సమరియా మహిళలు

4 1. ”బాషాను గోవులవలె బలిసియున్న

               సమరియా మహిళలారా వినుడు!

               మీరు దుర్బలులను బాధించి,

               దరిద్రులను పీడించుచున్నారు.

               మద్యము తెండని

               మీ భర్తలను వేధించుచున్నారు.

2.           సర్వోన్నతుడైన ప్రభువు

               తన పావిత్య్రము మీదిగా బాసచేసెను.

               శత్రువులు మీకు కొక్కెములు తగిలించి,

               మిమ్ము లాగుకొనిపోవు రోజులు వచ్చును.

               మీరెల్లరును గాలమున చిక్కిన

               చేపలవింవారగుదురు.  

3.           మిమ్ము చేరువలోని

               ప్రాకారపు గండ్లయొద్దకు ఈడ్చుకొనిపోయి,

               హెర్మోను మార్గమున తోలుకొనిపోవుదురు.

               ఇది ప్రభువు వాక్కు.

యిస్రాయేలీయుల  మొండితనము, వారికి శిక్ష

4.           సర్వోన్నతుడైన ప్రభువిట్లనుచున్నాడు:

               ”యిస్రాయేలీయులారా!

               బేతేలునకు వెళ్ళి పాపము చేయుడు.

               గిల్గాలునకుపోయి

               మీ శక్తికొలది పాపము కట్టుకొనుడు.

               ప్రతి ఉదయకాల బలులు తెచ్చి అర్పింపుడు.

               ప్రతి మూడవరోజు పదియవవంతు

               పంటను అర్పింపుడు.

5.           వెళ్ళి కృతజ్ఞతాపూర్వకముగా

               దేవునికి పులిసిన పిండితో రొట్టెనర్పింపుడు.

               మీ స్వేచ్ఛార్పణలను గూర్చి

               గొప్పలు చెప్పుకొనుడు.

               ఇట్లు చేయుట మీకిష్టముకదా!

6.           నేను మీ నగరములన్నిలోను

               మీకు దంతశుద్ధిని కలుగజేసి,

               తినుటకు మీ స్థలములన్నిలో

               ఆహారము లేకుండ చేసితిని,

               అయినను మీరు నా చెంతకు మరలిరాలేదు.

7.            మీ కోతకాలమునకు ముందు

               మూడునెలలు వానలు లేకుండ చేసితిని.

               మీ నగరములలో ఒకదానిపై వాన కురిపించి మరియొకదానిపై కురిపింపనైతిని.

               మీ పొలములలో ఒకదానిపై వర్షము పడి మరియొక దానిపై పడనందున

               అది ఎండిపోవును.

8.           దప్పికవలన డస్సిపోయి

               చాలనగరముల   ప్రజలు నీికొరకు

               మరియొక నగరమునకు ఎగబడిరి.

               కాని అచటను వారికి వలసినంత

               నీరు దొరకదయ్యెను.

               అయినను మీరు నా చెంతకు తిరిగిరారైతిరి.

9.           నేను వేడిగాలులు పంపి

               మీ పైరులను మాడ్చివేసితిని.

               మిడుతలు మీ తోటలను, ద్రాక్షలను, అత్తిచెట్లను,

               ఓలివుచెట్లను మ్రింగివేసెను.

               అయినను మీరు నా చెంతకు మరలిరారైతిరి.   

10.         ఐగుప్తీయులకువలె

               మీకును అంటురోగము కలిగించితిని.  

               మీ యువకులను పోరున చంపితిని.

               మీ గుఱ్ఱములను నాశనము చేసితిని.

               మీ శిబిరములలోని శవములు వ్యాపింపచేయు దుర్గంధమును మీ ముక్కు పుటములు

               భరింపజాలవయ్యెను.

               అయినను మీరు నా చెంతకు మరలిరారైతిరి.

11.           సొదొమ గొమొఱ్ఱా ప్రజలనువలె

               మీలో కొందరిని చంపితిని.

               నిప్పుమంటలలోనుండి తీసిన కొరివివలె

               మీలో కొందరు బ్రతికిరి.

               అయినను మీరు నా చెంతకు మరలిరారైతిరి.

               ఇది ప్రభువు వాక్కు.

12.          కావున యిస్రాయేలీయులారా!

               నేను మిమ్ము దండింతును.

               నేనిట్లు చేయుచున్నానుగాన

               మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు.

దైవస్తుతి

13.          దేవుడే పర్వతములను చేసెను.

               వాయువులను కలిగించెను.

               ఆయన తన ఆలోచనలను

               నరులకు ఎరిగించును.

               పగిని రేయిగా మార్చును.

               ఉన్నతస్థలములపై నడయాడును.

               సైన్యములకధిపతియైన ప్రభువని ఆయనకు పేరు.

Previous                                                                                                                                                                                                  Next  

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము