ఎజ్రా, నెహెమ్యాలు ప్రజలను కూడగట్టుకొనుట

ఎజ్రా యెరూషలేము చేరుట

7 1-5. ఈ సంఘటనలు ముగిసిన తరువాత, అర్తహషస్త పారశీకదేశమును పరిపాలించుకాలమున సెరాయ కుమారుడగు  ఎజ్రా బబులోనియా దేశము నుండి యెరూషలేము నగరమునకు వచ్చెను. అతని వంశకర్తలు క్రమముగా- అసర్యా కుమారుడగు సెరాయ, అసర్యా, హిల్కియా, షల్లూము, సాదోకు, అహీటూబు, అమర్యా, అసర్యా, మెరాయోతు, సెరాహియా, ఉజ్జీ, బుక్కీ, ఫీనెహాసు, ఎలియెజెరు, ప్రధానయాజకుడగు అహరోను.

6. ఈ ఎజ్రా యిస్రాయేలు దేవుడైన ప్రభువు మోషేకు ప్రసాదించిన ధర్మశాస్త్రమున పండితుడు. ప్రభువు ఎజ్రాను చల్లనిచూపు చూచెను గనుక రాజు అతడు కోరినదంతయు ఒసగెను.

7. అర్తహషస్త ఏలుబడి ఏడవయేట యిస్రాయేలీయులు కొందరు, యాజకులు కొందరు, లేవీయులును, దేవాలయ గాయకులును, దేవాలయద్వారసంరక్షకులును, నెతీ నీయులును1 బయలుదేరి యెరూషలేమునకు వచ్చిరి.

8-9. వారు మొదినెల మొదిదినమున బబులోనియా నుండి  పయనమైరి.  ఐదవనెల  మొదిరోజున యెరూషలేము చేరుకొనిరి. ప్రభువు వారికి తోడై యుండెను.

10. ఎజ్రా నిష్ఠతో ధర్మశాస్త్రమును పరి శోధించి, దానిని ఆచరించుటకును, అందలి నియమ ములన్నిని యిస్రాయేలీయులకు నేర్పుటకును నిశ్చ యించుకొనెను.

అర్తహషస్త ఎజ్రాకు ఇచ్చిన శాసనము

11. అర్తహషస్త, యాజకుడును ధర్మశాస్త్ర పండి తుడునైన ఎజ్రాకిచ్చిన శాసనమిది. ఈ ఎజ్రా యిస్రా యేలునకు ప్రభువు ప్రసాదించిన ధర్మశాస్త్రవిధులను కక్షుణ్ణముగా ఎరిగినవాడు.

12. ”రాజాధిరాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును యాజకుడు నైన ఎజ్రాకు శుభములు పలికి వక్కాణించునది:

13.నీకు తెలిసియున్న ధర్మశాస్త్రమును యూదా, యెరూషలేమువాసులైన యూదులు ఎంతవరకు పాించుచున్నారో తెలిసికొనుటకు నీవు రాజుచేతను, అతని ఏడుగురు మంత్రులచేతను పంపబడితివి. కనుక మేము చేసిన నిర్ణయమేమనగా, 14.మా రాజ్య ములోను ఉండు యిస్రాయేలీయులలో వారి యాజ కులలోను, లేవీయులలోను యెరూషలేము పట్టణ మునకు వెళ్ళుటకు హృదయపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరును నీతోకూడ వెళ్ళవచ్చును.

15. యెరూషలేములో నివాసముగల యిస్రాయేలీయులు దేవునకు సమర్పించు వెండి బంగారు కానుకలను నీవు అచటకు కొనిపోవలయును.

16. పైగా నా రాజ్యమున నీవు సేకరించు వెండిబంగారములను, ఇచి యిస్రాయేలీయులు, వారి యాజకులు యెరూషలేమునందలి దేవాలయమునకు సమర్పించు కానుకలను నీవు అచటకు కొనిపోవలయును.

17. ఈ సొమ్ముతో నీవు కోడెలను, పొట్టేళ్ళను, గొఱ్ఱె పిల్లలను, ధాన్యమును, ద్రాక్షసారాయమును కొని యెరూషలేమునందలి బలిపీఠము మీద బలిగా సమర్పింపుము.

18. మిగిలిన సొమ్మును మీ దేవుని చిత్తప్రకారముగా నీవు, మీ దేశీయులు కోరుకొని నట్లుగా వెచ్చింపవచ్చును. 19. దేవాలయమున విని యోగించుటకు నీకీయ బడిన పాత్రలన్నిని నీవు యెరూషలేము దేవాలయమున అర్పింపవలయును.          

20. దేవాలయమునకు వలసిన ఇతర వస్తువులేమైన కావలయునేని మా రాజ్య ధనాగారమునుండి నీకు ఇయ్యబడును.

21. మరియు రాజునైన అర్తహషస్త అను నేను యూఫ్రీసునదికి పశ్చిమమునయున్న కోశాధికారులందరికి ఇచ్చు ఆజ్ఞ: ”ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును, యాజకుడునైన ఎజ్రా కోరినదంతయు క్రమము తప్పక సమకూర్ప వలయును.

22. వారతడు కోరిన వస్తువులను 7,500 వెండినాణెములవరకు, 500 కుంచముల గోధుమల వరకు, 550 బుడ్లు ద్రాక్షసారాయము వరకు, 500 బుడ్లు ఓలివునూనె వరకు సమకూర్పవలయును. ఉప్పు అడిగినంత ఈయవలెను.

23. ఆకాశమందలి దేవుడు తన దేవాలయార్చనకు కోరుకొనునదంత రాజోద్యో గులు సమకూర్పవలెను. ఆ దేవుడు నా మీదగాని, నా అనుయాయుల మీదగాని కినుక పూనరాదు.

24. దేవాలయమున కైంకర్యము చేయు యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారసంరక్షకులు, దేవా లయ పనివాండ్రనుండి రాజోద్యోగులు పన్నులు వసూలు చేయరాదు.

25. ఓయి ఎజ్రా! నీవు మీ దేవుడు నీకు ప్రసాదించిన వివేకముతో పశ్చిమ యూఫ్రీసు రాష్ట్రమున యావే ప్రభువు ధర్మశాస్త్ర మును అనుసరించి జీవించు ప్రజలందరికి పాల కులను, న్యాయాధిపతులను నియమింపుము. తెలియ నివారికి నీవు ధర్మశాస్త్రమును బోధింపుము.

26. ఎవరైనను దేవుని ధర్మశాస్త్రములకును, ఈ నాఆజ్ఞల కును బద్ధులుకారేని వారికి ఉరికంబము, ప్రవాసము, ఆస్తిజప్తు, చెర మొదలైన శిక్షలను విధింపవలయును.”

ఎజ్రా దేవుని స్తుతించుట

27. అప్పుడు ఎజ్రా యిట్లనెను: ”మన పితరుల దేవుడు స్తుతింపబడును గాక! ఆయన  యెరూషలేము నందలి మన ప్రభువు దేవాలయమును రాజు గౌరవించునట్లు చేసెను.

28. ప్రభువు కృపవలన నేను ఆ రాజు, అతని సలహాదారులు, ఉన్నతోద్యో గులు మొదలగు వారి ఆదరమునకు నోచుకొింని. ప్రభువు నాకు ధైర్యమును ప్రసాదించెను. కనుకనే నేను చాలా మంది యిస్రాయేలీయులను నా వెంట కొనిరాగలిగితిని.”

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము