పశ్చిమ జాతులమీదికి దాడి
2 1. నెబుకద్నెసరు తన పరిపాలనాకాలము పదు నెనిమిదవ యేట మొదినెల ఇరువది రెండవదిన మున, యుద్ధములో తనకు తోడ్పడనివారందరి మీదను, తాను పూర్వము నిశ్చయించుకొనినట్లే పగ తీర్చుకొనుటకు పూనుకొనెను.
2. అతడు తన సైన్యాధి పతులను, అధికారులను పిలిపించి రహస్యాలోచన జరిపెను. తన ఆజ్ఞను త్రోసిపుచ్చినవారందరిని శిక్షింప వలెనని చెప్పెను.
3. అతడును, అతని ఉద్యోగులును యుద్ధమున తోడ్పడనివారినందరిని మట్టుపెట్టవలెనని నిశ్చయించుకొనిరి. రాజు యుద్ధమునెట్లు నడపవలెనో సూచించెను.
4. మంత్రాలోచన ముగిసిన పిదప నెబుకద్నెసరు హోలోఫెర్నెసును పిలిపించెను. అతడు రాజు సర్వసైన్యాధిపతి. దేశమునకు రాజు తరువాత రెండవఅధికారి.
5. నెబుకద్నెసరు అతనితో ఇట్లు చెప్పెను: ”సర్వ భూలోకాధిపతియైన చక్రవర్తి నీతో ఇట్లనుచున్నాడు. నీవు పోరున కాకలుతీరిన యోధులను ఎన్నుకొనుము. లక్ష ఇరువదివేల కాల్బలమును, పండ్రెండువేల ఆశ్విక దళమును సమకూర్చుకొనుము.
6. ఈ బలముతో పోయినా పిలుపును పెడచెవిని ప్టిెన పశ్చిమ దేశము లమీద పడుము.
7. వారు నాకు లొంగిపోయిరి అనుటకు చిహ్నముగా నా దండయాత్రకు సకలసదుపాయములను సిద్ధము చేయవలెనని చెప్పుము. వారు నా కోపమును తప్పక చవిచూతురని, నా సైన్యములు వారి భూమినెల్ల ఆక్రమించి, వారిని దోచుకొనెదరనియు తెలియ చేయుము.
8. ఆ దేశములందలిలోయలు వారి క్షత గాత్రులతో నిండిపోవును. అచి నదులకును, వాగుల కును వారి పీనుగులు అడ్డుపడగా అవి అంచులవర పొంగిపారును.
9. యుద్ధమున చావక మిగిలిన వారిని నేను ప్రపంచపు అంచుల వరకును బందీ లనుగా కొనిపోవుదును.
10. ఓయి! నీవు వెంటనే పోయి నా పేరు మీదుగా ఈ దేశములనెల్ల జయింపుము. ఆ ప్రజలలో నీకు లొంగినవారిని ప్రాణములతో వదలి వేయుము. తరువాత నేను వారిని శిక్షింతును.
11. కాని నిన్నెదిరించువారిని మాత్రము నిర్దయతో మట్టు పెట్టుము. నీ అధికారమునకు అప్పగింపబడిన దేశము లనెల్ల కొల్లగొట్టుము.
12. నా ప్రాణముమీదను, నా రాజ్యముమీదను శపథముచేసి చెప్పుచున్నాను వినుము. నేను చెప్పినదంత జరిగించి తీరుదును.
13. నీ మట్టుకు నీవు నీ ప్రభుడనైన నా ఆజ్ఞలలో ఒక్క పొల్లయినను మీరరాదు. ఇక జాగుచేయక నేనాజ్ఞాపించినట్లే సమస్త మును నిర్వహింపుము.”
14. హోలోఫెర్నెసు రాజు సమ్ముఖమునుండి వెడలిపోయి తన సైన్యాధిపతులను, అధికారులను పిలువనంపెను. 15. రాజు ఆజ్ఞాపించినట్లే లక్ష యిరు వదివేల కాలిబంటులను, పండ్రెండువేల విలుకాండ్రను ప్రోగుచేసి కొనెను. వారెల్లరు పోరున ఆరితేరినవారు.
16. అతడు వారినెల్లరిని బారులుతీర్చెను.
17. మరియు అతడు బరువులు మోయుటకు చాల ఒంటెలను, గాడి దలను, కంచర గాడిదలను ప్రోగుచేసికొనెను. భోజన మునకుగాను చాల మేకలను, పొట్టేళ్ళను, ఎడ్లను చేకూర్చుకొనెను.
18. ప్రతి సైనికునికివలసినంత దారిబత్తెము నిచ్చిరి. రాజు కోశాగారమునుండి వెండి బంగారములు పంచియిచ్చిరి.
19. ఆ రీతిగా హోలోఫెర్నెసు అతని సైన్యములు రాజుకంటె ముందుగా యుద్ధమునకు బయలుదేరెను. వారు రథములతో, రౌతులతో, కాలిబంటులతో పశ్చిమ దేశములమీద దాడిచేయబోయిరి.
20. వారి వెనుక ఇతరజనులు వెళ్ళిరి. మిడుతలదండువలెను, ఇసుక రేణువులవలెను వారిసైన్యము అసంఖ్యాకముగానుండెను.
హోలోఫెర్నెసు విడిదిపట్టులు
21. వారు నీనెవెనుండి బయలుదేరి మూడు నాళ్ళు ప్రయాణముచేసి సిలీషియాకు ఉత్తరముననున్న పర్వతములలోని బెక్టిలెత్తు మైదానమున విడిది చేసిరి.
22. అచినుండి హోలోఫెర్నెసు తన కాలిబంటు లతోను, రౌతులతోను, రథములతోను కొండభూముల లోనికి ప్రయాణముచేసెను.
23. అతడు లిబియా, లూదియా దేశములను నాశనము చేసెను. కెలియోను దేశపు అంచున ఎడారి సరిహద్దులలో వసించు రస్సీ యులను, యిష్మాయేలీయులను దోచుకొనెను.
24. అచినుండి యూఫ్రీసు నదిని దాి మెసపొామియా గుండ ప్రయాణము చేసి అబ్రోను నదీతీరమున సము ద్రము వరకుగల సురక్షిత పట్టణములనెల్ల నాశనము చేసెను.
25. సిలీషియా మండలమును ప్రవేశించి అచట తనను ఎదిరించినవారినందరిని చిత్రవధ చేసెను. అరాబియా చెంతగల యాఫేతు దక్షిణపు పొలిమేరల వరకును దాడి చేసెను.
26. మిద్యానీయులను ముట్ట డించి వారి గుడారములను తగులబ్టెి, వారి గొఱ్ఱెల మందలను హతము చేసెను.
27. అటుపిమ్మట అతడు దమస్కు మైదానము లలోనికి పోయెను. అది గోధుమపైరునకు పంటకాలము. అతడు అచి పంటపొలములను తగులబెట్టెను. గొఱ్ఱెల మందలను, పశువులమందలను పాడుచేసెను. పట్టణ ములను దోచుకొనెను. పల్లెపట్టులను కొల్లగొట్టెను. యువకులందరిని చంపివేసెను.
28. అతని దాడికి సముద్రతీర వాసులెల్లరు కంపించిరి. తూరు, సీదోను, సూరు, ఓషీనా, యామ్నియా, అష్డోదు, అష్కెలోను నగరములలో వసించు వారెల్లరు తల్లడిల్లిరి.