యిర్మీయాను బావిలో పడద్రోయుట

38 1. మత్తాను కుమారుడైన షెప్యా, పషూరు కుమారుడైన గెదెల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలు, మల్కీయా కుమారుడైన పషూరు నేను ప్రజలకు చెప్పిన ఈ క్రింది పలుకులను వినిరి.

2. ”ప్రభువు పలుకులివి. ఈ నగరమున నిలిచియుండు వారు, పోరు, కరువు, అంటురోగములవలన చత్తురు. నగరమును వీడి బబులోనీయుల పక్షమున చేరువారు బ్రతుకుదురు. వారు కనీసము తమ ప్రాణములనైన నిలబెట్టుకొందురు.

3. నేను ఈ నగరమును బబులోనియా దండు వశము చేయుదును. వారు దీనిని పట్టుకొందురు.”

4. ఆ అధికారులు ఈ మాటలు విని రాజు చెంతకు బోయి అతనితో, ”మీరితనికి మరణశిక్ష విధింపవలెను. ఇతడు ఇి్ట మాటలద్వారా నగరమున మిగిలియున్న సైనికులను, ప్రజలను నిరుత్సాహపరచు చున్నాడు. ఇతడు ప్రజల క్షేమమునుగాక, నాశనమును కోరుచున్నాడు” అని చెప్పిరి.

5. సిద్కియా ”అతడు మీ అధీనముననున్నాడు. నేను మీకు అడ్డుపడజాలనుకదా!” అనెను.

6. అంతట వారు నన్ను కొనిపోయి త్రాళ్ళతో రాజవంశీయుడగు మల్కీయా బావి లోనికి దింపిరి. అది రాజప్రాసాదపు ఆవరణముననున్నది. దానిలో నీరు ఒి్టపోయి పూడిక మాత్రమే ఉన్నది. నేను దాని బురదలో దిగబడితిని.

7. రాజప్రాసాదమున పనిచేయు ఎబెద్మెలెకు నన్ను బావిలో పడవేసిరని వినెను. అతడు కూషీయుడు, నపుంసకుడు. ఆ సమయమున రాజు బెన్యామీను ద్వారమువద్ద కొలువుదీర్చి ఉండెను.

8-9. కావున ఎబెద్మెలెకు రాజువద్దకు పోయి అతనితో ”ప్రభూ! ఈ జనులు చెడ్డపనిచేసిరి. వీరు యిర్మీయాను బావిలో పడద్రోసిరి. నగరమున రొట్టెలు ఏమియును లేవు కనుక అతడు బావిలో ఆకితోచచ్చును” అని చెప్పెను. 10. రాజతనితో ”నీవిచినుండి ముగ్గురు మనుష్యు లను తీసికొనిపోయి యిర్మీయా చనిపోకముందే అతనిని బావినుండి వెలుపలికి లాగుము” అని చెప్పెను.

11. అతడు ఆ మనుష్యులతో ప్రాసాదపు వస్త్రశాలకు వెళ్ళి ప్రాతబట్టలను కొన్నిని తీసికొనివచ్చి, వానిని త్రాళ్ళతో నా చెంతకు దింపెను.

12. ”త్రాళ్ళు నీ చర్మమును కోయకుండునట్లుగా ఈ ప్రాతబట్టలను త్రాళ్ళమీద నీ చంకలలో పెట్టుకొమ్ము” అని చెప్పెను. నేనట్లే చేసితిని.

13. అంతట వారు నన్ను త్రాళ్ళతో బావిలో నుండి బయికిలాగిరి. అటుతరువాత నన్ను ప్రాసా దావరణములోని చెరలో ఉంచిరి.

సిద్కియా యిర్మీయాను సంప్రతించుట

14. తదనంతరము సిద్కియా రాజు నన్ను దేవా లయపు మూడవ ప్రవేశద్వారము వద్దకు పిలిపించి ”దైవసందేశమేమైనకలదా? అని నేను నిన్ను ప్రశ్నించు చున్నాను. నీవు నా ఎదుట ఏమియు దాచవలదు” అనెను. 15. నేనతనితో ”నేను నిజము చెప్పినచో నీవు నన్ను చంపింతువు. ఉపదేశము చేసినచో నీవు ప్టించుకొనవు” అని అంిని.

16. అపుడు సిద్కియా రహస్యముగా నాతో ఇట్లనెను: ”మనకెల్లరికి ప్రాణ ములనిచ్చు సజీవుడైన దేవుని పేరుమీదుగా నేను బాస చేయుచున్నాను. నేను నిన్ను చంపింపను. నిన్ను చంపగోరు వారికి అప్పగింపను.”

17. అంతట నేను సిద్కియాకిట్లు చెప్పితిని. ”యిస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియైన ప్రభువిట్లు పలుకుచున్నాడు. నీవు బబులోనియా రాజు అధికారులకు చెంతకుపోయెదవేని నీ ప్రాణములు నిలుచును. శత్రువులు ఈ నగరమును కాల్చివేయరు. నీవును, నీ కుటుంబమును బ్రతికి బయటపడ వచ్చును.

18. కాని నీవు వారియొద్దకు వెళ్ళనిచో నేను ఈ నగరమును బబులోనీయులకు అప్ప గింతును. వారు దానిని తగులబెట్టుదురు. నీవు వారి నుండి తప్పించుకోజాలవు.”  

19. అందుకు రాజు నాతో, నేను బబులోనీయుల పక్షమున చేరిపోయిన యూదులకు భయపడుచున్నాను. బబులోనీయులు నన్ను వారి చేతికప్పగింపగా, వారు నన్ను హేళన చేయుదురు అనెను.

20. కాని నేను ఆతనితో ఇట్లింని. నిన్ను యూదులచేతికి అప్ప గింపరు. నేను చెప్పిన దైవసందేశము పాింతు వేని నీవు బాగుపడుదువు. నీ ప్రాణములు నిలబెట్టు కొందువు.

21. నీవు బబులోనీయులకు లొంగవేని, నీకేమి జరుగునో ప్రభువు నాకొక దర్శనమున చూపించెను.

22. ఆ దర్శనమున నేను యూదా రాజ భవనమున మిగిలియున్న స్త్రీలందరును బబులోనియా రాజు అధికారుల యొద్దకు కొనిపోబడుటను చూచితిని. వారు వెడలి పోవుచు ఇట్లు పలుకుచుండిరి.

               ‘నీ ప్రియస్నేహితులే నిన్ను తప్పుత్రోవ ప్టించిరి.

               వారు నీపై పెత్తనము చెలాయించిరి.             

               ఇపుడు నీ పాదములు బురదలో కూరుకొనిపోగా

               వారు నిన్ను విడిచి వెళ్ళిపోయిరి.’      

23.        నేనింకను అతనితో ఇట్లు చెప్పితిని.

               నీ భార్యలను, పిల్లలను బబులోనీయుల       యొద్దకు గొనిపోయెదరు.

               నీవు శత్రువులనుండి తప్పించుకోజాలవు.

               బబులోనియా రాజు నిన్ను బందీని చేయును.

               వారు ఈ నగరమును తగులబెట్టుటకు

               కారణము నీవే అగుదువు.”

24.          సిద్కియా నాతో ఇట్లనెను: ”నీ ప్రాణములు సురక్షితముగా ఉండునట్లు, నీవు ఈ సంగతి ఎవరికిని తెలియనీయకుము.

25. నేను నీతో సంభాషించితినని, అధికారులకు తెలిసినచో, వారు నీ చెంతకువచ్చి మీరేమి మాటలాడుకొింరని నిన్నడుగుదురు. ‘నీవు రహస్యము లేమియు దాచనిచో మేము నీ ప్రాణములు తీయము’ అని చెప్పుదురు.

26. అప్పుడు ‘నీవు నన్ను యోనాతాను ఇంిలోని చెరలోనికి పంపవలదనియు, పంపినచో నేనచట చచ్చుట తథ్యమనియు రాజుతో మనవి చేసి కొింని’ అని చెప్పుము.”

27. తరువాత అధికారులు నా యొద్దకు వచ్చి నన్ను ప్రశ్నించిరి. రాజు చెప్పుమనిన మాటలనే నేను వారితో చెప్పితిని.  మా సంభాషణను ఎవరును వినలేదు. కనుక  వారు  నన్ను విడచిప్టిెరి.

28. యెరూషలేము పట్టుబడు వరకును నేను ప్రాసాద ఆవరణములోని చెరలోనే ఉంిని.