యెహోషువ ఉత్తరదేశమును జయించుట
ఉత్తరదేశపు రాజులు ఐక్యమగుట
11 1-3. హాసోరు రాజగు యాబీను యెహోషువ విజయమునుగూర్చి విని, మాడోను రాజగు యోబాబు నకు, షిమ్రోను రాజునకు, అక్షాపు రాజునకు, ఉత్తర దేశపు పీఠభూములందలి రాజులకు, కిన్నెరోత్తుకు దక్షిణముననున్న లోయలోని రాజులకు, డోరుసీమకు ప్రక్క మన్యములలో పల్లములలో పరిపాలించు రాజులకు, తూర్పు పడమరలందు వసించు కనానీయు లకు, పీఠభూములందు వసించు అమోరీయులకు, హివ్వీయులకు, పెరిస్సీయులకు, యెబూసీయులకు, మిస్ఫాయందలి హెర్మోనున వసించు హిత్తీయులకు కబురు పంపెను.
4. వారందరు తమ సైన్యములతో, రథములతో, గుఱ్ఱములతో సముద్రతీరమునందలి ఇసుక రేణువులవలె అసంఖ్యాకులుగా కదలివచ్చిరి.
మేరోము వద్ద విజయము
5. ఆ రాజులందరు విడిది తావును నిర్ణయించు కొని మేరోము సరస్సునొద్ద దండు దిగి, యిస్రాయేలీ యులతో పోరాడుటకు సంసిద్ధులైరి.
6. యావే యెహోషువతో ”నీవు ఈ జనమును జూచి భయపడ వలదు. రేపు ఈపాికి వీరెల్లరు యిస్రాయేలీయుల చేతికి చిక్కిచత్తురు. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరములు తెగగ్టొి వారి రథములను కాల్చివేయు దువు” అని చెప్పెను.
7. యెహోషువ అతని వీరులు మేరోము సరస్సు నొద్దకు వచ్చి అకస్మాత్తుగా శత్రువుల మీదపడిరి.
8. యావే వారిని యిస్రాయేలీయులకు అప్పగించెను. యిస్రాయేలీయులు శత్రువులను ఓడించి తరిమిరి. పెద్దసీదోను వరకు, పడమట మిస్రెఫోత్తుమాయీము వరకు, తూర్పున మిస్ఫాలోయ వరకు శత్రువులను తరిమిక్టొిరి. వారిలో ఒక్కరిని గూడ మిగులనీయకుండ అందరిని మట్టుప్టిెరి.
9. యావే ఆజ్ఞాపించినట్లే యెహోషువ వారి గుఱ్ఱముల గుదికాలి నరములను తెగగ్టొి రథములను కాల్చి వేసెను.
హాసోరు, ఉత్తరదేశ పట్టణములు యిస్రాయేలీయుల వశమగుట
10. అంతట యెహోషువ తిరిగివచ్చి హాసోరును జయించి దానిని ఏలు రాజును కత్తికి బలిచేసెను. పై రాజ్యములన్నికి పూర్వము హాసోరే రాజధాని.
11. వారు అచి ప్రాణులనెల్ల శాపముపాలుచేసి వధించి నగరమును కాల్చివేసిరి.
12. యెహోషువ ఆ రాజనగరములను వానినేలు రాజులను ఓడించెను. దేవుని సేవకుడగు మోషే ఆజ్ఞాపించినట్లుగనే వారిని అందరను శాపముపాలు చేసి కత్తివాదరకెరచేసెను.
13. అయితే యెహోషువా హాసోరును కాల్చి వేసెను గాని, మెట్టప్రాంతములలో ఉన్న నగరములను వేనిని గూడ యిస్రాయేలీయులు కాల్చివేయలేదు.
14. ఈ నగరములనుండి వచ్చిన కొల్లసొమ్మును, పశువు లను యిస్రాయేలీయులు చేకొనిరి. కాని అచి జనుల నందరిని కత్తివాదరకెరచేసి సర్వనాశనము చేసిరి. ఊపిరియున్న ప్రాణియేదియు మిగులలేదు.
మోషే ఆజ్ఞలను యెహోషువ పాించుట
15. యావే మోషేకిచ్చిన ఆజ్ఞలనెల్ల మోషే యెహోషువ కొసగెను. అతడు ఆ ఆజ్ఞలనన్నిని వీసమెత్తుకూడ మీరలేదు.
16. ఆ దేశమంతయు యెహోషువనకు స్వాధీనమయ్యెను. పీఠభూములు, దక్షిణసీమలు, గోషెనుమండలము, పల్లపునేలలు, ఎడారి, ఎగువనేలలు, దిగువనేలలన్నియు యెహోషువ వశమయ్యెను.
17. సెయీరు వైపుగా పోవు హాలాకు కొండల నుండి హెర్మోను కొండల క్రిందనున్న బాల్గాదు లోయ లోని లెబానోను వరకుగల రాజులందరిని జయించి వధించెను.
18. ఈ రాజులతో యెహోషువ చాల కాలము యుద్ధము చేసెను.
19. హివ్వీయుల గిబ్యోను నగరము తప్ప ఒక్కపట్టణము కూడా యిస్రాయేలీయు లతో సంధిచేసికొనలేదు. ఆ పట్టణములన్నిని వారు యుద్ధమున జయించిరి.
20. ఈ ప్రజలందరు యిస్రాయేలీయులతో యుద్ధమునకు పూనుకొన చేయ నెంచి యావే వారి గుండెలను రాయిచేసెను. ప్రభువు మోషేతో సెలవిచ్చినట్లు ఆ ప్రజలను కనికరింపక సర్వనాశనము చేయవలయుననియే యావే తలంపు.
అనాకీయులు నాశమగుట
21. తరువాత యెహోషువ పీఠభూముల నుండియు, హెబ్రోను, దెబీరు, ఆనాబు నగరముల నుండియు యూదా యిస్రాయేలు పీఠభూముల నుండి అనాకీయులనందరను తుడిచివేసెను. వారిని వారి పట్టణములను శాపముపాలు చేసెను.
22. గాజా, గాతు, ఆష్డోదులందు తప్ప యిస్రాయేలు దేశమున అనాకీయులలో ఒక్క పురుగైనను మిగులలేదు. 23. యావే మోషేతో సెలవిచ్చినట్లే యెహోషువ ఆ దేశము నంతిని వశపరచుకొనెను. అతదు ఆ దేశమును యిస్రాయేలీయులకు తెగలవారిగా వారసత్వభూమిగా పంచియిచ్చెను. దానితో యుద్ధములు సమసిపోయి, దేశమున శాంతి నెలకొనెను.