దేవుని సేవకులు

3 1. సోదరులారా! నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మ్లాడిన విధమున మీతో మ్లాడలేక  పోయితిని. లౌకికులనియు, క్రెస్తవ విశ్వాసములో పసిబిడ్డలనియుయెంచి నేను మీతో మ్లాడవలసి వచ్చినది.

2. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనముతోగాక పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంతేకాదు, ఇప్పటికిని మీరు భుజింపగల స్థితిలో లేరు.

3. ఏలయన, ఇప్పటికిని మీరు శరీర సంబంధులై జీవించుచున్నారు గదా! అసూయాపరులై, ఒకరితో ఒకరు కలహించుచుండుటచే, ఇంకను మీరు శరీరసంబంధులుగ, మానవమాత్రులుగ జీవించు చున్నట్లే గదా!

4. ఒకడు, ”నేను పౌలు అనుయా యుడను” అనియు, మరియొకడు ”నేను అపొల్లో సహచరుడను” అనియు పలుకుచున్నప్పుడు, మీరు కేవలము లోకసంబంధిత వ్యక్తులుగా ప్రవర్తించుట లేదా?

5. నిజమునకు అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే. ప్రతివ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును.

6. నేను విత్తనమును నాటితిని, అపోల్లో నీరు పోసెను. కాని దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే.

7. నిజమునకు విత్తువాడును, నీరు పోయు వాడును ముఖ్యులుకారు. ఏలయన, మొక్కకు పెరుగుదల నొసగు దేవుడే ముఖ్యుడు. 8. విత్తువానికిని, నీరుపోయు వానికిని భేదమే లేదు. వాని వాని పనినిబట్టి ప్రతివ్యక్తి కిని దేవుడు ప్రతిఫలమును ఇచ్చును.

9. మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము. మీరు దేవుని పొలము. మీరు దేవుని గృహమునై యున్నారు.

10. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పివలె పనిచేసి పునాదిని వేసితిని. వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కాని తన నిర్మాణ విషయమున ప్రతివ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను.

11. ఏలయన, యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప, వేరొక పునాదిని ఎవడును వేయజాలడు.

12. పునాదిపైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లుదుబ్బును వాడుదురు.

13. క్రీస్తు దినము దానిని బహిరంగ పరచిననాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును. ఏలయన, ఆనాటి అగ్నిజ్వాల ప్రతివ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ ఆగ్ని   దానిని పరీక్షించి దాని నిజస్వభావమును ప్రదర్శించును.

14. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానము పొందును.

15. కాని ఎవని కృషియైనను దగ్ధమై పోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కాని ఆ అగ్నినుండి తప్పించు కొనెనో అనునట్లు, అతడు మాత్రము రక్షింపబడును.

16. మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా?

17. ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన, దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము.

18. ఎవడును తనను తాను మోసగించు కొనరాదు. మీలో ఎవడైనను లౌకికమైన విలువలను బట్టి తనను వివేకిగా ఎంచుకొనెనేని, నిజముగ వివేక వంతుడగుటకు గాను అతడు అవివేకి కావలెను.

19. ఏలయన ఈ లోకముచే వివేకముగా పరిగణింప బడునది దేవునిదృష్టిలో అవివేకము. లేఖనములో వ్రాయబడినట్లుగ, ”వివేకవంతులను వారి తెలివితేటలలోనే దేవుడు బంధించును.”     

20. ”వివేకవంతుల ఆలోచనలు శూన్యములని ప్రభువునకు తెలియును”

21. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడును గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే.

22. పౌలు, అపొల్లో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు ఇవి అన్నియును మీవే.

23. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము