బబులోనియా ప్రభువు శిక్షాసాధనము

25 1. యోషీయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజుగానున్న కాలము నాలుగవయేట యూదా అంతిని గూర్చి నేను ప్రభువువాక్కును వింని. ఇది నెబుకద్నెసరు బబులోనియాను పరిపాలించు కాలము మొదియేడు.

2. యూదా యెరూషలేము ప్రజలందరితోను నేను ఇట్లింని.

3. ”ఆమోను కుమారుడగు యోషీయా యూదాను పరి పాలించు కాలము పదమూడవ యేినుండియు, ఇరువది మూడేండ్లపాటు ప్రభువు నాకు తన వాక్కును విన్పించుచువచ్చెను. ఆయన నాకు విన్పించిన సంగతు లను నేనెప్పికప్పుడు మీకు తెలియజేయుచునే యుింని. కాని మీరు నా పలుకులను లెక్కచేయలేదు.

4. ప్రభువు తన సేవకులైన ప్రవక్తలను ఎల్లవేళల మీ చెంతకు పంపుచునేయుండెను. కాని మీరు వారి పలుకులను వినలేదు. లెక్కచేయలేదు.

5. వారు ‘మీరు మీ దుష్టమార్గముల నుండియు, దుష్కార్యముల నుండియు వైదొలగవలెనని చెప్పిరి. అట్లయిన ప్రభువు మీకును, మీ పితరులకును ఇచ్చిన నేలమీద మీరు శాశ్వతముగా జీవింపవచ్చునని చెప్పిరి.

6. మరియు ఆ ప్రవక్తలు మీరు అన్యదైవములను సేవించి పూజింపరాదనిరి. మీరు స్వయముగా చేసికొనిన విగ్రహములను ఆరాధించి ప్రభువు కోపమును రెచ్చ గొట్టరాదనియు, మీరు ఆయన మాట పాించిన యెడల ఆయన మిమ్ము శిక్షింపడనియు నుడివిరి.

7. కాని ప్రభువే మీరు తనమాట వినలేదని వాకొను చున్నాడు. మీరు స్వయముగా చేసికొనిన విగ్రహము లతో ప్రభువు కోపమును రెచ్చగ్టొి ఆయన శిక్షను కొనితెచ్చుకొింరి.

8. మీరు ప్రభువు మాట వినరైతిరి. కనుక సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు: 9. నేను  ఉత్తరదేశపు  జాతులన్నిని  పిలిపింతును. నా సేవకుడును బబులోనియా రాజునగు నెబుకద్నెసరును రప్పింతును. వారు యూదా మీదికిని,  దాని ప్రజలమీదికిని, దాని చుట్టుపట్లనున్న జాతుల మీదికి దండెత్తివత్తురు. నేను ప్రజలనెల్లరిని సర్వనాశ నము చేయుదును. వారి వినాశనము చూచి జనులు కలకాలము వరకును వెరగందునట్లును, భయ భ్రాంతులు అగునట్లును చేయుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

10. నేను ఆ జనుల సంతోషనాదమును, వివాహములలో వారి వధూవరులు చేయు ఆనంద ధ్వానములను అణచివేయుదును. వారి తిరుగళ్ళు ధాన్యమును విసరవు. వారి దీపములు వెలగవు.

11. ఈ దేశమంతయు పాడువడిపోయి ఎల్లరికిని ఆశ్చర్యము కలిగించును. ఈ జాతులు డెబ్బదియేండ్ల పాటు బబులోనియా రాజునకు దాస్యము చేయును.

12. ఆ కాలము ముగిసినపిదప నేను బబులోనియా ప్రజలను, వారి రాజును వారి పాపములకుగాను శిక్షింతును. నేను ఆ దేశమును నాశనముచేసి అది ఎల్లకాలము వరకును పాడువడి యుండునట్లు చేయుదును.

13. నేను యిర్మీయా ద్వారా మ్లాడినపుడు ఆ దేశము మీదికి రప్పింతునన్న శిక్షలన్నింని, ఈ గ్రంథమున లిఖింపబడిన దండనములన్నింని రప్పించి తీరుదును.

14. నేను బబులోనియా ప్రజలుచేసిన దుష్కార్యములు వారి నెత్తిమీదికే దిగివచ్చునట్లు చేయుదును. పెక్కుజాతులును, మహాప్రభువులును వారిని బానిసలుగా ఏలుదురు.”

ప్రభువు అన్యజాతులను శిక్షించును

15. యిస్రాయేలు దేవుడైన ప్రభువు నాతో ఇట్లనెను: ”నీవు నా కోపముతోనిండిన ఈ పాన పాత్రమును తీసికొని, నేను నిన్ను పంపు జాతులన్నిం యొద్దకును పొమ్ము. ఆ జాతులచే దీనిలోని పానీయ మును త్రాగింపుము.

16. ఆ ప్రజలు ఈ పాత్రలోని రసమును త్రాగి తెలివిని కోల్పోయి తూలి పడుదురు. నేను వారిమీదికి పంపు యుద్ధమువలన ఈ కార్యము జరుగును.”

17. కనుక నేను ప్రభువు చేతినుండి ఆ పాత్ర మును తీసికొని ఆయన నన్ను పంపిన జాతులన్ని చెంతకును పోయి వానిచే దానిలోని రసమును త్రాగించితిని.

18. యెరూషలేమును దాని రాజు లును, నాయకులును, యూదా నగరములును దానిలోని రసము త్రాగునట్లు చేసితిని. ఆ పట్టణ ములు పాడువడి చూచువారికి భీతిగొల్పెను. ప్రజలు ఆ నగరముల పేర్లను శాపవచనములుగా వాడు కొనిరి. నేికిని వాడుకొనుచున్నారు.

19-26. మరియు ఆ పాత్రమునుండి రసము త్రాగినవారి పేరులివి:

               –              ఐగుప్తు ఫరోరాజు, అతని ఉద్యోగులు, అతని ప్రజలు, అతని దేశములోని పరదేశులు. 

               –              ఊజు దేశపు రాజులెల్లరు.

               –              ఫిలిస్తీయాలోని అష్కెలోను, గాజ, ఎక్రోను నగరములును, అష్డోదున మిగిలియున్నవారును.

               –              ఎదోము, మోవాబు, అమ్మోను ప్రజలు.

               –              తూరు, సీదోను రాజులెల్లరు.

               –              మధ్యధరాసముద్రతీర ప్రాంతములందలి రాజులందరు.

               –              దదాను, తేమా, బూజు నగరములు.

               –              తలలు బోడిగా గొరిగించుకొను ప్రజలెల్లరు.

               –              అరాబియా దేశ రాజులెల్లరు.

               –              ఎడారి తెగల రాజులందరు.

               –              సిమ్రీ, ఏలాము, మాద్యా రాజులందరు.

               –              దూరమునగాని, దగ్గరలోగాని ఉన్న

                              రాజులెల్లరు ఒకరి తరువాత నొకరు.

భూమిమీది జాతులెల్ల ఆ పాత్రమునుండి రసమును త్రాగవలెను. కట్టకడన వారి తరువాత షెషాక్‌ రాజు త్రాగవలెను.

27. ”అంతట ప్రభువు నాతో ఇట్లనెను: ‘సైన్యము లకు అధిపతియైన ప్రభుడను, యిస్రాయేలు దేవుడనైన నేను ఈ జాతుల జనులను తప్పత్రాగ ఆజ్ఞాపించితినని చెప్పుము. వారు వాంతిచేసికొనునంత వరకును, క్రిందపడి పైకి లేవజాలకుండునంత వరకును త్రాగ వలెను. నేను వారి మధ్యకు పంపు ఖడ్గమువలన ఈ కార్యము జరుగును.’

28. ‘వారు నీ చేతినుండి పాన పాత్రమును తీసికొనుటకును దానినుండి రసము త్రాగుటకును ఇష్టపడరేని, త్రాగకతప్పదని నా పలుకు లుగా చెప్పుము.

29. నేను నా నగరముననే వినాశ మును ప్రారంభింతును. అచి ప్రజలు నా శిక్షను తప్పించుకోగలమని ఎంచుచున్నారు కాబోలు! అది పొసగదు. నేను భూమిమీది నరులెల్లరి మీదికిని యుద్ధము పంపుదును. ఇది సైన్యములకు అధి పతియు, ప్రభుడనైన నా వాక్కు.’

30. యిర్మీయా! నేను నీకు చెప్పిన సంగతులెల్ల        నీవు వారికి తెలియజేయుము.       వారితో ఇట్లనుము:

               ‘ప్రభువు ఉన్నతస్థలమునుండి గర్జించును.

               తన పవిత్రనివాసమునుండి

               భీకరనాదము చేయును.

               ఆయన తన ప్రజలనుగాంచి గర్జించును.

               ద్రాక్షపండ్లను నలగద్రొక్కు వానివలె కేకలిడును.

               లోకములోని నరులెల్లరు

               ఆయన ధ్వానమును ఆలింతురు.

31.          ఆ నాదము నేల ఎల్లెడల విన్పించును.

               ప్రభువు జాతులమీద నేరముతెచ్చును,

               ప్రజలనందరిని తీర్పునకు పిలుచును,

               దుర్మార్గులను వధించును. ఇది ప్రభువు వాక్కు.’

32.        ”సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లనుచున్నాడు:

               జాతి తరువాత జాతికి వినాశము దాపురించును.

               నేల అంచులనుండి పెనుతుఫాను పుట్టును.

33. ప్రభువు చంపివేసిన వారి పీనుగులు ఆ దినమున నేలపై ఒక కొననుండి మరియొక కొన వరకును వెదజల్లబడును. ఎవరును వానినెత్తుకొని పోయి పాతిపెట్టరు. అవి నేలమీద ఎరువు కుప్పలవలె పడియుండును. ఆ మృతులకొరకు ఎవరును విలపింపరు.

34.         కాపరులారా! మీరు విలపింపుడు.

               విూరు పెద్దగా కేకలిడుడు.

               బూడిదలో బడి పొర్లాడుడు.

               మిమ్ము వధించు కాలమాసన్నమైనది.

               మేలైన పొట్టేళ్ళనువలె మిమ్ము వధింతురు.

35. నాయకులైన మీరిక పారిపోజాలరు.

               కాపరులైన మీరిక తప్పించుకోజాలరు.

36.        అదిగో నాయకులు ఆక్రందనము చేయుచున్నారు.

               కాపరులు గొంతెత్తి అరచుచున్నారు.

37.         ప్రభువు కోపముతో వారి జనులను

               నాశనము చేసెను.

               ప్రశాంతమైన వారి దేశమును పాడుచేసెను.

38.        సింహము తనపొదను విడనాడినట్లే

               ప్రభువు తన అజ్ఞాతమును విడనాడెను.

               యుద్ధమువలనను, ప్రభువు కోపమువలనను

               వారి దేశము ఎడారియైపోయినది.”