మోవాబునకు ప్రతికూలముగా

48 1.      సైన్యములకు అధిపతియైన ప్రభువు

               మోవాబును గూర్చి యిట్లనెను:

               ”నెబోనకు అనర్ధము వాిల్లినది, అది నాశనమైనది.

               కిర్యతాయిము విరోధులకు చిక్కినది

               దాని కోట కూలినది. దాని ప్రజలు గగ్గోలుప్టిెరి.        

2.           మోవాబు వైభవము అంతరించినది.

               శత్రువులు హెష్బోనును జయించిరి.

               రండు, మోవాబు జాతిని

               నాశనము చేయుదమనెదరు.

               మద్మేను నేల మట్టమగును.

               శత్రుసైన్యములు దాని మీదికి దండెత్తుదురు.

3.           మాకు వినాశము, హింస దాపురించినవి, 

               అని హోరోనాయిము ప్రజలు  అరచుచున్నారు.

4.           మోవాబు ధ్వంసమయ్యెను.

               అందలి పిల్లల ఏడుపులు ఆలింపుడు.

5.           లూహితునకు ఎక్కిపోవు త్రోవవెంట

               ప్రజల దీనాలాపములు ఆలింపుడు.

               హోరోనాయిమునకు దిగిపోవు మార్గమువెంట

               జనుల శోకాలాపములు వినుడు.

6.           వారు, మీరు శీఘ్రమే పారిపొండు.

               ఎడారిలోని అరూహవృక్షమువలె ఉండుడి.

7.            మోవాబూ! నీవు నీ కోటలను,

               సంపదలను నమ్మితివి.

               కాని శత్రువులిపుడు నిన్ను జయింతురు.

               నీ దేవుడైన కెమోషు తన యాజకులతోను

               అధికారులతోను ప్రవాసమునకు పోవును.

8.           ఒక్క నగరమును వినాశనమును

               తప్పించుకోజాలదు.

               లోయయు మైదానమును నాశనమగును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

9.           మోవాబునకు సమాధి సిద్ధముచేయుడు.

               అది త్వరలోనే నాశనమగును.

               దాని నగరములు ఎడారులగును.

               వానిలో ఇక ఎవరును వసింపరు.

10. పూర్ణహృదయముతో ప్రభువు కార్యమును నెరవేర్చనివాడు శాపగ్రస్తుడు అగును. కత్తితో జనులను నరకనివాడు శాపగ్రస్తుడగును.

మోవాబు నగరములు నాశనమగును

11. ప్రభువిట్లనెను:

               మొదినుండియు మోవాబు

               సురక్షితముగా జీవించెను.

               ఆ దేశము ప్రవాసమును ఎరుగదు.

               అది ఏకపాత్రమున కుదురుకొనియున్న

               ద్రాక్షసారాయము వింది.

               దానిని పాత్రనుండి పాత్రలోనికి పోయరైరి.

               కనుక దాని సువాసన అంతరింపలేదు,

               రుచి చెడిపోలేదు.

12. కాని నేను శత్రువులను పంపు సమయము వచ్చినది. పాత్రమునుండి ద్రాక్ష సారాయమువలె వారు మోవాబును కుమ్మరింతురు. వారు మోవాబు ద్రాక్షరస పాత్రములను ఖాళీచేసి వానిని పగులగొట్టుదురు.

13. అపుడు యిస్రాయేలీయులు తాము నమ్ముకొనిన బేతేలు దేవతను చూచి నిరాశచెందినట్లే మోవాబీయులు, తాము కొలుచు కెమోషును చూచి నిరాశచెందుదురు.

14.          మోవాబీయులారా! మీరు మేము శూరులమనియు

               పోరున కాకలుతీరిన యోధులమనియు

               చెప్పుకోనేల?

15. మోవాబు, దాని నగరములు నాశనమైనవి.

               దాని యువజనులలో మెరుగైనవారు కూలిరి.

               రాజును, సైన్యములకు అధిపతియును

               ప్రభుడనైన నా వాక్కిది.

16.          మోవాబు త్వరలో కూలును.

               దాని  వినాశనము చేరువలోనేయున్నది.

17. మోవాబు దరిదాపులలో నివసించు జనులారా!

               దాని ప్రశస్తిని ఎరిగిన వారలారా!

               మీరు ఆ దేశము కొరకు విలపింపుడు.

               దాని పరిపాలనము ముగిసినదనియు

               దాని వైభవము అంతరించినదనియు పలుకుడు.

18. దీబోనున వసించుదానా!

               నీవు నీ సింహాసనము మీదినుండి దిగివచ్చి

               క్రింది దుమ్ములో చతికిలబడుము.

               మోవాబును నాశనముచేయువాడు రానేవచ్చెను. అతడు దాని కోటలను కూల్చెను.

19. అరోయేరున వసించుదానా!

               నీవు త్రోవ ప్రక్కన నిలుచుండి

               పారిపోవు వారిని ఏమి జరిగినదో అడుగుము.

20. వారు మోవాబు కూలి అవమానము చెందినది.

               మీరు దాని కొరకు విలపింపుడు,

               మోవాబు పాడువడినదని

               అర్నోను నదీ తీరమున విన్పింపుడు

               అని చెప్పుదురు.    

21-24. పీఠభూమిలోని హోలోను, యాహాసు, మేఫాతు, దీబోను, నేబో, బేత్‌దిబ్లతాయీము, కిర్యతాయీము, బేత్గాములు, బేత్మెయోను, కెరీయోతు, బోస్రా నగరములు దైవశిక్షకు గురియైనవి.

25.        మోవాబు పురములన్నియు

               దైవదండనమునకు గురియైనవి.

               ఆ దేశముయొక్క శక్తి అంతరించినది.

               దాని బలముడిగినది.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

మోవాబు అవమానము చెందును

26. ప్రభువిట్లు చెప్పెను: మోవాబును త్రాగి మత్తెక్కనిండు. అది నా మీద తిరుగబడెను. అది తన వమనము నందే తాను పడిపోయి పొర్లాడుచున్నది. ఎల్లరును దానిని చూచి నవ్వుదురు.

27. మోవాబూ! నీవు యిస్రాయేలీయులను గేలిచేసితివికదా! వారిని దొంగలతో సమానముగానెంచి ఎగతాళి చేసితివికదా!

28.        మోవాబీయులారా!

               మీరిక నగరములను విడనాడి

               కొండ శిఖరములలో వసింపుడు.

               లోయ అంచున గల కొండ కొమ్ములలో

               గూళ్ళు కట్టుకొను  గువ్వలవలె  కండు.

29. మోవాబునకు అమితముగా పొగరెక్కినది.

               దానికి కన్నులు నెత్తికి వచ్చినవి.

               ఎంత కండకావరము! ఎంత తలబిరుసుతనము!

               అది తనను గూర్చి

               తానెంత ఘనముగా ఎంచుచున్నది!

30. ప్రభుడనైన నాకు దాని గర్వము తెలియును.

               దాని ప్రగల్భములలో సారము లేదు.

               దాని విజయములు నిలుచునవి కావు.

31. కావున నేను మోవాబు కొరకును

               దాని ప్రజలందరి కొరకును విలపింతును.

               కీర్హేరెసు జనులకొరకు శోకింతును.

32. నేను యాసేరు ప్రజల కంటెను

               సిబ్మా ప్రజల కొరకు ఎక్కువగా దుఃఖింతును.

               సిబ్మా నగరమా!

               నీ ద్రాక్షతీగలు మృతసముద్రముగుండ

               యాసేరువరకు అల్లుకొనినవి.

               కాని ఇపుడు శత్రువులు వచ్చి నీ వేసవిపంటను

               నీ ద్రాక్షాఫలములను నాశనము  చేసిరి.

33.సారవంతమైన మోవాబునకు

               ఇక ఆనందోల్లాసములు లేవు.

               అచట ద్రాక్షపండ్లను త్రొక్కించు గానుగలనుండి

               ద్రాక్షారసము ఇక ప్రవహింపదు.

               ద్రాక్షాఫలములను త్రొక్కించువారుకాని,

               ఆనందముతో కేకలిడువారుకాని ఇకకన్పింపరు.

34. హెష్బోను ఎల్‌ అలెహ ప్రజలు కేకలిడు చున్నారు. వారి కేకలు యాహాసు వరకును వినిపించు చున్నవి. సోవరు ప్రజలు ఆ కేకలను ఆలించు చున్నారు. హోరోనాయిము, ఎగ్లాత్షెలీష్యా ప్రజలును వారి అరపులను ఆలించుచున్నారు. నిమ్రీము నది ఎండిపోయినది.

35. నేను మోవాబీయులు తమ దేవతలకు కొండలమీద బలులను, దహనబలులను అర్పింపకుండ అడ్డుపడుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

36. నాహృదయము మోవాబు కొరకును కీర్హేరెసు ప్రజల కొరకును శోకించుచున్నది. నా శోకము పిల్లన గ్రోవిమీద పాడు శోకగీతము వలెనున్నది. ఆ ప్రజల సొత్తంతయు నాశనమైనది.

37. వారు తలలు గొరిగించుకొని గడ్డములు కత్తిరించుకొనిరి. తమ చేతులమీద గాయములు  చేసికొని గోనెలు తాల్చిరి.

38. మోవాబు మిద్దెలమీద, వీధులలో, శోకాలాప ములు వినిపించుచున్నవి. నేను మోవాబును ఎవరికిని అక్కరకురాని కుండవలె పగులగ్టొితిని.

39. మోవాబు ధ్వంసమైనది. మీరు విలపింపుడు. మోవాబు నాశనమై అవమానము పాలైనది. ఇరుగుపొరుగు జాతులన్నియు దానినిచూచి భయపడుచున్నవి. ఇది ప్రభుడనైన నా వాక్కు.”

మోవాబు తప్పించుకోలేదు

40. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు:

               ఒకానొకజాతి,

               రెక్కలువిప్పిన గరుడపక్షివలె దిగివచ్చి

               మోవాబు మీద వాలును.

41. దాని నగరములును కోటలును పట్టువడును.

               ఆ దినమున మోవాబు సైనికులు

               ప్రసవించెడు స్త్రీవలె భయపడుదురు.

42.         నా మీద తిరుగబడినది.

               కనుక మోవాబు నాశనమగును.

               అది యిక ఒక జాతిగా మనజాలదు.       

43.         భీతియు, ఉరులును, గోతులును

               మోవాబు కొరకు కాచుకొనియున్నవి.

               ఇవి ప్రభువు పలుకులు.

44.         భీతినుండి తప్పించుకొనినవాడు గోతిలోకూలును.

               గోతినుండి బయటకి వచ్చినవాడు 

               ఉరులలో చిక్కుకొనును.

               ప్రభువు మోవాబును నాశనము చేయుటకు

               కాలము నిర్ణయించెను.

45. నిస్సహాయులైన శరణాగతులు 

               హెష్బోనున తలదాచుకో గోరుచున్నారు. 

               కాని ఆ నగరమునకు నిప్పంటుకొనినది. 

               సీహోనురాజు ప్రాసాదము తగులబడుచున్నది. 

               యుద్ధప్రియులైన మోవాబీయుల పొలిమేరలను

               కొండకొమ్ములను అగ్గి మాడ్చివేసినది.        

46. మోవాబునకు అనర్థము వాిల్లును.

               కెమోషును కొల్చిన ప్రజలు నాశనమగుదురు.

               వారి పుత్రీపుత్రులను బందీలుగా కొనిపోయెదరు.

47. కాని రాబోవు దినములలో ప్రభుడనైన నేను,

               మోవాబునకు అభ్యుదయమును ఒసగుదును.

               మోవాబునకు  ఈ  శిక్షలెల్లపడును.”