28 1.      ఎవరు తరుమక పోయినను

                              దుష్టుడు పరుగెత్తును.

                              కాని సత్పురుషుడు సింహమువలె

                              ధైర్యముగా ఉండును.

2.           దేశమున తిరుగుబాటువలన

               రాజు తరువాత రాజు రాజ్యమేలుదురు.

               తెలివిగల నాయకుడు దొరకినపుడు

               రాజ్యము స్థిరపడును.  

3.           పేదలను పీడించు పేదవాడు

               ఉధృతముగా కురిసి

               పంటలను నాశనముచేయు వానవింవాడు.

4.           ధర్మవిధులను పాింపనివాడు

               దుష్టుల కోపు తీసికొనును.

               పాించువాడు వారిని నిరాకరించును.

5.           దుష్టులకు న్యాయమనగానేమో తెలియదు.

               ప్రభువుపట్ల భయభక్తులు కలవారికి

               న్యాయము బాగుగా తెలియును.

6.           ధనికుడుగానుండి అధర్మపరుడు అగుటకంటె

               పేదవాడుగానుండి ధర్మాత్ముడగుట మెరుగు.

7. వివేకియైన కుమారుడు

               ధర్మశాస్త్రమును పాించును.

               భోజన ప్రియులతో చెలిమిచేయు పుత్రుడు

               తండ్రికి అపకీర్తి తెచ్చును.

8.           వడ్డీలతో సొమ్ము చేసుకొనువాని

               సొత్తు అన్యుని పాలుకాగా

               అతడు దానిని పేదలకు వెచ్చించును.

 9.          ధర్మశాస్త్రమును విననొల్లనివాడు

               ప్రార్థననుకూడ అసహ్యించుకొనును.

10. మంచివారిని మభ్యప్టిె వారిచే

               దుష్కార్యము చేయించువాడు

               తాను త్రవ్విన గోతిలో తానే పడును.

               సత్పురుషులు సంపదలను బడయుదురు.

11.           ధనవంతుడు తాను

               తెలివికలవాడను అనుకొనును.

               కాని వివేకముగల పేదవాడు

               వాని గుట్టు బయటపెట్టును.

12.          ధర్మాత్ములు అధికారములోనికి వచ్చినపుడు

               ప్రజలు సంతసింతురు.

               కాని దుష్టులు పాలించునపుడు

               ప్రజలు భయముతో దాగుకొందురు.

13.          తన పాపములను కప్పిపెట్టుకొనువాడు బాగుపడడు

               ఆ పాపములను ఒప్పుకొని

               వానిని పరిత్యజించువాడు

               దేవుని దయ పొందును.

14.          దేవునిపట్ల భయభక్తులు కలవాడు

               సుఖము బడయును.

               గుండె రాయిచేసికొనువాడు నాశనమగును.

15.          గర్జించు సింహమును,

               ఎరకొరకు తిరుగులాడు ఎలుగును ఎి్టవో

               పేదలమీద అధికారమునెరపు దుష్టపాలకుడ్టివాడు 

16.          అవివేకియైన పాలకుడు

               ప్రజలను పీడించి పిప్పిచేయును.

               అధర్మమును ఏవగించుకొనువాడు

               చిరకాలము పాలించును.

17. నరుని హత్య చేసినవాడు

               తన సమాధిని తానే త్రవ్వుకొనును.

               అతడికెవరును అడ్డము పోనక్కరలేదు.

18. ధర్మబద్ధముగా జీవించువాడు

               సురక్షితముగామనును.

               అధర్మపరుడు పతనమైపోవును.

19.          కష్టపడి సేద్యము చేయువానికి

               కడుపునిండ కూడు దొరకును.

               సోమరితనముతో కాలము వెళ్ళబుచ్చువాడు

               పేదరికమున మ్రగ్గును.

20.        చిత్తశుద్ధిగల నరుడు దీవెనలు బడయును.

               త్వరత్వరగా డబ్బు కూడబెట్టుకోగోరువారు

               శిక్షననుభవింతురు.

 21.         పక్షపాతము చూపుట ధర్మముకాదు.

               కొందరు రొట్టెముక్క కొరకే

               అన్యాయము చేయుదురు.

22.        ఆశపోతు త్వరత్వరగా డబ్బు కూడబెట్టుకోగోరును.

               కాని లేమి తన వెంటబడుచున్నదని

               అతనికి తెలియదు.

23.        ఇతరుని మందలించువాడు

               తుదకు అతనిని పొగడినవానికంటె

               ఎక్కువ మన్ననబడయును.

24.         తల్లిదండ్రుల సొత్తును అపహరించుటలో

               తప్పులేదనుకొను సుతుడు

               దోచుకొనువానితో సమానము.

25.        ఆశపోతులు కలహములు తెచ్చుదురు.

               ప్రభువును నమ్మువాడు

               అభ్యుదయములు బడయును.

26.        తన అభిప్రాయముల ప్రకారము పోవువాడు

               మందమతి.

               జ్ఞానుల బోధనలను  చేకొనువాడు 

               సురక్షితముగా మనును.

27.         పేదలకు ఇచ్చువాడు లేమికి గురికాడు.

               దరిద్రులను కన్నెత్తిచూడని వానిని

               ఎల్లరును శపింతురు.

28. దుర్మార్గులు పాలించునపుడు

               ప్రజలు  భయముతో దాగుకొందురు.

               ఆ దుష్టులు పడిపోగానే

               ధర్మాత్ముల సంఖ్య పెరిగి మరల రాజ్యమేలుదురు.