పాస్క నియమము
1. ఐగుప్తుదేశములో ఉన్న మోషేతోను, అహరోనుతోను ప్రభువు ఈ విధముగా చెప్పెను: 2.”అన్ని నెలలలోను ఈనెల మీకు మొదిదగును. సంవత్సరములో ఈ నెలను మొదినెలగా పరి గణింపుడు.
3.యిస్రాయేలీయులతో మ్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు ‘ఈ నెలలో పదియవనాడు ప్రతివ్యక్తి తన కుటుంబమునకై ఒక గొఱ్ఱెపిల్లనుగాని, మేకపిల్లనుగాని అనగా ప్రతి ఇంికి ఒకగొఱ్ఱెపిల్లను గాని, మేకపిల్లనుగాని తీసుకొనిరావలయును.
4. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబమువారు చాలకపోయినచో కుటుంబయజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో, మొత్తముమీద ఎందరు భుజింతురో ముందుగనే నిర్ణయించుకొని ఆ మీదట పశువును ఎన్నుకొనవలయును.
5. పశువు అశుద్ధ మైనది కాకూడదు. అది ఒకఏడాది పోతు అయివుండ వలెను. మేకలనుండి గాని, గొఱ్ఱెలనుండిగాని దానిని ఎన్నుకొనవచ్చును.
6. ఈ నెలలో పదునాలుగవరోజు వరకు ఆ పశువును మీవద్దనే ఉండనిండు. అప్పుడు యిస్రాయేలీయుల సమాజమువారందరు ప్రొద్దు గూకిన తరువాత దానిని వధింపవలయును.
7. అంతట దాని నెత్తురు తీసికొనిపోయి వారు తాము మాంసము తిను ఇంివాకిళ్ళ రెండు నిలువుకమ్ముల మీదను, పై అడ్డకమ్మి మీదను పూయవలయును.
8. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలయును. పొంగనిరొట్టెలతో చేదు మొక్కకూర లతో ఆ మాంసమును తినవలయును.
9. పచ్చిమాంస మును గాని ఉడుకబ్టెిన మాంసమునుగాని తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీనితోపాటు పశువును పూర్తిగా నిప్పులలోకాల్చియే తినవలయును.
10. మరునాి ప్రొద్దుికి ఆ మాంసములో ఒక్క ముక్కయైనను మిగులరాదు. మిగిలిన దానిని నిప్పులలో కాల్చివేయ వలయును.
11. మాంసము ఈ క్రిందివిధముగా తినవలయును. తినునపుడు మీ నడుమునకు ద్టీ ఉండవలయును. కాళ్ళకు చెప్పులు ఉండవలయును. చేతిలోకఱ్ఱ ఉండవలయును. మాంసమును గబగబా తినవలయును. ఇది ప్రభువు పాస్క1బలి.
12. ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమునందు తిరుగాడుదును. ఐగుప్తుదేశమునందలి నరుల, పశువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తుదేశ దేవతలకెల్ల శిక్షలు విధింతును. నేను యావేను!
13. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమియు చేయక మీ ఇండ్లు దాి పోయెదను. నేను ఐగుప్తుదేశమును నాశనము చేయు నప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. 14. ఈరోజు మీకు జ్ఞాపకార్థదినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసికొనవలయును. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును.
పొంగని రొట్టెల పండుగ
15. ఏడురోజులపాటు మీరు పొంగని రొట్టెలను తినవలయును. మొదిరోజుననే రొట్టెల పిండిని పులియచేయు పదార్థమును మీ ఇండ్లనుండి పారవేయ వలయును. మీలో ఎవ్వడైన మొది రోజునుండి ఏడవరోజు వరకు ఏనాడైన పొంగిన రొట్టెలను తినినచో, వాడు యిస్రాయేలీయులనుండి వెలివేయ బడును.
16. మీరు మొదిరోజున, ఏడవ రోజున పవిత్రసభ చేయవలయును. ఆ రెండు రోజులలో మీరు ఏపనిని చేయరాదు. వంటకమును మాత్రము వండుకొనవచ్చును.
17. మీరు ఈ పొంగనిరొట్టెల పండుగ తప్పక జరుపుకొనవలయును. ఏలయన నేను ఆ దినమే మీ సైన్యములను ఐగుప్తుదేశమునుండి వెలుపలికి చేర్చితిని. యుగయుగములవరకు శాశ్వతముగా ఈ రోజును పర్వదినముగా లెక్కింపుడు.
18. మొది నెలలో పదునాలుగవరోజు సాయంకాలమునుండి ఇరువది ఒకటవరోజు సాయంకాలమువరకు మీరు పొంగని రొట్టెలు తినవలయును.
19. ఏడురోజులవరకు మీ ఇండ్లలో రొట్టెలను పులియజేయు పదార్థము ఉండ రాదు. మీలో ఎవ్వడైనను పొంగిన రొట్టెలను తినినచో, వాడు స్వదేశీయుడైనను, విదేశీయుడైనను యిస్రాయేలీ యుల సమాజమునుండి వెలివేయబడును.
20. మీరు పొంగినరొట్టెలు ఏమాత్రమును తినకూడదు. మీ ఇండ్లన్నిలో పొంగనిరొట్టెలనే తినవలయును.”
పాస్క విధులు
21. అంతట మోషే యిస్రాయేలీయుల పెద్దల నెల్ల రప్పించి వారితో ”వెళ్ళి మీమీ కుటుంబములను బ్టి మందలనుండి పిల్లలను ఎన్నుకొనుడు. పాస్కబలిగా వానిని వధింపుడు.
22. చిలుకరించు (హిస్సోపు) కుంచెను తీసికొని పాత్రములోనున్న పశురక్తమున ముంచుడు. ఆ నెత్తురును కుంచెతో వాకి నిలువు కమ్ములమీద, పై అడ్డకమ్మిమీద పూయుడు. ప్రొద్దు పొడుచువరకు మీలో ఎవ్వడును గడపదాి బయికి పోరాదు.
23. ఐగుప్తుదేశమును నాశనము చేయుటకై యావే అంతట తిరుగాడును. నిలువుకమ్ములమీద, పై అడ్డకమ్మిమీద నెత్తురు పూతలనుచూచి యావే వాకిలి దాిపోవును. వినాశకారిని మీ ఇండ్లలోనికి ప్రవేశింపనీయడు.
24. తరతరములవరకు మీరును, మీ సంతతియు ఈ నియమములను విధిగా పాింప వలయును.
25. యావే తాను మాట ఇచ్చిన భూమికి మీరు చేరుకొనినపుడు ఈ ఆచారమును నిర్వ హింపుడు.
26. మీ బిడ్డలు ‘ఈ ఆచారమేమి?’ అని మిమ్ము అడిగినపుడు మీరు వారితో 27. ‘ఇది యావే పాస్కబలి. ఆయన ఐగుప్తుదేశములోని యిస్రాయేలీ యుల ఇండ్లమీదుగా దాిపోయెను. ఐగుప్తుదేశము నెల్ల నాశనము చేసెను. కాని మన యిస్రాయేలీయుల ఇండ్లను వదలివేసెను’ అని చెప్పుడు” అనెను. ఆ మాటలువిని యిస్రాయేలీయులు తలలువంచి దేవునికి నమస్కరించిరి.
28. యిస్రాయేలీయులు అక్కడినుండి వెళ్ళిపోయి ప్రభువు మోషే అహరోనులను ఆజ్ఞాపించి నట్లే చేసిరి.
పదియవ అరిష్టము: తొలిచూలుబిడ్డల చావు
29. అర్థరాత్రి యావేదేవుడు ఐగుప్తు దేశము నందలి తొలిచూలు బిడ్డలనెల్లచంపెను. సింహాసన మునకు వారసుడైన ఫరోరాజు ప్రథమసంతానము మొదలుకొని, చెరసాల చీకిగదిలో మ్రగ్గుచున్నవాని మొదిబిడ్డవరకును ఐగుప్తుదేశమునందలి తొలిచూలు పిల్లలందరిని ఆయన చంపెను. పశువుల తొలిపిల్లల నంతిని నాశనము చేసెను.
30 ఫరోరాజు, అతని కొలువువారు, ఐగుప్తుదేశీయులు ఎల్లరును రాత్రివేళ మేల్కొని లేచినపుడు ఐగుప్తుదేశమందంతట శోకా రావము మిన్నుమ్టుినది. దేశమున చావుమూడని ఇల్లు అనునదిలేదు.
31. ఆ రాత్రియే ఫరోరాజు మోషే అహరోను లను పిలిపించి ”పొండు! మీరును, మీ యిస్రాయేలీ యులును వెంటనే నా ప్రజను వదలివెళ్ళుడు. వెళ్ళి మీరు కోరినట్లే యావేను ఆరాధింపుడు.
32. మీరు చెప్పినట్లే మీ మందలను తోలుకొనిపొండు. నన్నుకూడ దీవింపుడు” అనెను.
33. ”మీరు వెళ్ళనిచో మేముగూడ చత్తుము” అనుచు ఐగుప్తుదేశీయులు యిస్రాయేలీ యులను తమ దేశమునుండి వెళ్లిపోవలయునని తొందరప్టిెరి.
34. అంతట యిస్రాయేలీయులు పిండిపులియక మునుపే ఆ పిండిపిసుకు గిన్నెలను మూటలుక్టి భుజములమీద వేసికొని వెడలిపోయిరి.
ఐగుప్తుప్రజలను దోచుట
35. యిస్రాయేలీయులు మోషే చెప్పినట్లు వెండి, బంగారునగలు, వస్త్రములు ఇమ్మని ఐగుప్తు దేశీయులను అడిగిరి.
36. యావే ఐగుప్తుదేశీయులకు యిస్రాయేలీయుల పట్ల గౌరవము కలుగజేసెను. అందుచేవారు యిస్రాయేలీయులు అడిగినవానినెల్ల ఇచ్చివేసిరి. ఈ విధముగా యిస్రాయేలీయులు ఐగుప్తు ప్రజలను దోచుకొనిరి.
యిస్రాయేలీయుల నిర్గమనము
37. యిస్రాయేలీయులు రామెసేసునుండి సుక్కోతు నకు బయలుదేరిరి. వారందరు ఆరులక్షల కాల్బల ముగా వెడలిరి. వారి స్త్రీలు, పిల్లలు ఈ లెక్కలో చేర లేదు.
38. పలుఅన్యతెగలవారు అసంఖ్యాకముగా వారిలో వచ్చిచేరిరి. లెక్కలకందని గొఱ్ఱెలమందలు, గొడ్లమందలు వారితోవెళ్ళెను.
39. యిస్రాయేలీయులు ఐగుప్తుదేశమునుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియకముందే వారు ఐగుప్తు దేశమునుండి న్టెివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధము చేసికొనువరకునైన వారు ఆ దేశమున నిలువ లేకపోయిరి.
40. యిస్రాయేలీయులు ఐగుప్తుదేశములో గడిపినకాలము నాలుగువందల ముప్పది యేండ్లు.
41. నాలుగువందలముప్పది ఏండ్లు ముగి సిననాడే యావే సైన్యము ఐగుప్తుదేశమును వదలెను.
42. ఐగుప్తుదేశమునుండి తమను తరలించునందు లకు యిస్రాయేలీయులు యావేకు ఆచరింపదగిన జాగరణ రాత్రియిది. యిస్రాయేలీయులు తరతరముల వరకు యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు.
పాస్క నియమము
43. యావే మోషే అహరోనులతో ”దీనిని పాస్క నియమముగా భావింపుడు. పరదేశి ఎవ్వడును ఈ పాస్కభోజనము తినరాదు.
44. కాని మీరు సొమ్ముకు కొన్న బానిసకు సున్నతిచేయించిన తరువాత ఈ భోజనమును పెట్టవచ్చును.
45. అన్యజాతివాడుగాని, కూలివాడుగాని ఈ భోజనమును తినరాదు.
46. మీరు అందరును ఒక్క ఇంినీడనే మాంసమును తినవల యును. ఒక్క మాంసపుముక్కయిన ఇంినుండి బయికి తీసికొనిపోరాదు. ఒక్క ఎముకనైన విరుగ గొట్టరాదు.
47. యిస్రాయేలీయుల సమాజమంతయు ఈ పండుగ చేసికొనవలయును.
48. మీవద్దనున్న పరదేశి యెవ్వడైనను యావేపేర పండుగ చేసికొనగోరి నచో ముందు అతని కుటుంబమునందలి పురుషు లందరు సున్నతి చేయించుకొనవలయును. అప్పుడు అతడు ఈ ఉత్సవములో పాల్గొనవచ్చును. అి్టవాడు మీ దేశమున ప్టుిన వానిక్రిందనే లెక్క. సున్నతి చేసికొననివాడు ఎవ్వడును ఈ పండుగలో పాల్గొన రాదు.
49. మీతో ఉన్న స్వదేశీయులకును, మీలో నివసించు విదేశీయులకును ఈ నియమమే వర్తించును” అనెను. 50.యిస్రాయేలీయులందరు యావే చెప్పినట్లే చేసిరి. ప్రభువు మోషే అహరోనులను ఆజ్ఞాపించినట్లే ఒనర్చిరి.
51. ఆనాడే యావే యిస్రాయేలు సైన్యము లను ఐగుప్తుదేశమునుండి తరలించెను.