దావీదు నగరమున మందసము

15 1. దావీదు స్వీయనగరమున భవనములు నిర్మించుకొనెను. ప్రభు మందసమునకుగూడ ఒక స్థలమును సిద్ధముచేసి గుడారమును నిర్మించెను.

2. అతడు ”మందసమును లేవీయులు మాత్రమే మోసి కొనిరావలయును. మందసమును మోయుటకును, ఎల్లప్పుడు తనకు ఊడిగము చేయుటకును ప్రభువు వారినెన్నుకొనెను” అనెను.

3. తాను సిద్ధము చేసిన తావునకు మందసమును కొనివచ్చుటకై అతడు యిస్రాయేలీయులందరిని యెరూషలేమున ప్రోగు చేసెను.

4. అతడు అహరోను వంశజులను, లేవీయుల నుండి పిలిపించెను.

5. లేవీయులలో కోహాతు వంశమునుండి ఊరీయేలును, అతని బంధువులు 120 మంది వచ్చిరి.

6. మెరారి వంశమునుండి అసాయా అతని బంధువులు 220 మంది వచ్చిరి.

7. గెర్షోను వంశమునుండి యోవేలు అతని బంధువులు 130 మందివచ్చిరి.

8. ఎలీషాఫాను వంశమునుండి షెమాయా అతని బంధువులు 200 మంది వచ్చిరి.

9. హెబ్రోను వంశమునుండి ఎలీయేలు అతని బంధువులు 80 మందివచ్చిరి.

10. ఉస్సీయేలు వంశము నుండి అమ్మీనాదాబు అతని బంధువులు 112 మంది వచ్చిరి.

11. దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును మరియు లేవీయులైన ఊరీయేలు, అసాయా, యోవేలు, షెమాయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని పిలిపించెను.

12. అతడు వారితో ”మీరు లేవీయులకు పెద్దలు కదా! మీరును, మీ తోడి లేవీయులును శుద్ధిచేసుకొని యిస్రాయేలు దేవుడైన ప్రభువు మందసమును నేను సిద్ధముచేసిన స్థలమునకు కొనిరండు.

13. మొదిసారి మందసమును కొని వచ్చినపుడు మీరచటలేరు కనుకనే ప్రభువు మమ్ము శిక్షించెను. మేమతనిని ఉచితరీతిని కొనిరామై తిమి” అనెను.

14. అంతట యిస్రాయేలు దేవుడైన ప్రభువు మందసమును తీసికొని వచ్చుటకై యాజకులు, లేవీయులు తమనుతాము శుద్ధిచేసుకొనిరి.

15. ప్రభువు మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లే లేవీయులు దేవుని మందసమును దాని మోతకర్రలతో తమ భుజములపైన మోసికొని వచ్చిరి.

16. దావీదు లేవీయుల పెద్దలను పిలిచి ‘స్వర మండలములతోను, చితాళములతోను, సితారాల తోను గంభీరధ్వని చేయుచూ సంతోషకరమైన సంగీ తము పాడుటకు లేవీయులను నియమింపుడు’ అని చెప్పెను. 17-21. వారు కంచుతాళములను వాయించు టకు గాను యోవేలు కుమారుడైన హేమానును, అతని బంధువు బెరక్యా పుత్రుడైన ఆసాపును, మెరారి వంశమునకు చెందిన కుషాయా కుమారుడు ఏతానును ఎన్నుకొనిరి. వీరితోపాటు రెండవ వరుసగానున్న తమ బంధువులు జెకర్యా, బేను, యాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, బెనాయా, మాసెయా, మత్తత్యా, ఎలీఫ్లెహు, మిక్నేయా అనువారిని, ద్వార పాలకులగు ఓబేదెదోమును, యెయీయేలును గాయ కులుగా నియమించిరి. గాయకులయిన హేమాను, ఆసాపు, యేతానులు పంచలోహతాళములు వాయించు టకు నియమింపబడిరి. జెకర్యా, యెజీయేలు, సెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఎలీయాబు, మాసెయా, బెనాయా అనువారు తారాస్థాయి స్వరమండలములను వాయించుటకు నియమింప బడిరి. మరియు మత్తిత్యా, ఎలీఫ్ల్లేహు, మిక్నెయాహు, ఓబేదెదోము, యెహీయాలు, అసద్యా అనువారు రాగమెత్తుటకును, సితారా వాయించుటకును నియ మింపబడిరి.

22. లేవీయులకు అధిపతియైన కెనన్యా నేర్పుగల పాట గాడగుటచే ఈ సంగీతకారులకు పెద్దగా నియమించిరి. 23-24. ఓబేదెదోము యెహీయాలతో పాటు బెరక్యా, ఎల్కానాను మందసమునకు సంరక్షకు లుగా నుండిరి. యాజకులైన షెబన్యా, యోషాఫాత్తు, నెతనేలు, అమాసయి, జెకర్యా, బెనాయా, ఎలీయెసెరు మందసము ముందు బూరలను ఊదుటకు నియ మింపబడిరి. ఒబేదెదోము, యెహీయాయీములు అనువారు మందసమునకు వెనుక కనుపెట్టువారిగా నియమింపబడిరి.

మందసమును

యెరూషలేమునకు కొనివచ్చుట

25. దావీదు, యిస్రాయేలు నాయకులు, సహస్ర సైన్యాధిపతులు గొప్పసంబరముతో దైవమందసమును కొనివచ్చుటకై ఓబేదెదోము ఇంికివెళ్ళిరి.

26. మందసమును మోయు లేవీయులకు దేవుడు సహా యము చేయగా వారు ఏడుకోడెలను, ఏడుపొట్టేళ్ళను బలియిచ్చిరి.

27. సంగీతకారులు, వారి నాయకుడైన కెనన్యా, మందసమును మోయు లేవీయులు మొదలైన వారు మేలిమి నారబట్టలను ధరించిరి. దావీదుకూడ మేలిమి నారతో నేయబడిన ఎఫోదును ధరించెను.

28. ఆ రీతిగా యిస్రాయేలీయులెల్లరు బూరలు, కొమ్ములు, చితాళములు, స్వరమండలములు, సితారా మొదలైన వాద్యములను వాయించుచు సంతోషనాదములతో మందసమును యెరూషలేము నకు కొనివచ్చిరి. 29. మందసము నగరమును చేరుచుండగా సౌలు కుమార్తె మీకాలు కికీనుండి పారజూచెను. దావీదు నాట్యము చేయుచు సంతోష ముతో గంతులువేయుట గమనించి ఆమె తన మనసులో అతనిని తృణీకారముతో చూచెను.