సంతోషదాయకములైన ప్రవచనములు

నిక్కమైన ప్రవక్త యిర్మీయా బంధితుడగుట

యిర్మీయా దేవాలయమునకు ప్రతికూలముగా మ్లాడి బంధితుడగుట

26 1. యెషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకురాజై సింహాసనము ఎక్కిన ఆరంభములో ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను: 2. ”నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరములనుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజ లకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపుము. వాిలో ఒక్కమాటకూడ వదలి పెట్టవలదు.

3. ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్టమార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకుగాను వారిని వినాశనమునకు గురిచేయను.

4. ‘నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాించి నాకు విధేయులు కావలెనని చెప్పితిని.

5. నేను వేగిరపడుచు మీ యొద్దకు పంపుచు వచ్చిన నా సేవకులగు ప్రవక్తల పలుకులు ఆలింప వలెనని కోరితిని. కాని మీరు వారి మాటలు వినలేదు.

6. మీరు నా మాట పాింపరేని ఈ దేవాలయమునకు షిలో దేవళమునకు ప్టినగతినే ప్టింతును. ప్రపంచములోని జాతులెల్ల ఈ నగరనామమును శాపవచనముగా వాడుకొందురు.”

7. యాజకులును, ప్రవక్తలును, ప్రజలెల్లరును నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుటనువినిరి.

8. నేను ప్రభువు చెప్పుమనిన సంగతులను చెప్పిన వెంటనే వారెల్లరును నన్ను పట్టుకొని, ”నీకు మరణశిక్ష తప్పదు.

9. ‘ఈ దేవాలయమునకు షిలో దేవళము నకు ప్టిన గతియేపట్టుననియు, ఈ నగరము పాడు వడగా దీనిలో ఎవరును వసింపరనియు ప్రభువు పేరుమీదుగా నీవేల ప్రవచించితివి?’ అని అరచిరి. అంతట జనులు దేవాలయమున నాచుట్టును గుమి గూడిరి.

10. యూదానాయకులు ఈ సంగతిని విని రాజప్రాసాదమునుండి వెనువెంటనే దేవాలయము నకు వచ్చి నూత్నద్వారమునొద్ద కొలువుదీరిరి.

11. అపుడు యాజకులును, ప్రవక్తలును నాయకులతోను, ప్రజలతోను ”ఇతడు నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను. కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరును ఇతని మాటలు వింరి కదా!” అని అనిరి.

12. కాని నేను వారికిట్లు జవాబు చెప్పితిని: ”నేను ఈ దేవాలయమునకును, నగరమునకును వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను.

13. కనుక మీరు మీ మార్గములను, క్రియలను మార్చుకొని ప్రభువునకు విధేయులుకండు. అట్లయిన ఆయన తన మనసు మార్చుకొనును. తాను నిశ్చయించుకొని నట్లుగా మిమ్ము నాశనము చేయడు.

14. నా మటుకు నేను మీ అధీనముననున్నాను. మీకు ఉచితముగాను, న్యాయముగాను తోచిన దానిని మీరు చేయువచ్చును.

15. కాని ఈ సంగతి గుర్తింపుడు. మీరు నన్ను చంపు దురేని మీరును, ఈ నగరవాసులును ఒక నిర్దోషిని చంపినట్లు అగును. ఈ సంగతులెల్ల మీకు తెలియ జేయుటకు ప్రభువే నన్ను పంపెను.”

16. అంతట నాయకులును, ప్రజలును యాజకులతోను, ప్రవక్తలతోను ”ఇతడు మన దేవుడైన ప్రభువు పేరుమీదుగా మ్లాడెను. కనుక ఇతనికి మరణ శిక్షవిధించుట తగదు” అనిరి.

17. అటుపిమ్మట కొందరు పెద్దలులేచి, అచట గుమి కూడిన ప్రజలతో ఇట్లనిరి. 

18. ”హిజ్కియా యూదాను పరిపాలించు కాలమున మోరెషెత్‌ నగర వాసి మీకా, ప్రభువు పేరుమీదుగా ప్రజలకిట్లు చెప్పెను:

‘సియోనును పొలమువలె దున్నుదురు.

యెరూషలేము పాడువడి గుట్టలగును.

దేవాలయపు కొండ అడవియగును.’

19. హిజ్కియా రాజును, యూదా వాసులును అతనిని వధింపలేదు. పైపెచ్చు హిజ్కియా ప్రభువునకు భయపడి ఆయన మన్నన సంపాదించుకొనెను. కనుక ప్రభువు మనసు మార్చుకొని తాను సంకల్పించుకొని నట్లుగా వారిని  నాశనము చేయడయ్యెను. ఇప్పుడు మనము ఈ కార్యము చేసినచో ఘోరవిపత్తును కొనితెచ్చుకోబోవుచున్నాము.”

20. కిర్యత్యారీము నగరవాసియు, షెమయా కుమారుడునైన ఊరియా అనునతడు కూడ యిర్మీయా వలె ఈ నగరమునకును, ఈ ప్రజలకును ప్రతికూల ముగా ప్రవచనములు చెప్పెను.

21. యెహోయాకీము రాజును, అతని అంగరక్షకులును, ఉద్యోగులును అతని పలుకులు వినిరి. రాజు అతనిని చంపజూచుచుండగా ఈ సంగతిని గ్రహించి ఊరియా భయపడి ఐగుప్తునకు పారిపోయెను.

22. కాని రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడైన ఎల్నాతానును, మరికొందరిని ఐగుప్తునకు పంపెను. 23. వారు ఐగుప్తునుండి ఊరియాను తీసికొనివచ్చి, రాజు సమక్షమునకు గొని వచ్చిరి. రాజు అతనిని చంపించి, అతని శవమును సామాన్యులను పాతిపెట్టు శ్మశానమున  పడ వేయించెను.   

24. కాని షాఫాను కుమారుడైన అహీకాను యిర్మీయా కోపు తీసికొనెను. కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి.