యెరూషలేము పాపములు

5 1. యెరూషలేము వీధులలో అటునిటు పరుగిడుడు.

               మీమటుకు మీరే పరికించి చూడుడు.

               అచి విశాలమార్గములను పరిశీలింపుడు. అచట ధర్మమును ఆచరించువాడు,

               సత్యనిష్ఠకలవాడు ఒక్కడైన మీ కంటబడినచో,

               నేను ఆ నగరమును మన్నింతును.

               ఇది ప్రభువు వాక్కు.

2.           మీరు ‘ప్రభువు జీవముతోడు’ అని బాసచేసినను,

               మీవన్నియు అబద్ధ ప్రమాణములే.

3.           ప్రభువు నిక్కముగా సత్యమును అపేక్షించును.

               ఆయన మిమ్ము మోదినను,

               మీరు లెక్కచేయలేదు. మిమ్ము చితుకగ్టొినను,

               మీరు పాఠము నేర్చుకోలేదు.

               మీరు మీ ముఖమును రాయిచేసికొని

               పశ్చాత్తాపపడరైతిరి.

4.           నేను ఇట్లు తలంచితిని.

               ”వీరు నిరుపేదలును, మూర్ఖులునైన ప్రజలు.

               ప్రభువు ఏమి కోరుకొనునో,

               ఏమి అపేక్షించునో వారికి తెలియదు.

5.           కావున నేను ప్రజానాయకులవద్దకుపోయి

               వారితో సంభాషింతును.

               ప్రభువేమి కోరుకొనునో,

               ఏమి అపేక్షించునో వారికి తెలియును.”

               కాని వారుకూడ

               ప్రభువు అధికారమును ధిక్కరించి,

               ఆయనకు అవిధేయులైరి.

6.           ఆ ప్రజల పాపములు లెక్కకుమించినవి.

               వారు మాి మాికి ఆయన నుండి వైదొలగిరి.

               కావున అడవినుండి వచ్చిన సింగములు

               వారిని హతమార్చును.

               ఎడారినుండి వచ్చిన తోడేళ్ళు వారిని

               నాశనము చేయును. చిరుతపులులు

               వారి నగరముచుట్టు పొంచియుండి,

               బయటకు వచ్చినవారిని చీల్చివేయును.

7.            ప్రభువు ఇట్లడుగుచున్నాడు:

               ”నేను నా ప్రజల పాపములను

               ఏల మన్నింపవలెను? వారు నన్ను విడనాడి,

               దైవముకాని వాితోడని ప్రమాణము చేయుదురు

8.           నేను వారికి తృప్తిగా భోజనముపెట్టగా

               వారు వ్యభిచారులైరి,

               వేశ్యాగృహములకు ఎగబడిరి.

9.           వారు బలిసిన మావిగుఱ్ఱములవలె

               కామపూరితులైరి.

               ప్రతివాడును, తన పొరుగువాని భార్యకొరకు

               సకిలించుచున్నాడు.

               ఇి్ట కార్యములకుగాను

               నేను వారిని దండింపవలదా?

               ఇి్ట జాతిమీద నేను పగతీర్చుకోవలదా?

10.         నేను శత్రువులను పంపి

               వారి ద్రాక్షతోటలను నరికింతును

               కాని వారు వానిని పూర్తిగా నాశనము చేయరు.

               నాకు చెందని కొమ్మలను నరికివేయుడని

               నేను వారితో చెప్పుదును.

11. యిస్రాయేలు జనులును, యూదా ప్రజలును

               నాకు పరమ ద్రోహముచేసిరి.

               ఇది ప్రభువు వాక్కు.

ప్రభువు యిస్రాయేలును పరిత్యజించుట

12. ప్రభువు ప్రజలు ఆయనను నిరాకరించిరి.

               ‘ఆయనేమియు చేయడులే’ అని పలికిరి.

               మనకు కష్టములు రావు.

               యుద్ధము, క్షామము సంభవింపవు అని ఎంచిరి.

13. ప్రవక్తలు వ్టి గాలిమాటలు పలుకువారనియు

               వారికి ప్రభువుసందేశము తెలియదు

               అనియు వాకొనిరి.

14.          అందుచే సైన్యములకు అధిపతియైన

               ప్రభువు నాతో ఇట్లు నుడివెను:

               ”ఈ ప్రజలు ఇట్లు పలికిరి.

               కనుక నేను నా పలుకులను

               నీ నోట అగ్గివలెనుంతును.

               ఈ ప్రజలు కట్టెపుల్లలవిం వారగుదురు.

               ఆ అగ్ని వీరిని బుగ్గిచేయును.

15.          యిస్రాయేలీయులారా!

               ప్రభువు దూరప్రాంతమునుండి

               మీ మీదికి ఒకజాతిని గొనివచ్చును.

               అది అజేయమును, పురాతనమునైన జాతి,

               దాని భాష మీకు తెలియదు.

16.          వారు శూరులైన విలుకాండ్రు,

               నిర్దయతో శత్రువులను చంపువారు.

17.          వారు మీపంటను,

               మీ ఆహారమును తినివేయుదురు.

               మీ కుమారులను, కుమార్తెలను చంపుదురు

               మీ గొఱ్ఱెలమందలను, గొడ్లమందలను వధింతురు

               మీ ద్రాక్షతోటలను, అత్తితోటలను నరికివేయుదురు

               మీరింతగా నమ్ముకొనిన

               మీ సురక్షితపట్టణములను కూల్చివేయుదురు.”

18. ప్రభువు ఇట్లనుచున్నాడు: ”ఆ దినములలో కూడ నేను నా ప్రజలను శేషము లేకుండా నాశనము చేయను. 19. వారు ‘ప్రభువు ఈ కార్యములెల్ల ఎందుకు చేసెను’ అని ప్రశ్నించినపుడు నీవు వారితో ఇట్లు చెప్పుము. ‘మీరు ప్రభువును విడనాడి, మీ దేశముననే అన్యదైవములను కొలిచితిరికదా! కనుక మీరిపుడు పరదేశమున అన్యులను కొలువవలెను.’ ”

ప్రభువు ప్రజలను హెచ్చరించుట

20.        ప్రభువు ఇట్లు అనెను:

               యాకోబు వంశజులకు ఇట్లు ప్రకింపుడు.

               యూదా ప్రజలకిట్లు చాింపుడు.

21.          ”మూర్ఖులును, మందబుద్ధులునైౖన

               ప్రజలారా వినుడు!

               మీరు కన్నులున్నను చూడలేరు, చెవులున్నను వినలేరు.

22.        మీరు నన్ను గాంచి భయపడరేల?

               నా ఎదుట గడగడవణకరేల?

               నేను ఇసుకను కడలికి చెలియలి కట్టగానిలిపితిని

               సాగరము ఆ శాశ్వతావధిని దాటలేదు.

               తరంగములెంత పొర్లినను ఆ ఎల్లను దాటలేవు

               అలలు ఘోషించునుగాని,

               ఆ మేరను అతిక్రమింపలేవు.

23.        కాని జనులారా! మీరు మొండివారు,

               తిరుగబడువారు, మీరు నా నుండి వైదొలగి

               నన్ను విడనాడితిరి.

24.         ‘నేను మీకు తొలకరివానలను, కడపివానలను

               సకాలమున కురియించుచుందును.

               ప్రతియేడు మీకు పంటకాలమును

               దయచేయుచుందును.

               అయినను మీకు నాపట్ల భయభక్తులు

               చూపవలెను అను కోరికలేదు.

25.        మీ పాపములవలన అవి క్రమము తప్పెను.

               మీ దోషములవలన

               ఈ ప్రశస్తభాగ్యములు అంతరించెను.

26.        నా జనుల నడుమ దుర్మార్గులున్నారు.

               వారు పకక్షులుపట్టు వారివలె పొంచియుండి

               ఉచ్చులు పన్నుదురు.

               కాని నరులనే పట్టుకొందురు.

27.         పంజరము పకక్షులతోవలె

               వారి ఇండ్లు కొల్లసొమ్ముతో నిండిఉన్నవి.

               కావున వారు ధనవంతులు, బలవంతులైరి.

28.        బాగుగా తినిబలిసిరి.

               వారి దుష్యార్యములకు అంతము లేదు.

               వారు అనాథశిశువుల హక్కులను మన్నింపరు,

               పీడితులకు న్యాయము జరుగనీయరు.

29.        ఇి్ట వారిని నేను శిక్షింపవలదా?

               ఇి్ట జాతిమీద నేను పగతీర్చుకోవలదా?

               ఇది ప్రభువువాక్కు.”

30.        దేశమున ఘోరమును

               భీకరమునైన కార్యము జరిగినది.

31.          ప్రవక్తలు అసత్య ప్రవచనములు చెప్పుచున్నారు. యాజకులు ప్రవక్తలు చెప్పినట్లుగా ఏలుచున్నారు.

               నా ప్రజలు దీనికి ఇష్టపడుచున్నారు.

               కాని అంతము వచ్చినపుడు

               మీరేమి చేయుదురు?