగాక!” అనెను.

38. సౌలు దావీదునకు తన ఆయుధములను ఒసగెను. తలమీద శిరస్త్రాణము, రొమ్మున కవచము నుంచెను. 39. ఆ కవచముపై తన కత్తినిగూడ వ్రేలాడ గట్టెను. కాని దావీదునకు ఈ ఆయుధములు ధరించు అలవాటు లేకపోవుటచే వానితో నడువలేకపోయెను. అతడు సౌలుతో ”నేను ఇంతవరకు ఆయుధములకు అలవాటుపడియుండలేదు. వీనితో నడువజాలకున్నాను” అని చెప్పి ఆయుధములను తొలగించెను.

దావీదు – గొల్యాతు

40. దావీదు తన కఱ్ఱచేత బట్టుకొనెను. ఏి ఒడ్డునుండి ఐదు నున్ననిరాళ్లు ఏరుకొని సంచిలో వేసికొనెను. ఒడిసెల తీసికొని ఫిలిస్తీయునివైపు పోయెను.

41. ఫిలిస్తీయుడు తన డాలు మోయుచున్న బంటుతో ముందునడుచుచూ మెల్లమెల్లగా అడుగు లిడుచు దావీదును సమీపించెను.

42. అతడు దావీదును చిన్నచూపు చూచెను. దావీదు బాలుడు. బంగారము విం ఒడలితో సుందరమైన ఆకృతి గలవాడు.

43. ఫిలిస్తీయుడు దావీదుతో ”కఱ్ఱనెత్తుకొని నా మీదికి వచ్చుటకు నేను కుక్కననుకొింవాయేమి?” అనెను. తన దేవరల పేరెత్తి దావీదును శపించెను.

44. ”ఇటురమ్ము, నీ కండలు కోసి ఆకాశపకక్షులకు, అడవి మృగములకు ఆహారము గావించెదను” అని పలికెను. 

45. దావీదు ”నీవు కత్తి, యీటె, బాకు గైకొని నా మీదికి వచ్చితివి. కాని నేను సైన్యములకు అధిపతియైన యావే  పేర, నేడు నీవు నిందించిన యిస్రాయేలుసైన్యముల దేవునిపేర, నీ మీదికి వచ్చి తిని.

46. నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును. నేను నిన్ను నిలువునకూల్చి నీ తల తెగవేసెదను. నీ శవమును, ఫిలిస్తీయుల శవములను ఆకాశపకక్షులకు వన్యమృగములకు మేతగా వేసెదను. అప్పుడు గాని యిస్రాయేలీయులలో దేవుడున్నాడని ఎల్లరును తెలిసికోజాలరు.

47. ఇట గుమికూడియున్న ఈ దండులన్నియు, యావే కత్తి, బల్లెముల వలన విజ యము ప్రసాదించువాడుకాడని గుర్తించును. యుద్ధము యావేదే. అతడు తప్పక నిన్ను నా చేతి కప్పగించును” అని బదులు పలికెను.

48. అంతట ఫిలిస్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చుచుండెను. దావీదు సేనలబారులు దాి వడివడిగా ఫిలిస్తీయునకు ఎదురేగెను.

49. అతడు సంచిలో చేయిడి రాయితీసి ఒడిసెలలోప్టిె గిఱ్ఱున త్రిప్పి ఫిలిస్తీయుని నొసిపైన కొట్టెను. ఆ రాయి నొసినిచీల్చి లోనికిచొచ్చుకొనిపోగా ఫిలిస్తీయుడు గభీలున నేలపైబోరగిలపడెను.

50. దావీదు వడిసెలతో ఫిలిస్తీయునకు ఎదురునిలిచి, బలాఢ్యుడై వడిసెల రాతితో ఆ ఫిలిస్తీయుని క్టొిచంపెను. దావీదు చేతిలో కత్తిలేదు.

51. అతడు వెనువెంటనే పరుగెత్తి ఫిలిస్తీ యుని పైకెక్కి ఒరనుండి వాని కత్తిదూసి, దానితో వానిని పొడిచిచంపి తల తెగనరికెను.

52.  ఫిలిస్తీ యులు తమ వీరుడు నేలకూలుటచూచి గుండెలు చెదరి పారిపోయిరి. కాని యిస్రాయేలీయులు, యూదీయులు  కో యని అరచుచు ఫిలిస్తీయులను వెన్నాడి గాతు వరకు, ఎక్రోను నగరద్వారముల వరకు తరుము కొనిపోయిరి. ఫిలిస్తీయులు గాయములు తగిలి షారీమునుండి గాతు, ఎక్రోనులవరకు మార్గము వెంట కుప్పతిప్పలుగా కూలిపోయిరి.

53. ఈ తీరున యిస్రాయేలీయులు ఫిలిస్తీయులను తరిమి, తిరిగివచ్చి వారి శిబిరములపైబడి దొరికినవన్నియు దోచుకొనిరి.

54. దావీదు గొల్యాతు శిరమును యెరూషలేమునకు కొనిపోయెను. అతని ఆయుధములను మాత్రము తన గుడారముననే ఉంచెను.

దావీదు సౌలు సమక్షమునకు కొనిపోబడుట

55. దావీదు ఫిలిస్తీయుని ఎదుర్కొన బోవునపుడు సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును చూచి ”ఈ పడుచు వాడు ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించెను. అతడు ”ప్రభువు తోడు! నాకు తెలియదు” అనెను.

56. సౌలు ”అటులయిన తెలిసికొనిరమ్ము” అనెను.

57. దావీదు ఫిలిస్తీయునిచంపి మరలి వచ్చిన తరువాత అబ్నేరు అతనిని సౌలు కడకు కొనిపోయెను. దావీదు ఫిలిస్తీయుని తల చేతబట్టుకొని సౌలు సమ్ముఖ మునకు వచ్చెను.

58. సౌలు అతనిని జూచి ”ఓయి! నీవెవరి కుమారుడవు?” అని అడిగెను. దావీదు ”బేత్లెహేము నివాసియు, నీ దాసుడునగు యిషాయి కుమారుడను” అని బదులుపలికెను.

Previous                                                                                                                                                                                                   Next