దైవస్తుతి, మనవి

ప్రధానగాయకునికి దావీదు కీర్తన

40 1.      నేను గంపెడాశతో ఓర్పు వహించి

                              ప్రభువుకొరకు కనిపెట్టుకొనియుింని.

                              ఎట్టకేలకు అతడు నా వైపు వంగి

                              నా వేడుకోలును ఆలించెను.

2.           వినాశనకరమైన గోతినుండి,

               బురదగుంటలనుండి

               ఆయన నన్ను బయికి లాగెను.

               నన్ను కొండకొమ్మున నిలిపి, నాకు భద్రత కల్పించెను.

3.           అతడు నాకు క్రొత్తపాటను నేర్పెను.

               అది ప్రభువును స్తుతించుపాట.

               ఈ ఉదంతమునెరిగి

               అనేకులు ప్రభువునకు భయపడుదురు.

               అతనిని విశ్వసింతురు.

4.           ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు.

               దబ్బర దైవములను కొలుచు గర్వాత్ములతో

               చేతులు కలపని జనుడు భాగ్యవంతుడు.

5.           నా దేవుడవైన ప్రభూ!

               నీవు మా కొరకు పెక్కు సత్కార్యములు చేసితివి.

               మా మేలుకొరకు పెక్కుఆలోచనలు తలపోసితివి.

               నీ వింవాడు మరొకడు లేడు.

               నేను నీ ఉపకారములను వివరింపబూనినచో

               అవి నేను వర్ణింపగలిగిన

               దానికంటె ఎక్కువగానుండును.

6.           నీవు బలిని, సమర్పణమును కోరలేదు.

               దహనబలిని పాపపరిహారబలిని అభిలషింపలేదు.

               కాని నీ మాటలు ఆలకించుటకు

               నాకు చెవులొసగితివి.

7.            అప్పుడింని: ”లేఖనములలో నన్ను గురించి

               వ్రాయబడినట్లు ,             

               ఇదిగో నేను వచ్చియున్నాను.

8.           నీ చిత్తమును పాించుటయే

               నాకు పరమానందము.

               నీ ధర్మశాస్త్రము

               నా యెదలో పదిలముగా నిలిచియున్నది.

9.           భక్త సమాజమున

               నేను నీ రక్షణను ప్రకటన చేసితిని.

               ప్రభూ! నీ కార్యమును

               నేను ఏనాడును విస్మరింపనని నీకు తెలియును.

10.         నీ రక్షణను గూర్చిన శుభసమాచారమును

               నేను పదిలముగా దాచియుంచలేదు.

               నీ నమ్మదగినతనమును, నీ సహాయమును

               నేనెల్లవేళల జనులకు

               తెలియజేయుచునేయుింని.

               నీ కరుణను గూర్చియు,

               నీ విశ్వసనీయతను గూర్చియు

               నేను భక్తసమాజమున చెప్పుచునేయుింని.

11.           కనుక ప్రభూ! నీవు ఏనాడు నా మీద ఎనలేని

               దయజూపకుండ ఉండజాలవు.

               నీ స్థిరమైన ప్రేమయు, విశ్వసనీయతయు

               నన్ను సదా కాపాడును.

12.          నాకు లెక్కింపనలవిగాని ఆపదలు వాిల్లినవి.

               నా పాపములు చీకివలె నన్ను క్రమ్ముకొనినవి.

               కనుక నేను కళ్ళువిప్పి చూడజాలకున్నాను.

               నా దోషములు

               నా తలమీది వెంట్రుకలకంటె ఎక్కువగానున్నవి.

               కావున నేను ధైర్యమును కోల్పోయితిని.

13.          ప్రభూ! నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము.

               నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము.

14.          నా ప్రాణములు తీయజూచు వారెల్లరు

               అవమానమున మునిగి

               అపజయము పొందుదురుగాక!

               నా కీడును జూచి ఆనందించువారెల్లరు

               సిగ్గుపడి వెనుదిరుగుదురుగాక!

15.          నన్నుచూచి ‘అహ్హహ్హ’ అని ఎగతాళి చేయువారు

               తలంవంపులు తెచ్చుకొని భీతిల్లుదురుగాక!

16.          కాని నీ చెంతకు వచ్చు వారందరును

               పరమానందము చెందుదురుగాక!

               నీ రక్షణమును అభిలషించువారు

               అందరును ‘ప్రభువు మహాఘనుడు’

               అని యెల్లవేళల వాకొందురుగాక!

17.          ప్రభూ! నేను దరిద్రుడను, దీనుడను

               నీవు నన్ను జ్ఞప్తియందుంచుకొనుము.

               నాకు సహాయుడవును, రక్షకుడవును నీవే.

               కనుక ప్రభూ! జాగుచేయక

               నన్ను ఆదుకొనుము”.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము