నెహెమ్యా యూదాకు పయనమగుట

1 1. హకల్యా కుమారుడైన నెహెమ్యా పలుకులు: అర్తహషస్త ప్రభువు పరిపాలనాకాలమున ఇరువది యవయేట కీస్లేవు మాసములో నేను రాజధాని నగ రము షూషను కోటలో ఉంిని.

2. అప్పుడు మా సహోదరులలో ఒకడైన హనానీ మరికొందరు ప్రజ లతో యూదానుండి తిరిగివచ్చెను. ప్రవాసము నుండి తప్పించుకొనిపోయిన  యూదులను  గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని వివరములడిగి తిని.

3. వారు ”ప్రవాసము నుండి వెడలివచ్చి మన నేలపై స్థిరపడినవారు నానాయాతనలు, అవమా నములు అనుభవించుచున్నారు. యెరూషలేము ప్రాకారములు నేలమట్టములైయున్నవి. నగర ద్వార ములను కాల్చి బుగ్గిచేసిరి” అని పలికిరి.

4. ఆ మాటలు ఆలించి నేను నేలపైచతికిలబడి కన్నీరు కార్చితిని. చాలనాళ్ళు ఉపవాసము  చేయుచు విలపించితిని. అపుడు ప్రభువునిట్లు ప్రార్ధించితిని:

5. ”ఆకాశమందున్న ప్రభూ! నీవు మహా దేవుడవు. నీవనిన మాకు మిగులభయము. నిన్ను  ప్రేమించి  నీ  ఆజ్ఞలుపాించు వారితో నీ నిబంధ నమును నిలుపుకొందువు. వారిని కరుణతో సాకెదవు.

6. ప్రభూ! నావైపు చూచి నా పలుకులాలింపుము. నీ దాసులు యిస్రాయేలీయులకొరకు రేయింబవళ్ళు నేను చేయు వేడికోలును పెడచెవిన పెట్టకుము. యిస్రాయేలీయులమైన మేము అపరాధములను చేసితిమి. నేను, మా పూర్వులెల్లరము పాపములు చేసితిమి.

7. మేము దుష్కార్యములు చేసితిమి. నీ సేవకుడు మోషే ద్వారా నీవు ప్రసాదించిన ధర్మ విధులను, ఆజ్ఞలను పాింపమైతిమి.

8. ‘మీరు నాకు విశ్వాసద్రోహము చేయుదురేని నేను మిమ్ము ఆయా జాతుల నడుమ చెల్లాచెదరు చేయుదును. 9. కాని మీరు నన్ను శరణువేడి నాయాజ్ఞలను పాింతురేని మీరు దూరదేశములకు బహిష్కరింపబడియున్నను, నేను నా నామముంచుటకు ఏర్పరచుకొనిన ఆ తావు నకు మిమ్ము మరల కొనివత్తును’ అని నీవు పూర్వము నీ సేవకుడు మోషేద్వారా నుడివిన వాక్కును స్మరించు కొనుము.

10. నా దేవుడైన యావే! వీరు నీప్రజలు, నీదాసులు. మహాబలపరాక్రమములతో నీవే వీరిని కాపాడితివి.

11. ప్రభూ! ఇపుడు నా మొర ఆలింపుము. భయభక్తులతో నిన్ను పూజించు భక్తులందరి వేడి కోలును నీ వీనులచేర్పుము. నేడు నాకు సమృద్దిని ప్రసాదింపుము. ఈ రాజుకు నామీద దయపుట్టునట్లు చేయుము.”

ఆ కాలమున నేను రాజునకు పానీయవాహ కుడుగా ఉండెడివాడను.

Previous                                                                                                                                                                                                 Next