దేవుని నమ్ముట

ప్రధానగాయకునికి                               

ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినపుడు, యోనత్‌యెలెమ్‌ రహోక్యీమ్‌ అను రాగము మీద పాడదగిన మరియు దావీదు రచించిన గీతము

56 1.      దేవా! నా మీద దయజూపుము.

                              శత్రువులు నా మీదికి వచ్చుచున్నారు.

                              నిరంతరము నన్ను అణచివేయుచున్నారు.

2.           దినమెల్లను విరోధులు

               నా మీదికి దాడి చేయుచున్నారు.

               నా మీద పోరాడువారు అనేకులున్నారు.

3.           నాకు భయము కలిగినపుడెల్ల

               నేను నిన్నాశ్రయింతును.

4.           నేను దేవుని విశ్వసించి

               ఆయన వాగ్ధానములు నుతింతును.

               ఆయనను నమ్మి భయమును విడనాడెదను.

               మానవమాత్రులు నన్నేమి చేయగలరు?

5.           నేను దినమెల్ల ఏ పనికి పూనుకొనినను

               నా విరోధులు నన్ను వేధించుచున్నారు.

               వారి ఆలోచనలన్నియు

               నాకు కీడు చేయవలయుననియే.

6.           వారెల్లరును ఏకమై రహస్యముగా దాగియుండి

               నేను చేయుపనులెల్ల పొంచి చూచుచున్నారు.

               నా ప్రాణములు తీయవలయుననియే వారి కోరిక.

7.            ఇి్ట దోషమునకుగాను

               వారు శిక్షను అనుభవింపవలదా?

               దేవా! నీ కోపముతో

               ఆ ప్రజలను నాశనము చేయుము.

8.           నీవు నా వేదనలను గుర్తించితివి.

               నా అశ్రుబిందువులను

               నీ సీసాలో పోసియుంచితివి?

               వానిని నీ గ్రంథమున లిఖించలేదా?

9.           నేను నీకు మొరపెట్టగానే నా శత్రువులు

               వెనుదిరిగి పారిపోవుదురు.

               దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును.

10.         నేను దేవుని విశ్వసించి

               అతని వాగ్ధానమును వినుతింతును.

               ప్రభువు వాగ్ధానమును కీర్తింతును.

11.           ఆయనను నమ్మి భయమును విడనాడెదను.

               మానవమాత్రులు నన్నేమి చేయగలరు?

12.          దేవా! నేను నా మ్రొక్కులను చెల్లించుకొందును.

               నీకు కృతజ్ఞతార్పణమును అర్పింతును.

13.          నీవు నన్ను మృత్యువునుండి కాపాడితివి.

               నా అడుగులు తడబడి పడిపోకుండ రక్షించితివి.

               కనుక దేవునిసన్నిధిలో నడచెదను.

               సజీవులమీద ప్రకాశించు

               వెలుగులో నడయాడెదను.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము