ఉపోద్ఘాతము:

పేరు: ఈ గ్రంథమునందు ప్రధానపాత్రధారిణి యూదితు.  కాబ్టి ఈ గ్రంథమునకు ఆమె పేరునే ఆపాదించిరి.

కాలము: క్రీ.పూ. 630-610 కాలమునాి గాథ.

రచయిత: తెలియదు. కాని మక్కబీయుల తిరుగుబాటు కాలమునాి రచయిత (క్రీ.పూ. 1-2 శతాబ్ధములు) వ్రాసి వుండునని పండితుల అభిప్రాయము.

చారిత్రక నేపథ్యము:  బబులోనురాజు నెబుకద్నెసరు నీనెవె పట్టణము రాజధానిగా పాలనసాగించెను. అతని  సైన్యాధిపతి హోలోఫెర్నెసు యూదుల మీదికి దండెత్తెను.  పరాక్రమంతుడు, అర్థ, అంగబలముతోనున్న అతడిని ఓడించడము యూదులకు కష్టతరమైనది.  ఇి్ట పరిస్థితుల్లో యూదితు రంగప్రవేశముచేసి, ఆ సైన్యాధిపతిని చాకచక్యముగా శిరచ్ఛేదనము చేసినది. తన ప్రజలను రక్షించినది.  భక్తిపరురాలైన యూదితు, భర్త మరణాంతరము  విధవరాలుగానే జీవించినది. తనకు సంతానము లేకపోయినప్పికిని తనప్రజలకు పునర్జన్మనిచ్చినది. తన అందచందాలతో ఎదుివారిని క్టిపడేయగల సౌందర్యవతి. తన ప్రజల రక్షణనిమిత్తము హోలోపెర్నెసును హతమార్చినది. తద్వారా యూదయా చరిత్రలో వీరవనితగా పేరు గడించెను.

ముఖ్యాంశములు: బబులోనురాజు నెబుకద్నెసరు చెడుకు ప్రతీకగానుండగా యావేదేవుని నమ్ముకున్న యూదితు విశ్వాసము,  ఆధ్యాత్మికతకు ప్రతిబింబముగా నిలుచును. ఈ గ్రంథము పురాణగాథగా ఉన్నప్పికి ఆధ్యాత్మిక గ్రంథముగా నిలుచును. కష్టకాలంలోనున్న యూద ప్రజలను ఓదార్చి, ప్రోత్సహించి, ఉత్తేజితులను చేయడానికి ఉపయోగపడెను. శత్రునాశనానికి సంఖ్య, కండ, ధనబలముకంటెను దైవభీతి, దైవానుగ్రహముమిన్న అని ఈ గ్రంథము తెలుపును. యూదితు ఒక స్త్రీ, విధవరాలు, సంతానలేమితో నున్నప్పికిని యూదుల చరిత్రలో సముచితస్థానము పొందినది.

క్రీస్తుకు అన్వయము: యూదితు వ్యక్తిగతజీవితము, పరిస్థితులను బ్టి రూపాంతరము చెందిన ఆమె వ్యక్తిత్వము ఆదర్శప్రాయమైనది. క్రీస్తు రోగుల నిమిత్తమే వచ్చానని చెప్పుకున్నారు. అనగా ఆయనయొక్క ఇహలోక పరిచర్య దుర్బలులకు, నిస్సహాయులకు ప్రత్యేకముగా కొనసాగినది అని దీనిభావము. అటులనే యూదితు కూడ యిస్రాయేలీయులు నెబుకద్నెసరు  సైన్యము ఎదుట దుర్బలులుగా ఉన్నప్పుడు ప్రభువును వేడుకొనగా, ఆయన ఈ వీరవనిత ద్వారా వారికి విజయమును అనుగ్రహించెను. యూదుల చరిత్రలో ఒక స్త్రీకి సముచిత స్థానము లభించడము హర్షణీయము.