సత్పురుషుని స్తోత్రము
112 1. మీరు ప్రభువును స్తుతింపుడు.
ప్రభువుపట్ల భయభక్తులు చూపువాడు,
ఆయన ఆజ్ఞలను ఆనందముతో
పాించువాడు ధన్యుడు.
2. అతని పిల్లలు
దేశమున బలవంతులుగా బ్రతుకుదురు
నీతిమంతుని సంతానము దీవెనలు బడయును.
3. అతని కుటుంబము సిరిసంపదలతో అలరారును.
అతని నీతి కలకాలము వృద్ధిచెందును.
4. దయ, జాలి, నీతికల సజ్జనునికి
చీకిలోకూడ వెలుగు ప్రకాశించును.
5. అతడు వడ్డీ తీసికొనకయే అప్పిచ్చును.
తన కార్యములనెల్ల న్యాయబుద్ధితో నిర్వహించును.
6. నీతిమంతుడు ఏనాడును కదలింపబడడు.
అతని పేరు శాశ్వతముగా ఉండిపోవును.
7. స్థిరవిశ్వాసమును, ప్రభువునందు
నమ్మకము కలవాడు కనుక
అతడు తనను గూర్చిన దుర్వార్తలకు జడియడు.
8. అతని హృదయం స్థిరమైనది.
తన శత్రువుల విషయమున
తన కోరిక నెరవేరువరకు భయపడడు.
9. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును.
సదా అతని నీతి నిలిచియుండును.
వాని కొమ్ము ఘనతనొంది హెచ్చింపబడును.
10. దుష్టులు అతనిని గాంచి కోపింతురు.
పండ్లు పటపటకొరుకుదురు.
అటుపిమ్మట నాశనమై పోవుదురు.
వారి ఆశలును వమ్మైపోవును.