సంపదలు
31 1. సంపదలు కలవాడు
జాగరణలు చేయుచు తన బరువును కోల్పోవును.
సొత్తును గూర్చిన ఆందోళన
అతని నిద్రను చెరచును.
2. సొమ్ము చేసికోవలెనను చింత,
ఘోరవ్యాధివలె అతని నిద్రను పాడుచేయును.
3. ధనికుడు కష్టించి డబ్బు విస్తారముగా
ప్రోగుజేసికొనును.
తరువాత విశ్రాంతి తీసికొనుచు
సుఖములు అనుభవించును.
4. దరిద్రుడు కష్టించి స్వల్పాదాయము గడించును.
అతడు విశ్రాంతి తీసికొనునపుడు
చేతిలో పైసా ఉండదు.
5. ధనాశ గలవాడు సత్పురుషుడు కాజాలడు.
డబ్బు చేసికోగోరువాడు పాపమును కట్టుకొనును.
6. డబ్బువలన చాలమంది నాశనమైరి.
ధనమువలన వారు వినాశనమునకు చిక్కిరి.
7. ధనమువలన సమ్మోహితుడగు వానికది
ఉరియగును.
మూర్ఖులు ఆ ఉరిలో తగుల్కొందురు.
8. పాపమార్గమున డబ్బు కూడబెట్టనివాడును,
నిర్ధోషియైన ధనికుడును ధన్యుడు.
9. అి్టవాడు దొరకెనేని అతనిని అభినందింపవలెను
అతడు ధనికులెవ్వరును చేయలేని
అద్భుతమును చేసెను.
10. ఈ పరీక్షలో నెగ్గినవాడు
నిక్కముగా గర్వింపవచ్చును.
పాపము చేయగలిగినా చేయనివాడును,
పరుని మోసగింపగలిగినా మోసగింపనివాడును,
ఎవడైనగలడా?
11. అి్ట వాడెవడైన వున్నచో
అతని సంపదలు స్థిరముగా నిలుచునుగాక!
ప్రజలెల్లరు అతని మంచితనమును
సన్నుతింతురు.
విందులో ప్రవర్తింపవలసిన తీరు
12. విందును ఆరగించుటకు కూర్చుండినపుడు
నోరుతెరచి చూడకుము.
ఇచట ఎన్ని పదార్థములున్నవి
అని ఆశ్చర్యవచనములు పలుకకుము.
13. దృష్టిదోషము చెడ్డదని ఎరుగుము.
సృష్టిలో కింకంటె పేరాశగలది ఏదియును లేదు
కనుకనే అది మాిమాికి నీరుగార్చును.
14. నీ కింకి కనిపించిన పదార్థములనెల్ల
తీసికోవలదు.
వానిని తీసికొనునపుడు తోివారిని
ప్రక్కకు త్రోయవలదు.
15. ఇతరుల కోరికలు కూడ నీ కోరికలవింవే
కనుక తోడివారిని అర్థము చేసికొని
ఆదరముతో మెలగుము.
16. నీకు వడ్డించిన భోజనమును
మర్యాదగా భుజింపుము.
ఆత్రముతో తిందువేని ఎల్లరికి రోతప్టుింతువు.
17. భోజనము చేసి ముగించు వారిలో
నీవు మొది వాడవగుదువేని మర్యాదగానుండును
మితిమీరి తిందువేని జనులు నిన్నుమెచ్చరు.
18. పదిమందితో కలిసి భుజించునపుడు,
అందరికంటె ముందుగా నీవు
పదార్థములను తీసికోవలదు.
19. మర్యాద తెలిసినవాడు స్వల్పముగా భుజించును.
కొద్దిగా తిన్నచో నిద్రించునపుడు
ఆయాసపడనక్కరలేదు.
20. మితభోజనమువలన బాగుగా నిద్రపట్టును.
వేకువనే ఉత్సాహముతో మేల్కొనవచ్చును.
మితముమీరి తిన్నచో కడుపునొప్పియు,
నిద్రపట్టమియు దాపురించును.
21. అమితముగా తిన్నచో వెలుపలికి వెళ్ళి
వాంతి చేసికొనుము.
అప్పుడు నీకు ఆరోగ్యము చేకూరును.
22. కుమారా! నా పలుకులు ఆలకింపుము.
నన్ను నిర్లక్ష్యము చేయకుము.
కడన నీవు నా మాటలు నిజమని గ్రహింతువు.
నీవు చేయు పనులలోనెల్ల శ్రద్ధ పాింపుము,
రోగము నిన్ను పీడింపదు.
23. ఉదారముగా అన్నము పెట్టు
గృహస్థుని ఎల్లరును మెచ్చుకొందురు.
వారి మెప్పుకోలు ఉచితమైనదే.
24. కాని అరకొరగా అన్నము బెట్టువానిని
అందరు నిందింతురు.
వారినిందయు ఉచితమైనదే.
ద్రాక్షరసము
25. నీ గొప్పను నిరూపించుకొనుటకుగాను
అమితముగా త్రాగకుము.
మధువువలన చాలమంది నాశనమైరి.
26. నిప్పు మరియు నీరు
ఇనుము స్వభావమును పరీక్షించును.
త్రాగి వాదులాడు గర్వాత్ములకు పరీక్ష ద్రాక్షరసము
27. మితముగా సేవించినచో ద్రాక్షరసము
నరునికి అట్లే ఉత్తేజమునొసగును.
మధువులేనిచో జీవితమున ఉత్తేజము యుండదు
నరుల ఆనందము కొరకు అది కలిగింపబడినది.
28. తగిన కాలమున తగినంతగా సేవించినచో
ద్రాక్షరసము ఆనందోల్లాసములను చేకూర్చును.
29. కాని మితముమీరి త్రాగినచో అది ద్వేషమును,
కలహమును, పతనమును తెచ్చిపెట్టును.
30. త్రాగి మత్తెక్కియున్న మూర్ఖుడు కోపముతో
తనకు తానే కీడు చేసికొనును.
అతడు సత్తువ కోల్పోవును,
క్లొాటలకును దిగును.
31. తోడివాడు విందులో ద్రాక్షారసమును
సేవించుచుండగా
నీ ఋణము తీర్చనందుకుగాను
వానిని మందలింపకుము.
అతడు సుఖించుచుండగా
నీవు అతనిని చీవాట్లు పెట్టకుము.
అతనితో తగవులాడుటకుగాని,
నీ బాకీని చెల్లింపుమని పీడించుటకుగాని
అది అదను కాదు.